.
Paresh Turlapati…. సినిమా తియ్యడం ఒక ఎత్తు, తీసిన సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేవిధంగా ప్రమోషన్ చెయ్యడం ఒక ఎత్తు
చిన్నపుడు సినిమా ప్రమోషన్లో పోస్టర్లు ప్రధాన పాత్ర పోషించేవి. ఈ పోస్టర్లలో కూడా నాలుగు ముక్కలు.. ఆరు ముక్కలు కలిపి ఓ పెద్ద పోస్టర్ తయారుచేసి రోడ్ సైడ్ గోడలకు అతికించేవాళ్ళు
Ads
రోడ్డు మీద వెళ్తున్న మేము వాల్ పోస్టర్ చూసి టెంప్ట్ ఆయి ధియేటర్ కు వెళ్ళేవాళ్ళం, అప్పట్లో ప్రేక్షకుడ్ని ధియేటర్ కు రప్పించే శక్తి ఒక వాల్ పోస్టర్ కు కూడా ఉండేది అన్నమాట.
అంతకుముందు పోస్టర్లు అతికించిన గూడు రిక్షాలో నేడే చూడండి ఫలానా సినిమా అంటూ ఊరంతా టాంటాం తిప్పేవాళ్లు… కరపత్రాలు పంచేవాళ్లు
జనరేషన్ మారింది, టెక్నాలజీ మారింది, ఇప్పుడంతా డిజిటల్ యుగం కదా సినిమా ప్రమోషన్ కూడా మారింది
ఇప్పుడు సినిమా టీమ్ చిన్న ల్యాప్ టాప్ పట్టుకుని మెగాస్టార్ దగ్గరకు పోయి ట్రైలర్ రిలీజ్ చేయించుకోవడం దగ్గర్నుంచి.. జబర్థస్త్ ప్రోగ్రాంలోనో.. ఏ బిగ్ బాస్ ప్రోగ్రామ్ లోనో ప్రత్యక్షం అయిపోయి సినిమా ప్రమోషన్ చేసుకోవడం జరుగుతుంది
సినిమా ప్రమోషన్లో సోషల్ మీడియా పాత్ర కూడా బాగా పెరిగిపోయింది అనుకున్నారో ఏమో ఈ మధ్య డైరెక్టర్ కృష్ణ వంశీ గారు ఏకంగా సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉన్నవాళ్లను తన సినిమా రంగమార్తాండ ప్రివ్యూ కు ఆహ్వానించి కొత్త ట్రెండ్ సృష్టించారు. తద్వారా తన సినిమా ప్రమోషన్లో సోషల్ మీడియాను కూడా భాగం చేసుకున్నారు
ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి దర్శకుడు అనిల్ రావిపూడి సరికొత్తగా ప్రమోషన్ చేస్తున్నారు. రోజుకో ప్రముఖుడి ఇంటికి హీరో వెంకటేష్ అండ్ టీమ్ తో వెళ్ళి సందడి చేస్తున్నారు
మొన్న మహేష్ బాబు .. నిన్న దగ్గుబాటి రానా.. నేడు సుమ ఇంటికి వెళ్ళి సరదాగా చిట్ చాట్ చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ ప్రమోషన్ కొద్దిగా డిఫరెంట్ గా అనిల్ రావిపూడి మార్కుతో బావుంది (సినిమా ప్రమోషన్ గురించి మాత్రమే చెప్తున్నాను ఇక్కడ)
అన్నట్టు బూతుల బుల్లిరాజు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో చాలా పేమస్సు అయిపోయాడు, మనోడిది భీమవరం అంట, జస్ట్ అయిదో క్లాసు చదువుతున్నాడు
మీడియా ఛానళ్ళు.. యూ ట్యూబ్ ఛానళ్ళు బుల్లిరాజును ఇంటర్వ్యూలు చేస్తుంటే తడుముకోకుండా నవ్వుతూ స్పాంటేనియస్ గా సమాధానాలు చెప్తున్నాడు, పిల్లోడికి మంచి ఫ్యూచర్ ఉందనిపిస్తుంది ! All the best….
Share this Article