.
ఒకడి గురించి చెప్పుకోవాలి, ఖచ్చితంగా చెప్పుకోవడం అవసరం… తన పేరు నాథన్ ఆండర్సన్… తన దుకాణం పేరు హిండెన్ బర్గ్ రీసెర్చ్…
మొదట్లో ఎందుకూ పనికిరాని కేరక్టర్… కొన్నాళ్లు అంబులెన్స్ డ్రైవర్… తరువాత ఏదో సాఫ్ట్‌వేర్ కంపెనీలో కొలువు… లైఫులో చాలా ఎదురుదెబ్బలు… మన మొన్నటి లక్కీభాస్కర్ సినిమాలోలాగే అడ్డదారులు తొక్కాడు…
Ads
తను ఎంచుకున్న మార్గం… ఓ కుట్ర… ఓ మోసం… కొన్ని పెద్ద కంపెనీలను ఎంపిక చేసుకోవడం… ఆ కంపెనీలపై అనేక ఆరోపణలతో రకరకాల సామాజిక మాధ్యమాలను ఉపయోగించి నెగెటివ్ క్యాంపెయిన్ చేయడం… షార్ట్ సెల్లింగ్‌కు పాల్పడటం… అసలే స్టాక్ మార్కెట్ అంటేనే సున్నితం… అసలు షార్ట్ సెల్లింగ్ అంటే ఏమిటి..?
షార్ట్ సెల్లింగ్ అంటే, స్వంతం కాని షేర్‌లను విక్రయించి లాభం పొందే పద్ధతి… షార్ట్ సెల్లింగ్‌లో, పెట్టుబడిదారుడు బ్రోకర్ నుండి షేర్‌లను అరువుగా తీసుకుని, వాటిని ప్రస్తుత మార్కెట్ ధరకు విక్రయిస్తాడు… తర్వాత, ఆ షేర్‌లను తక్కువ ధరకు తిరిగి కొనుగోలు చేసి, బ్రోకర్‌కు తిరిగి ఇస్తాడు…
అర్థమైంది కదా… ఇదొక పెద్ద దందా… పేరుకు పెద్ద కంపెనీలు ఏ అక్రమాలకు పాల్పడుతున్నాయో బయట పెట్టే విజిల్ బ్లోయర్ అని పేరు… చేసేది ఈ దందా… సేమ్, ఇండియన్ గవర్నమెంట్ ముఖ్యులకు కావల్సినవాడు కదా ఆదానీని టార్గెట్ చేశాడు…
మోడీ అనగానే… వెనకాముందూ ఆలోచించకుండా అన్యాయం, అక్రమం, దారుణం, నీచం, దుర్మార్గం అంటూ ప్రచారానికి దిగే యాంటీ మోడీ సెక్షన్ ఉంటుంది కదా… అవి పెద్ద ఎత్తున నెగెటివ్ క్యాంపెయిన్‌కు దిగాయి… వెరసి బాగుపడింది ఎవడు..? నాథన్ ఆండర్సన్… అలియాస్ హిండెన్ బర్గ్ రీసెర్చ్ అధినేత…
నిజానికి షార్ట్ సెల్లింగ్‌ను ఓ వ్యాపారంగా చేపట్టేవాడైతే విజిల్ బ్లోయర్ అనే దొంగసాకులతో ఆయా కంపెనీల మీద ప్రచారకుట్రలకు పాల్పడకూడదు… పోనీ, నిజంగానే విజిల్ బ్లోయర్ అయితే షార్ట్ సెల్లింగ్ దందా చేయకూడదు… సో, తన క్రెడిబులిటీ అది… యాంటీ మోడీ సెక్షన్‌కు కావల్సిందీ ఇలాంటోళ్లే…
ఇక్కడ ఆదానీ ఏదో శుద్ధపూస అని ఇక్కడ సర్టిఫికెట్ ఇవ్వడం లేదు… వేదాంత, అంబానీ, ఆదానీ… అందరూ అదే టైపు… అది ఇండియా ఖర్మ,.. మోడీ మహాత్యుడి మాయ… ఐతే ఇక్కడ నాథన్ ఆండర్సన్ ఏమాత్రం నమ్మదగని వ్యక్తి అనీ, తన ప్రచారాన్ని ఇండియాలో పార్టీలు నెత్తిన మోశాయని చెప్పడమే ఉద్దేశం…
ఇప్పుడేమంటున్నాడు..? నేను నా దుకాణాన్ని మూసేస్తున్నాను అని…! ఏవో పడికట్టు పదాలతో నీతులు చెబుతున్నాడు… బెదిరింపుల్లేవు, అనారోగ్య కారణాల్లేవు, మరే ఇతరత్రా ఒత్తిళ్లు లేవు అంటున్నాడు… వేల కోట్ల దొంగ సొమ్ము తినమరిగినవాడు మానేయడం ఏమిటి..? పైగా నీతులు చెప్పడం ఏమిటి..?
ఖచ్చితంగా ఏదో మార్మిక కారణం ఉంది… తన బాధితులు ఆదానీ కావచ్చు, ఇంకెవరో కావచ్చు జబర్దస్త్ ఝలక్ ఇచ్చారు… బతికి ఉంటే బలుసాకు తినొచ్చు అనే టైపులో చేతులెత్తాడు… బాబ్బాబు, అన్నీ వదిలేస్తున్నాను అంటున్నాడు,.. ఐతే అసలు కారణాలు ఏమీ బయటపడవు… కుట్రపూరిత వ్యాపారం కూడా చాన్నాళ్లు నడవదు కూడా…
ట్రంపు కుర్చీ ఎక్కగానే ఈ కంపెనీ మీద దర్యాప్తు ప్రారంభమవుతుందనే వార్తలున్నాయి… జార్జ్ సోరోస్‌కూ తనకూ ఉన్న లంకెలు, ఉమ్మడి కుట్రలన్నీ బయటపడతాయనే భయం కూడా ఓ కారణం కావచ్చు…
ఆదానీ మీద కుట్రలు ఆగుతాయా..? ఆగవు… మొన్నామధ్య అమెరికాలో ఆరోపణలు, కేసులు ఇవే… ఇంకా ఉంటాయి… ఆదానీ మీద దాడిని మోడీ మీద దాడి అనుకునే సెక్షన్లు ఖచ్చితంగా పదే పదే ఆదానీని టార్గెట్ చేస్తారు… దాన్ని ఎలా కౌంటర్ చేసుకుంటాడో ఆదానీ సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది… బంగ్లాదేశ్‌లో పవర్ సేల్స్ వివాదం కూడా ఈ కోణంలోనే అర్థం చేసుకోవాలి… ఇంకా చాలా కథలు చూడాల్సి ఉంది…
అవునూ… ఈ సోకాల్డ్ నాథన్ ఆండర్సన్ అన్నీ వదిలేసి, నీతిమార్గం పడతాడు అనుకుంటున్నారా..? నెవ్వర్, దొంగ సొమ్ము రుచిమరిగినవాడు ఊరుకోడు… కాకపోతే దొంగతనం మార్గాల్ని మారుస్తాడు… అదీ సత్యం..!!
Share this Article