.
కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకుడు కిషన్ రెడ్డి సంక్రాంతి ఉత్సవం నిర్వహించాడు ఢిల్లీలోని తన నివాసంలో… గ్రామీణ కళాకారులను పిలిచాడు… మోడీ, ఇతర మంత్రులు, తెలంగాణ -ఏపీ నాయకులు, గవర్నర్లు, పార్టీ ఎంపీలు తదితరులు హాజరయ్యారు…
గుడ్, గతంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇలాంటి తెలుగు ఆతిథ్యాలను ఇచ్చేవాడు… తులసి పూజ చేశాడు మోడీ… గంగిరెద్దుకు ఫుడ్ తినిపించాడు… మంగళదీపం వెలిగించాడు… అక్కడ ఎవరో ఏదో చెబితే అదే తెలంగాణ సాంస్కృతిక సంక్రాంతి… సరే, పర్లేదు…
Ads
అక్కడ ఇతర అతిథులకన్నా ఎక్కువ ప్రయారిటీ చిరంజీవికి దక్కింది… మోడీ పక్కనే కూర్చుని ముచ్చట్లు పెట్టాడు… తను బీజేపీ నాయకుడు కాదు, తను ఏ పదవిలోనూ లేడు… అసలు రాజకీయాల్లోనే లేడు… ఓ వెటరన్ తెలుగు సినిమా హీరో… ఆ విశిష్ట ఉత్సవంలో నిజానికి తను కాస్త ఆడ్‌గా కనిపించాలి… కానీ లేదు… విశిష్ట అతిథి తను…
అందరి కనుబొమలూ ముడిపడ్డాయి… మోడీ ఏమిటంత ప్రయారిటీ ఇస్తున్నాడు అని… మోడీ వంటి నేత కనబరిచే చనువు వెనుక ఎప్పుడూ ఓ మార్మిక కారణం ఉంటుంది… అదే ఏమిటనేది ఇప్పుడు తెలుగు రాజకీయ సర్కిళ్లలో చర్చనీయాంశం…
తెలంగాణలో సరైన వ్యూహం లేక… కాదు, సరైన నాయకుడు లేక… కేసీయార్‌తో మితృత్వమో, శతృత్వమో ఆ పార్టీ సానుభూతిపరులకే తెలియక… దిక్కూ దివాణం లేకుండా కొట్టుకుపోతోంది పార్టీ… గట్టిగా దెబ్బతిని కునారిల్లుతున్నా సరే, ఈరోజుకూ రేవంత్ వైఫల్యాలు, ప్రజావ్యతిరేక నిర్ణయాల మీద బీఆర్ఎస్ మాత్రమే పోరాడుతోంది…
బీజేపీ నిస్తేజం… లక్ష్మణ్, కిషన్‌రెడ్డి తదితరుల నాయకత్వం, కేసీయార్‌తో వాళ్ల సంబంధాలపై పార్టీ కేడర్‌కు ఎప్పుడూ అనుమాన దృక్కులే… బండి సంజయ్ దూకుడు తగ్గింది, తనకు సబ్జెక్టు నాలెడ్జి తక్కువ… పీడీఎస్‌యు భావజాలం నుంచి వచ్చిన ఈటల ఈరోజుకూ పార్టీలో సరిగ్గా ఇమడలేకపోతున్నాడు… ఓ అన్నామలై కావాలిప్పుడు… కానీ రానివ్వరు సోకాల్డ్ పెద్ద నేతలు…
మరి ఏపీ..? వైసీపీ రెడ్డి పార్టీ, కాంగ్రెస్ దిక్కూదివాణం లేని పార్టీ, టీడీపీ కమ్మ పార్టీ… మరి బీజేపీకి..? అప్పట్లో కాపులను ఆర్గనైజ్ చేయాలనే భావనతో ఓ కాపు నాయకుడికి పగ్గాలు ఇచ్చారు, అట్టర్ ఫ్లాప్… తరువాత పవన్ కల్యాణ్ మీద పడింది కన్ను…
ఫుల్ ఎంకరేజ్ చేస్తున్నారు… కేవలం తన కోసమే చంద్రబాబుతో దోస్తీ.,. సరే, కూటమి క్లిక్కయింది… కానీ చంద్రబాబును ఎప్పుడూ నమ్మేది లేదు… పైగా ఇప్పుడు తన ఎంపీల బలం మీద కేంద్ర ప్రభుత్వ మనుగడ… సో, కాపులను మరింత బలంగా ఆర్గనైజ్ చేయడం కోసం పవన్ కల్యాణ్‌ను, చిరంజీవిని ట్రంపు కార్డులుగా వాడుకోవాలనేది ఆలోచనగా తెలుస్తోంది…
అబ్బే, బీసీలను ఆర్గనైజ్ చేస్తేనే ఫలితం అంటారా..? ఏమో, బీసీ కృష్ణయ్య వంటి నేతల్ని దువ్వుతున్నా సరే నమ్మకం లేదు… తను ఎప్పుడు ఎటు పోతాడో తెలియదు… పైగా తనది తెలంగాణ… ఏపీలో నమ్మదగిన లీడర్లు లేరు… పెద్ద పెద్ద ‘ఆర్థిక అక్రమార్కుల’ను చేరదీసినా నయా పైసా ఫాయిదా లేదు… అసలు ఎవరు పార్టీలో ఉన్నారు, ఎవరు వెళ్లిపోయారో ఎవరికీ తెలియదు…
చిరంజీవి రాజకీయాల్లో లేడు, ఇక రాడు… ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేశాక, ఇక సినిమాలకే పరిమితమై ఏవో ఆ డాన్సులు, ఆ ఫైట్లు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు… తన లక్ష్యం కూడా తమ్ముడు పవన్ కల్యాణ్‌ను మంచి ప్లేసులో చూడాలని… ఒకవేళ చిరంజీవి మళ్లీ రీఎంట్రీ ఇచ్చినా సరే జనం ఇక నమ్మరు… పొలిటికల్ క్రెడిబులిటీ కోల్పోయాడు కదా… రీ- యాక్సెప్టెన్సీ కష్టం…
సరికొత్త సనాతన ధర్మపరిరక్షకుడి అవతారం ఎత్తిన పవన్ కల్యాణ్ తనే ఓ సీఎంగా వ్యవహరిస్తున్నాడు… చంద్రబాబుకు లోలోపల ఎలా ఉందో గానీ తను రాను రాను చంద్రబాబుకు దుస్సహంగా మారడం ఖాయం… ఒకవేళ లోకేష్‌కు సీఎం పదవి ఇచ్చి, చంద్రబాబు తెర వెనుక రాజకీయాలకే పరిమితమయ్యే పక్షంలో అప్పుడు ముసలం ఖాయం అనిపిస్తోంది… మోడీషా అడుగుల్ని అప్పుడు వేచి చూడాలి..!
Share this Article