Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రాఘవేంద్రరావు పూలూ పళ్లూ లేని స్ట్రెయిట్ కథాగమనం ఇది..!

January 12, 2025 by M S R

.

. (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)… …. ప్రముఖ హాస్యనటుడు ఆలీ బాలనటుడిగా నటించిన మొట్టమొదటి లేదా రెండో సినిమా 1980 లో వచ్చిన ఈ నిప్పులాంటి నిజం . హీరోయిన్ తమ్ముడిగా నటించాడు .

సినిమాకు నిజం చెప్పాలంటే హీరో సత్యనారాయణే . సినిమా ఇప్పుడు చూస్తుంటే యన్టీఆర్ జస్టిస్ చౌదరి సినిమా గుర్తుకొస్తుంది . ఇప్పుడు అని ఎందుకు అన్నానంటే జస్టిస్ చౌదరి కన్నా ముందు వచ్చిందీ సినిమా .

Ads

అసలీ సినిమాకు లాయర్ చక్రవర్తి కరెక్ట్ పేరు . ఈ సినిమాలో సత్యనారాయణ లాయర్ చక్రవర్తి .
సత్యనారాయణ తర్వాత చాలా బాగా నటించింది రావు గోపాలరావు . సాడిస్టిక్ విలన్ గా కర్కశంగా నటించారు . వీరిద్దరి తర్వాత షావుకారు జానకి . లాయర్ గారి భార్యగా , అమితమైన దైవభక్తి కల మహిళగా సెంటిమెంటల్ పాత్రను బాగా పోషించింది .

రాఘవేంద్రరావు దర్శకుడే అయినా ఆయన మార్క్ పెద్దగా కనిపించదు . పూలు ఉండవు , పళ్ళు ఉండవు . సత్యానంద్ , జంధ్యాల వ్రాసిన కధను యధాతథంగా నడిపించినట్లుగా ఉంటుంది . కధలో బలం ఉండటం వలన ఫలపుష్పాలు లేకపోయినా బాగానే ఆడింది .

డైలాగులను సత్యానంద్ వ్రాసారు . బాగానే ఉంటాయి . చక్రవర్తి సంగీత దర్శకత్వంలో వేటూరి వ్రాసిన పాటలు నాలుగూ శ్రావ్యంగానే ఉంటాయి . బయట హిట్ కాలేదు .

అబ్బోసి అవునందయ్యో కొబ్బరి మామిడి ముక్క , ఓ చక్కని చుక్కా ఈ చక్కిలిగింత , నూజివీడు చిన్న రసం నా సరసం , సన సనజాజుల సరదా బుల్లెమ్మ పాటలు శ్రావ్యంగానే ఉంటాయి . నాలుగూ డ్యూయెట్లే .

మురళీమోహన్ , రాజ్యలక్ష్మి , కాంతారావు , అల్లు రామలింగయ్య , గిరిజ , పి జె శర్మ చలపతిరావు ప్రభృతులు నటించారు . సినిమా , పాటల వీడియోలు యూట్యూబులో ఉన్నాయి . ఇంతకుముందు చూసి ఉండకపోతే సత్యనారాయణ అభిమానులు తప్పక చూడతగ్గ సినిమాయే . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎంతటి మంచి భరోసా ఆర్యా… ఇదొక జీవిత బీమా ధీమా…
  • ఫాఫం, ఈ బీసీ కెరటం చివరకు కవిత క్యాంపులో విరిగిపడిందా..?!
  • సితారే జమీన్ పర్..! గుడ్ టేస్ట్, గుడ్ స్టోరీ, గుడ్ ఎఫర్ట్… గుడ్ మూవీ..!!
  • మానస్ పేలవం… రష్మి, సుధీర్ కళకళ… సుమ, ప్రదీప్ డౌన్ ఫాల్…
  • రష్మిక మంధాన శుక్రమహర్దశ..! నాగార్జున చెప్పింది అక్షరసత్యం..!
  • కజ్జాలు, అలకలు, కటీఫ్‌లు… ఆ గానకోకిల వెలుగు చిత్రానికి మరోవైపు…!!
  • భలే చమత్కారివి కవితమ్మా… పదేళ్లు ఆగీ ఆగీ హఠాత్తుగా ఐదూళ్ల మాట..!!
  • ఫాఫం సాక్షి..! చంద్రబాబు మీద కోపంతో యోగాపై రప్పారప్పా దాడి..!!
  • వేణుస్వామీ… రామోజీ ఫిలిమ్ సిటీలో దెయ్యాలట… ఏమైనా చేయగలవా..?!
  • ఏదో రప్పా రప్పా రాసేశావు గానీ… జగన్‌ ఎలా ‘ఇరుక్కుంటాడు’..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions