.
సైఫ్ అలీ ఖాన్‌పై ఓ దొంగ దాడి చేశాడు… కత్తిపోట్లు… వెంటనే మన స్టార్ హీరోలకు బాధ పొంగుకొచ్చింది… ఒక్కసారైనా రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం నింపిన ఒక్క దుర్ఘటన మీదనైనా స్పందించారా…?
సరే, వాళ్లకు సొసైటీ నుంచి పిండుకోవడం తప్ప ఇవ్వడం తెలియదు కదా, వదిలేద్దాం… కానీ ఈ ఇన్సిడెంటులో ఒక అంశం ఇంట్రస్టింగు అనిపించింది…
Ads
అంత బందోబస్తు ఉన్న ఇంట్లోకి దొంగ ఎలా ప్రవేశించాడు..? అంత సులభమా..? ఇంట్లో ఎవరో పనిమనుషులు సహకరించారా..? చాలా ముందుగానే వచ్చి ఇంట్లో నక్కి ఉన్నాడా ఎక్కడో..? ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు దయ వచ్చి ఏం గమనించాడు..? ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం…
కోటి రూపాయలు అడిగాడట, ఈ రీల్ హీరో దొంగను పట్టుకోవడానికి ప్రయత్నించడంతో వాడు కత్తితో కసకసా పొడిచి పారిపోయాడట… అంతా నమ్మశక్యంగా లేదు, అసలు వాడెవడో తెలిస్తే, పట్టుబడితే గానీ అసలు సంగతి తేలదు… దయాకు దొరికితే నిజాలు చెప్పేవరకైనా ఉంచుతాడో లేదో తెలియదు…
ఎందుకంటే, ఆల్రెడీ మహారాష్ట్ర విపక్షాలు మొదలుపెట్టాయి కదా… సెలబ్రిటీలకే రక్షణకు దిక్కులేదు అంటూ… వందలు, వేల కోట్ల ఆస్తులున్న ధనికతారలు వాళ్ల ఇళ్ల రక్షణకు కూడా ప్రజాధనం వెచ్చించాలా..? వాళ్ల ఇళ్ల రక్షణకు ప్రైవేటు సెక్యూరిటీని పెట్టుకోలేరా..? ఒక్కొక్క ఇంటి దగ్గర పోలీస్ బలగాలను మొహరించాలా..? పిచ్చి విమర్శలు…
కానీ ఎంతటి దుర్బేద్యమైన కోటలోకి ప్రవేశించాలన్నా… తెగించిన వ్యక్తికి ఏదో ఓ లూప్ హోల్ దొరుకుతుంది… టైమ్ కలిసొస్తే ఆ ఇంటి యజమాని మెడ మీద కత్తిపెట్టే అవకాశమూ దొరుకుతుంది… ఇది అదే… సో, మేం అత్యంత సేఫ్ అని ఎవరు అనుకున్నా అది భ్రమే… ఇది తెలిసినోడు కాబట్టే సల్మాన్‌ఖాన్ తన ఇంటిని మరింత దుర్బేధ్యం చేసుకోవడం కోసం నానా కష్టాలూ పడుతున్నాడు…
అసలు ఇవన్నీ కాదు… ఇంట్రస్టింగు విషయం అనిపించింది ఏమిటంటే..? అంత పెద్ద ఇల్లు… 1200 కోట్ల ఆసామీ… పర్సనల్ స్టాఫే 10 మంది… 10 ఎకరాల, 12 అంతస్థుల పెద్ద రాజప్రాసాదం… బోలెడు కార్లు… అలాంటోడు కత్తిపోట్లకు గురైతే సమయానికి ఎవడూ లేడు వెంటనే హాస్పిటల్‌కు తరలించడానికి…
సైఫ్ కొడుకు తెలివిగా ఆలోచించాడు… అంబులెన్స్ రావడానికీ టైమ్ పడుతుంది… సమయానికి డ్రైవర్లు లేరెవరూ… షెడ్ ఓపెన్ చేసి, కారు బయటికి తీసుకురావడానికీ టైమ్ పడుతుంది… అక్షరాలా సైఫ్‌ను మోస్తూ గేటు దగ్గరకు వచ్చాడు, ఓ ఆటో కనిపిస్తే అందులో హాస్పిటల్‌కు తరలించాడు… ఆ వేగం, ఆ సమయస్పూర్తే సైఫ్‌ను ప్రాణాపాయం నుంచి బయటపడేసింది…
వెన్నులో విరిగిన కత్తి మొనను తక్షణం తొలగించారు… సమయానికి కొడుకు ఇబ్రహీం అక్కడ లేకపోయినా, తను సకాలంలో స్పందించకపోయినా సైఫ్ కథ అక్కడే ముగిసిపోయేది..!!
Share this Article