.
కేసీఆర్ అమలు చేసిన రైతుబంధు పథకంలో చాలా లోపాలున్నాయి… తను కౌలు రైతు పదం వింటేనే ఇరిటేషన్ ఫీల్ కావడం, సాగు చేయని రైతులకూ, ధనిక రైతులకూ డబ్బు ఇవ్వడం, రాళ్లు, గుట్టలు, రియల్ ఎస్టేట్, మైనింగ్ భూములకూ డబ్బులు ఇవ్వడం వంటి చాలా లోపాలున్నాయి, రాజకీయ లబ్ది తన అసలు ఉద్దేశం…
దాన్ని యథాతథంగా అమలు చేయలేదు, మొత్తం పీకేయలేదు ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కారు… రద్దు చేస్తే, ఇప్పటికే రైతుల్లో వ్యతిరేకత ఉంది, అది మరింత పెరుగుతుంది… ఏం చేయాలో తెలియక ఏదేదో ప్రకటిస్తూ మరింత సంక్లిష్టం చేస్తోంది… తాజాగా యోగ్యత ఉన్న భూములన్నింటికీ, భూపరిమితితో సంబంధం లేకుండా రైతుభరోసా అమలు చేస్తామని చెబుతోంది…
Ads
15 వేలు అన్నది మొదట్లో… ఇప్పుడు 12 వేలు అంటోంది… అసలు సాగులేని భూముల్ని మినహాయిస్తాం, కేవలం పేద రైతులకే దక్కేలా తక్కువ విస్తీర్ణ రైతులకే ఇస్తామని కొన్నిసార్లు… మళ్లీ రైతుల్లో వ్యతిరేకత వస్తుందని భయం… ఇప్పుడు సాగుయోగ్యతే ప్రామాణికం అంటున్నారు… సాగు యోగ్యత ఓ భ్రమపదార్థం… అంతా గందరగోళం… కేసీయార్ భాషలో చెప్పాలంటే… బభ్రాజమానం భజగోవిందం… సాగుయోగ్య భూముల గుర్తింపుకి మళ్లీ సర్వే అట, కాలయాపన… ఇదోరకం కొత్త జల్లెడ…
నిజానికి రైతుబంధును మించిన ప్రయోజనకరమైన ఆలోచనలు చేతగాక ఇవన్నీ… రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తారట… మరి కౌలు రైతులు..? మళ్లీ అదే కేసీయార్ బాపతు ఆచరణేనా.,.? మరి తనకూ మీకూ తేడా ఏమున్నట్టు..?
నిజంగా సాగుచేసేవాడికే ప్రభుత్వ ప్రోత్సాహం దక్కాలంటే… భూమి విస్తీర్ణాన్ని బట్టి డబ్బులు పంచడం కాదు… నిజంగా సాగుదారుకు భరోసాగా ఉండాలంటే… బోలెడు మార్గాలు… ప్రస్తుతం సంప్రదాయ వ్యవసాయం ఓ లాటరీ… కర్కశంగా అనిపించినా ప్రాణాంతకం… కౌలు రైతుల్లోనే ఆత్మహత్యలు ఎక్కువ… ఆ కుటుంబాలే బజారున పడుతున్నాయి అధికంగా…
సో, అసలు రైతులైనా కౌలు రైతులైనా సరే, ఎవరు పంటను మార్కెట్లకు తీసుకొస్తే వాళ్లకు క్వింటాల్‌కు ఇంత అదనపు మద్దతు ధర చెల్లించండి… మొన్న సన్నధాన్యానికి బోనస్ ఇచ్చినట్టుగా… అపరాలు, నూనెగింజలకు అదనపు ధర ఇవ్వండి… నిజంగా సాగుచేసినవాడికే ఆ ప్రయోజనం నేరుగా అందుతుంది… ఇప్పుడు సాగు విస్తీర్ణం పెంపు అవసరమైన అపరాలు, నూనెగింజల సాగూ పెరుగుతుంది… వాటి ధరలూ బాగుంటున్నాయి…
కాకపోతే ఇక్కడ చిన్న దుర్వినియోగం అవకాశం ఉంది… ఇరుగు పొరుగు రాష్ట్రాల వ్యాపారులు కూడా రైతుల పేర్లతో మన మార్కెట్లకు తీసుకొస్తారు… అందుకని రైతులకు, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి… అందరికీ రైతు బీమా పథకం పరిధిని 10 లక్షలకు పెంచాలి… ఇప్పుడు 5 లక్షలు… ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే అధికారిక విచారణలు, ప్రొసీజర్ అవసరం లేకుండా బీమా కంపెనీలు పరిహారం చెల్లించేలా… సాగుదారు కుటుంబాలకు అదీ ఓ భరోసా…
అన్నింటికీ మించి రైతుకు కావల్సింది పంటల బీమా… కేంద్ర పథకం సరిగ్గా లేదు, దాని లోటుపాట్లను చర్చించి, మంచి ఉపయుక్త బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించవచ్చు… ఇంకా చేయాలని ఉంటే ఎరువులకు సబ్సిడీ… ఎకరానికి ఇన్ని బస్తాలకు ఇస్తామని పరిమితి విధించొచ్చు… రైతు భరోసా ఖర్చులోనే ఇవన్నీ చేయొచ్చు… ఇంకొన్నీ చేయొచ్చు…
చేయాలనే సంకల్పం మంచిగా, బలంగా ఉంటే… అమలుపై చిత్తశుద్ధి ఉంటే… రాజకీయాలకు అతీతంగా నిజంగా రైతుకు, అంటే నిజమైన సాగుదారుకు అండగా నిలబడాలంటే బోలెడు మార్గాలు… రేవంత్ రెడ్డి సర్కారుకు ఖచ్చితంగా ఈ కోణంలో ఓ దశ లేదు, ఓ దిశ లేదు…! నిజం నిష్ఠురంగానే ఉంటుంది ఇలాగే…!!
Share this Article