.
ఫాఫం, అందుకే తిక్క శంకరయ్య అనాలనిపిస్తోంది… అదేనండీ, దర్శకుడు శంకర్ గురించి… గతంలో సెన్సేషనల్ సక్సెస్‌ఫుల్ సినిమాలు తీసిన ఆ శంకర్ గురించే…
మొన్న ఇండియన్-2, నిన్న గేమ్ ఛేంజర్ గురించి తీసిన ఆ శంకర్ గురించే… తనకు ఫెయిల్యూర్స్ లేవని కాదు… కానీ గతంలో పర్‌ఫెక్ట్ ప్లానింగుతో, జనానికి నచ్చే సినిమాల్ని తీశాడు… కానీ వరుస రెండు ఫెయిల్యూర్స్‌తో ఏమంటున్నాడు..?
Ads
అబ్బే, నేనే సంతృప్తిగా లేను, 5 గంటల ఫుటేజీ వచ్చింది… దాన్ని సగానికి కుదించేసరికి అటూఇటూ గాకుండా పోయింది, ఫైనల్ ఔట్‌పుట్ నాకే నచ్చలేదు… ఇక చూసుకొండి, ఇండియన్-3 ఎలా తీస్తానో అంటున్నాడు.,.
వరుస ఫెయిల్యూర్స్ అనేది పెద్ద విషయం గాకపోవచ్చు… బోలెడు దిగ్దర్శకులకూ ఫెయిల్యూర్స్ ఉంటాయి, కానీ ఇలాంటి స్టేట్‌మెంట్లు ఎప్పుడూ వినలేదు, అందుకే శంకర్‌ను చూస్తే జాలేస్తోంది ఇందుకే… ఆడలేక మద్దెల ఓడు అనే సామెత బహుశా తనకు తెలిసి ఉండదు, తమిళంలో ఉందో లేదో తెలియదు…
ఆమధ్య ఓ సినిమా వార్త చదివాను… మొత్తం ఫుటేజీకి, రిలీజ్ చేసిన సినిమాకు నడుమ జస్ట్, 5 నిమిషాల ఫుటేజీ మాత్రమే ఎక్కువ వచ్చిందట షూటింగ్ పూర్తయ్యాక చూస్తే… పర్‌ఫెక్ట్ ప్లానింగ్, అవసరమైనంత మాత్రమే షూట్… అడుగు అటు లేదు, అడుగు ఇటు లేదు… ఎడిటర్ పని హాయి…
అంతెందుకు… సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాను అంత మంది భారీ తారాగణంతో కూడా 72 రోజుల్లో చుట్టిపారేశాడు అనిల్ రావిపూడి… నిర్మాతకు సౌఖ్యం… వేగంగా షూట్ ఫినిష్… ఆ ప్లానింగ్ కూడా దర్శకుడి బాధ్యతల్లో ముఖ్యమైంది…
గేమ్‌చేంజర్ 5 గంటల నిడివి వచ్చిందీ అంటే… వస్తే రావచ్చుగాక… దాన్ని క్రిస్పీగా ఎడిటింగ్ చేయించుకోవడంలోనే ఉన్నది కదా అసలు ప్రతిభ… అది చేయాల్సింది ఎవరు..? దర్శకుడే, చేయించుకోవాల్సింది… ఫైనల్ ఔట్‌పుట్‌లో ఏముండాలి, ఏది తీసిపారేయాలి నిర్ణయించాల్సింది దర్శకుడే…
అదుగో అది చేతగాకే సుకుమార్ కూడా పుష్ప-2 సుదీర్ఘంగా ఉంచి, అలాగే రిలీజ్ చేశాడు, అది సరిపోదని ఇంకాస్త కలిపాడు… కానీ మంచి మౌత్ టాక్ రావడంతో సినిమా హిట్టయింది, ఈ లోపాలు కప్పడిపోయాయి… గేమ్ చేంజర్‌కు అది దక్కలేదు…
ఒత్తిడి భరించలేకపోయాను అంటాడు శంకర్… ఎవరి ఒత్తిడి..? దిల్ రాజు ఒత్తిడా..? ఇప్పటికే లేటైంది, చుట్టేసెయ్ అన్నాడా..? లేట్ అనేది కూడా ప్రాథమికంగా దర్శకుడి ఫెయిల్యూరే… Unless నిర్మాతో, ఫైనాన్షియర్సో, ఇంకా వేరే కారణాలో ప్రభావితం చేస్తే తప్ప… మరెందుకు ఈ కుంటిసాకులు డైరెక్టర్..?
ఇక చూసుకొండి ఇండియన్ -3 ఇరగదీస్తాను అంటే ఇప్పుడప్పుడే ప్రేక్షకులు గానీ, సదరు నిర్మాణసంస్థ గానీ నమ్మే సిట్యుయేషన్ లేదిప్పుడు… కమలహాసన్ కూడా సందేహంగా చూస్తున్నాడు నీవైపు… కనుక కామ్రేడ్, మాటలు కాదు, చేతలు కావాలిప్పుడు…
ఇండియన్-3 తరువాత కూడా 5 గంటల ఫుటేజీ, ఒత్తిడి ఎట్సెట్రా మాటలు మాట్లాడితే ఇక ఇండస్ట్రీ నిన్ను నమ్మదు, ఆల్‌రెడీ అదే స్థితిలో ఉందిప్పుడు..!! చిన్న చిన్న కొత్త దర్శకులు కూడా పాన్ ఇండియా లెవల్ అయిపోతున్నారు, నువ్వేమిటి మాస్టారూ ఇలా..?! ఆల్‌రెడీ భారతీయుడు-3 ఔట్‌పుట్ సరిగ్గా లేక కమలహాసనుడు అసంతృప్తిగా ఉంటే 100 కోట్లతో రీషూట్ ప్లాన్ చేశారని ఓ వార్త… దానికేమంటావు..?!
Share this Article