.
Veerendranath Yandamoori పరిజ్ఞానo (knowledge) వేరు. తెలివి (intelligence) వేరు. ఒక లెక్కకి జవాబు చెప్పటానికి (లేదా సమస్యకి పరిష్కారం కనుక్కోవటానికి) తన నాలెడ్జ్ ఉపయోగించటాన్ని తెలివి అంటారు. Ability to convert knowledge into solution is intelligence.
(a+b)²= a²+b²+2ab అని స్కూల్లో చెప్తారు. అది నాలెడ్జ్. (b+a)² కి కూడా ‘అదే జవాబు’ అని తెలుసుకోవటం తెలివి. ఇది ఏ కాలేజీలోనూ చెప్పరు. sin θ/cos θ=tan θ అని స్కూల్లో చెప్తారు. అది నాలెడ్జ్. మనకున్న నాలెడ్జీతో (sin θ/cos θ) x (tan θ/tan² θ)=1 అని సమాధానం చెప్పటం తెలివి.
Ads
ఎంత తొందరగా సమాధానం చెప్పగలమూ అన్నది ప్రతి స్పందన (reflex action). ఫ్యాను సమస్య ప్లగ్‌లో వుందా, వైర్‌లో వుందా లేక ఫ్యాన్‌లో వుందా అనేది గుర్తించ గలగటం ‘నాలెడ్జ్’. ఫ్యాను విప్పి, అందులో మిస్టేక్ ఎక్కడ వుందో తెలుసుకోగలగటం ‘అనుభవం’.
కరెంటు వైరుని ముట్టుకోకుండా వుండటం ‘మెచ్యూరిటీ’. తొందరగా రిపేరు చేయటం ‘నైపుణ్యం’. అన్నిటి కన్నా ముందు… ఫ్యాను ఆగి పోవటానికి కారణం అది పాడవటమా, లేక కరెంటు లేదా అని చూసుకోవటం ‘కామన్ సెన్స్’.
నాలెడ్జ్ ఉన్న ప్రతీవాడూ తెలివైనవాడు కాకపోవచ్చు. తెలివైనవాడికి సాధారణంగా కాస్తో కూస్తో నాలెడ్జ్ ఉంటుంది. నాలెడ్జ్ లేకుండా, కేవలం తెలివి వున్నవాడిని ‘అతి తెలివి గాడు’ అంటాము. తెలివి లేకుండా కేవలం నాలెడ్జ్ వున్న వాడిని ‘శుష్క పండితుడు’ అంటాము.
తెలివి పంచదార. పాలు నాలెడ్జ్. సేమ్యాలు అనుభవాలు. యాలకులు తర్కం. జీడిపప్పు లేటరల్ థింకింగ్..! ఉట్టి సేమ్యాలు తినలేము. పది యాలకులు నమల లేము. గుప్పెడు పంచదార మొహం మొత్తుతుంది. విడివిడిగా ఏవీ బాగోవు. సేమ్యాలు, యాలకులు, పంచదార అన్నీ కలిపితే వచ్చేది మధురమైన పాయసం… “జ్ఞానం”..! జ్ఞానానికి మించిన పై మెట్టు లేదు…
Share this Article