.
ఐశ్వర్యా రాజేష్… ప్రస్తుతం తెలుగు సినిమా ప్రేక్షకుల్లో ఈమె మీద ఓ పాజిటివ్ చర్చ నడుస్తోంది… సగటు ప్రేక్షకుడు ఆమెను ఓన్ చేసుకుని ప్రశంసిస్తున్నాడు… కారణం : సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఆమె నటన… మంచి అప్లాజ్ వస్తోంది ఆమె నటనకు…
ఆమె తెలుగమ్మాయి… ఒకప్పటి హీరో రాజేష్ బిడ్డ… లేడీ కమెడియన్ శ్రీలక్ష్మి తనకు మేనత్త… అకస్మాత్తుగా హీరోయిన్ ఏమీ కాలేదు తను… మొదట్లో యాంకర్… తరువాతే సినీప్రవేశం… అనేక అవమానాలు, ఒడిదొడుకులు… ఛాయ తక్కువని అనేక పాత్రల్ని నిరాకరించాడు… గేలి చేశారు… మొదట్లో అన్నీ చిన్నాచితకా పాత్రలే…
Ads
2015లో కాకముట్టయి సినిమాలో వేసిన పాత్రకు ఉత్తమ నటిగా ప్రభుత్వ పురస్కారం అందుకున్నాక ఇక నిలదొక్కుకుంది… కానీ తెలుగమ్మాయి అయిఉండీ తెలుగులో మంచి పాత్రలు రాలేదు తనకు… కానీ సంక్రాంతికి వస్తున్నాంలో భాగ్యం పాత్రను బాగా ఎంజాయ్ చేసింది తను… బాగా చేసింది కూడా… ప్రమోషన్లను కూడా ఎంజాయ్ చేసింది… చాన్నాళ్లకు తెలుగులో ఓ పెద్ద పాత్ర వచ్చినందుకు…
సోషల్ మీడియాలో మరీ సౌందర్య, సాయిపల్లవిలతో పోలుస్తున్నారు, అదే సమయంలో హీరోయిన్ మెటీరియల్ కాదు అనే వ్యాఖ్యానాలు కూడా… ఏదీ కరెక్టు కాదు… ఎవరి నటన ప్రతిభ వారిది… ఆమె కలర్ కాస్త తక్కువేమో గానీ అందగత్తే… ఇవన్నీ అటుంచితే ఈమధ్య ఏదో టీవీ ఇంటర్వ్యూలో ఆమె మాటలు బాగనిపించాయి… తన ఆలోచనల్లో, తన అడుగుల్లో ఎంత క్లారిటీ ఉందో అర్థమవుతుంది…
నలుగురు పిల్లల తల్లిగా చేశారు, ఇది ఇబ్బందికరం కాదా అనేది ప్రశ్న… ఆమె ఏమంటుందంటే..?
‘‘సో వాట్… అది ఒక పాత్ర… ఐనా పిల్లల తల్లిగా చేయడంలో తప్పేముంది..? నేను అవార్డు తీసుకున్న కాకముట్టయిలో ఇద్దరు పిల్లలకు తల్లిని… అప్పటికి నా వయస్సు 21 ఏళ్లే… ఆ సినిమాతోనే నిలదొక్కుకున్నా, అది చేయకపోయి ఉంటే నా కెరీర్ ఏమయ్యేదో…
ఫరానాలో కూడా తల్లి పాత్ర చేశాను… అందులో ముగ్గురు పిల్లలు నా పాత్రకు… ఇప్పుడు నలుగురు పిల్లల తల్లిని… ఇలాంటి పాత్రలు చాలా చేశాను… ఐనా తల్లి పాత్రలు వేస్తే ఇక మెయిన్ లీడ్ ఇవ్వరు, హీరోయిన్‌గా తీసుకోరు, ఇక అన్నీ అలాంటి పాత్రలే ఇస్తారు అనే భయాలు పదేళ్ల క్రితంవి… అప్పుడు ఆ పరిస్థితి లేదు… నేను మణిరత్నం సినిమాలో చేశాను, విజయ్ సేతుపతితో చేశాను, ధనుష్‌తో వెట్రిమారన్ సినిమా చేశాను… పాత్ర ఎలా పోషించామనేదే ప్రధానం…
ఇండస్ట్రీ గతంలోలాగా లేదు… నాకు తల్లి పాత్రలు వేయాలా వద్దా అనే మీమాంస కూడా లేదు… (పక్కనే ఉన్న మీనాక్షి చౌదరిని చూపిస్తూ ఇంత యంగ్ ఏజులో తను లక్కీ భాస్కర్‌లో కొడుక్కి తల్లిగా చేయలేదా..?) ఒక నటి తన పాత్ర గురించే ఆలోచించాలి… ఈ సినిమాలో భాగ్యం పాత్ర నలుగురు పిల్లల తల్లి, ఇద్దరుముగ్గురు వేరే హీరోయిన్లు తిరస్కరించారు… బహుశా ఒప్పుకుని ఉంటే బాగుండేది అని ఇప్పుడు అనుకుంటున్నారేమో…!’’
Share this Article