.
‘‘ ప్రభుత్వానికి సంబంధించిన విషయాలలో విధాన నిర్ణయాలు తీసుకొనే అధికారం ముఖ్యమంత్రికి మాత్రమే ఉంటుంది. ముఖ్యమంత్రికి పోటీగా ఉప ముఖ్యమంత్రి ప్రకటనలు చేస్తే దాని ప్రభావం వేరుగా ఉంటుంది. ఉప ముఖ్యమంత్రి అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు. సాంకేతికంగా చూస్తే పవన్ కల్యాణ్ ఇతర మంత్రులతోపాటు మరో మంత్రి మాత్రమే.
ఆయన మంత్రిగానే ప్రమాణ స్వీకారం చేశారు. తను స్వతంత్రంగా వ్యవహరించాలని పవన్ కల్యాణ్ కోరుకోవడం ఆయన కోణంలో సరైనదే కావచ్చు. ప్రభుత్వపరంగా చూస్తే అది వాంఛనీయమా..?
Ads
….. ఇవీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొత్త పలుకులు… నిజమే… పవన్ కల్యాణ్ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు… తనే ముఖ్యమంత్రిగా భావిస్తున్నాడు… చంద్రబాబు పలు విషయాల్లో తెల్లమొహం వేస్తున్నాడు… ఏమీ చేయలేడు… ఏమీ అనలేడు… ఫాఫం…
సీజ్ ది షిప్ దగ్గర నుంచి ఒరేయ్, మీరు సారీ చెప్పండర్రా అని టీటీడీ బాధ్యులను ఆదేశించడం దాకా… చలమలశెల్లి గ్రీన్‌కో పొగడ్తల దాకా… తనే సీఎం అన్నట్టుగా… విధాన నిర్ణయాలు ప్రకటించాల్సింది, చెప్పాల్సింది సీఎం,..
రాధాకృష్ణకు మండుతోంది… కాదు, చంద్రబాబుకు మండుతోంది… కాకపోతే తను నేరుగా చెప్పలేడు… అసలే కూటమి ప్రభుత్వం… పైగా బీజేపీ అనుకూల జనసేన… గతం వేరు, అప్పట్లో అది బీజేపీ వ్యతిరేక సేన… తనను ఏమీ అనలేడు, తను ఆగడు… తనకు అసలు పాలన విధానాలే తెలియవు… సో, తన తరఫున ఆర్కే చెబుతున్నాడు… ఓ సంకేతం ఇస్తున్నాడు పవన్ కల్యాణ్‌కు,..
ఎస్, డిప్యూటీ సీఎం అనేది జస్ట్, గౌరవప్రదమైన ఒక సంబోధన మాత్రమే… ఆ పోస్టుకు విశేష అధికారాలేమీ ఉండవు… ఆ లెక్కన జగన్ ఏకంగా ఐదుగురిని డిప్యూటీలు అన్నాడు… అజాగళ స్థనం అంటారు ఈ పోస్టును… జస్ట్, డిప్యూటీ సీఎం అంటే ఒక మంత్రి మాత్రమే సిస్టం కోణంలో… కానీ తను పవన్ కల్యాణ్ కదా, చంద్రబాబును మించి విధాన నిర్ణయాలు ప్రకటిస్తున్నాడు, పర్యటిస్తున్నాడు, పరామర్శిస్తున్నాడు… తనకేమీ తెలియదు, చెప్పినా వినడు…
తనే కాదు, బీజేపీ కూడా… ఆర్కే చెప్పినట్టు ఏపీలో మూడు పార్టీలూ స్వతంత్రంగా అధికారం దక్కించుకున్నట్టే వ్యవహరిస్తున్నాయి… టుబి ఫ్రాంక్… జనసేనకు అభ్యర్థులు లేకపోతే, బీజేపీ అభ్యర్థులు లేకపోతే ఆ కోటా సీట్లలో అభ్యర్థులను అడ్జస్ట్ చేసింది చంద్రబాబు… అదీ జగన్ వ్యతిరేక వోటుతో అందరూ గట్టెక్కారు… అదెవరి గెలుపూ కాదు, కన్నూమిన్నూ కానక దరిద్రంగా పాలించిన జగన్‌కు జరిగిన శాస్తి… అంతే…
కానీ పవన్ కల్యాణ్‌ను రాధాకృష్ణ నిందించలేడు తన ఒరిజినల్ శైలిలో… కారణం, పవన్ కల్యాణ్ తన ఇష్ట కూటమి భాగస్వామి గనుక… తనే చెబుతున్నాడు, కూటమి చీలితే మళ్లీ జగన్ వస్తాడట వచ్చే ఎన్నికల్లో… అదీ భయం… అందుకే తమాయించుకుంటున్నాడు… సో, ఆర్కే భాషలో చెప్పాలంటే…
పవన్ కల్యాణ్ జస్ట్, డిప్యూటీ… అంటే ఓ మంత్రి మాత్రమే… తను సీఎం కాదు… తను చంద్రబాబుకు ఇరిటేషన్ తెప్పించకూడదు… చంద్రబాబుదే గత ఎన్నికల్లో అసలైన గెలుపు… దాన్ని విస్మరించి కదిలితే, చంద్రబాబు గనుక ఉపేక్షిస్తే, కూటమి భాగస్వాములను కంట్రోల్ చేసుకోలేకపోతే… అది చంద్రబాబు దౌర్భాగ్యం… అసలే లోకేష్ ఆల్రెడీ యాక్టింగ్ సీఎం అయిపోయాడు… కాస్త చూసుకోవయ్యా 14 ఏళ్ల ముఖ్యమంత్రీ..!!
Share this Article