.
బిగ్‌బాస్ షో చూసినవాళ్లకు గుర్తు… హౌజులో చిరంజీవి బొమ్మతో, కంట్రీ డిలైట్ అనబడే పాల ప్యాకెట్ల యాడ్… బయట కూడా బాగానే ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు…
కానీ అదే బిగ్‌బాస్ షోలో మణికంఠ అనే ఓ మెంటల్ కేరక్టర్ పాల్గొన్నాడు… మధ్యలోనే చేతులెత్తేసి, కాడికిండ పడేసి, పారిపోయి వచ్చాడు… చివరకు తను కూడా ఈ మిల్క్ యాడ్‌లో కనిపించాడు ఎక్కడో…
Ads
అబ్బో, చిరంజీవి రేంజ్‌కు ఎదిగిపోయాడే అనుకుంటూ… యాడ్ చూస్తుంటే నాలుగు ఆర్డర్ ఇస్తే నాలుగు ఫ్రీ అని కనిపించింది… అబ్బే, వన్ ప్లస్ వన్ కాదు… ఫస్ట్ ఆర్డర్ నాలుగు ఉంటే మరో నాలుగు అట… నేను ట్రై చేస్తే ఏం తేడా కొట్టిందో నాకు వర్తించలేదు… బహుశా ప్రచారం కోసమే కావచ్చు ఆ ఆఫర్లు… టెస్ట్ కిట్ కూడా పంపించాడు… మా ప్యూరిటీ చెక్ చేసుకొండి అన్నట్టుగా… అది సరేగానీ…
తీరా చూస్తే అది అర లీటర్ ప్యాక్ కాదు, 450 ఎంఎల్… అంతే… దాని ధర 38… అంటే లీటర్‌కు రఫ్‌గా 85 రూపాయలు పడుతోంది… పైగా ఇదేమీ క్రీమ్ మిల్క్, హోల్ మిల్క్ కాదు… టోన్డ్ మిల్క్ మాత్రమే… అదే అమూల్, హెరిటేజ్ వంటి పాపులర్ బ్రాండ్లు హోల్ మిల్క్ అర లీటర్‌కు 39 తీసుకుంటున్నాయి… అంటే రఫ్‌గా 78 రూపాయలు… అంటే కంట్రీ డిలైట్ ఎందుకు తీసుకోవడం మరి..? డెలివరీ చార్జీలు, టెస్ట్ కిట్ల ధరను ఇలా వసూలు చేస్తున్నాడన్నమాట…
ఈ జ్ఞానోదయం అయ్యింది, వదిలేశాం సరే… కానీ జియో వాడి టారిఫ్స్ గుర్తొచ్చాయి… నెల అంటాడు, తీరా చూస్తే 28 రోజుల వేలిడిటీ ఉంటుంది కొన్ని ప్యాకుల్లో… అంతేనా..? ఒకటి ఏడాది ప్యాక్ ఉంది… 336 రోజులే వేలిడిటీ… అంటే పేరుకు ఏడాది, ఇచ్చేది 11 నెలలు… మరో నెల..? జేబుకు బొక్క…
జియోనే కాదు, రిలయెన్స్ సేవలన్నీ అంతే… హిడెన్ మర్మాలతో కొడతాడు… ఫస్ట్ మొనాటనీ వచ్చేలా చేసి, తరువాత బాదుతాడు… ప్రస్తుతం జియో కనెక్షన్ల టారిఫుల్లాగే…! ఈ కంట్రీ డిలైట్ వాడిది కూడా అంతే… కాకపోతే వీళ్లది పక్కా చీటింగ్ అనలేం… బాహాటంగానే రాస్తారు 450 ఎంఎల్ అని… చూసి జాగ్రత్తపడాల్సింది వినియోగదారుడే…
మన బంగారు నగల దుకాణం గుండు బాస్ చెప్పినట్టు ‘చూసి కొనండి, పోలిక బేరీజు వేసుకుని కొనండి…’ కానీ ఏమాటకామాట… మరీ బిగ్‌బాస్ మణికంఠ కూడా ప్రచారం చేస్తున్న ఈ యాడ్ చిరంజీవి కూడా చేస్తున్నాడు… డబ్బు కోసం మరీ ఇలాంటి యాడ్స్ చేయాలా తను బ్రాండ్ అంబాసిడర్‌గా..? పైగా బాగా బదనాం అయిన కంపెనీకి..!!
నెట్‌లో చెక్ చేస్తుంటే గతంలో తీన్మార్ మల్లన్న ఈ కంపెనీ మిల్క్‌పై ఆరోపణలు చేసినవి, తెలంగాణ ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు చేసిన తనిఖీల్లో అవసరమైన (Fssai) అనుమతులు లేకుండానే ఉత్పత్తులు అమ్ముతున్నట్టు వార్తల వీడియోలు గట్రా కనిపించాయి… ఓహో, ఐతే ఈ మిల్క్ కంపెనీ కథ చాలానే ఉందా..? చాన్నాళ్లుగా..!!
Share this Article