.
ప్రయాగరాజ్ కేంద్రంగా సాగుతున్న కుంభమేళాకు… పుణ్యస్నానాలకు భక్తజనం పోటెత్తుతున్నారు… నిజమే.,. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఆధ్యాత్మిక జాతర ఇది…
మునుపెన్నడూ లేని రీతిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈసారి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారని వార్తలు… అసలే అక్కడ మోడీ, ఇక్కడ యోగి… 45 కోట్ల స్నానాలు, 2 లక్షల కోట్ల ఆదాయం వంటి వార్తలు ఎలా ఉన్నా… అందరినీ అబ్బురపరిచేది వేరు…
Ads
అప్పటిదాకా బయట ఎక్కడా కనిపించని వేలాది… లక్షలాది అనాలేమో… నాగసాధువులు, అఘోరాలు, దిగంబర సన్యాసులు, యోగులు, సంతులు, వీర శైవ దీక్షితులైన సాధకులు, గుప్త తపస్వులు, అనేకానేక యోగసాధనలు, పరంపరలకు చెందిన సాధుపుంగవులు స్నానాలకు వచ్చేస్తారు…
ఎన్ని ఆశ్రమాలు, ఎందరు యోగసాధకులు, ఎక్కడెక్కడ ఇంతమంది తమ ధ్యానంలో నిమగ్నమై బతుకుతున్నారు..? భారతీయ ఆధ్యాత్మిక సాధన అందుకే ఎప్పుడూ విదేశీయులకు ఓ ఆశ్చర్యం… ఈ అలౌకిక చింతనలోని మర్మం అంతుపట్టదు ఎవరికీ…
సరే, ఇవన్నీ ఎలా ఉన్నా… దీన్ని మహాకుంభమేళా అని పిలవొచ్చా..? లేదు… కేవలం కుంభమేళా మాత్రమే… ఎందుకంటే..?
నదుల పుష్కర పుణ్య కాలాలు 12 సంవత్సరాలకు ఒకసారి ఎలా వస్తాయో… అలాగే ఈ కుంభమేళా ఉత్సవాలకూ నిర్ణీత కాలవ్యవధులు ఉన్నాయి… ఈ ఉత్సవాలు కేవలం 4 ప్రాంతాలకే పరిమితం…
పుష్కర పుణ్య కాలం 12 రోజులైతే, ఈ మేళాల పుణ్యకాలం 40 రోజులు… ఈ సంవత్సరం ఉత్సవం 13 జనవరి నుండి ప్రారంభమైంది… ఫిబ్రవరి 26 శివరాత్రితో ముగుస్తుంది…
1. అర్థ కుంభమేళా…. ఇది 6 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది… కుంభమేళా అంటే పన్నెండేళ్లకు ఓసారి వచ్చేది కాబట్టి అందులో సగం, అంటే ఆరు సంవత్సరాలకు వచ్చేది అర్ధ కుంభమేళా… ఇది మొన్నటి 2019లో చూశాం…
2. కుంభమేళా… ఇది 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది… గతంలో 2013 లో ఇది వచ్చింది… తరువాత 12 ఏళ్లు గడిచిపోయాయి కాబట్టి ఇప్పుడు, అంటే ఈ 2025 లో మళ్ళీ వచ్చింది… కనుక ఇది కుంభమేళా మాత్రమే….
3. మహాకుంభ మేళా… ఇది 12 × 12 =144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది… గతంలో 2013లో వచ్చింది మహా కుంభమేళా… అంటే ఇక ఇది వచ్చేది 2157 సంవత్సరంలోనే… దీన్నే 12 మంది సూర్యులు పన్నెండేసి ఆవృత్తులతో పరిపాలించే కాలపరిమితి అంటుంటారు… సో, మహా కుంభమేళా అని గాకుండా దీన్ని కుంభమేళా అని మాత్రమే సంబోధించాలి..!
Share this Article