.
ఫాఫం థమన్ బాగా బాధపడిపోయాడు… నెగెటివ్ క్యాంపెయిన్లతో సినిమాలను, నిర్మాతలను, ఇండస్ట్రీని చంపేస్తున్నారని భాగా ఆందోళన పడిపోయాడు… గేమ్ చేంజర్ సినిమా కాబట్టేమో, దానికి ఆ నెగెటివ్ క్యాంపెయిన్ దెబ్బ గట్టిగా తగిలిందనే భావనతో ఉన్న చిరంజీవి కూడా థమన్ మాటలు తన హృదయాన్ని తాకాయని బాధపడ్డాడు…
అయ్యా, థమన్… ఇవన్నీ సహజం… ఫ్యాన్స్ వార్ ఎంత బలంగా నడిచినా, ఎవడెంత నెగెటివ్ క్యాంపెయిన్ చేసినా… సినిమా మీద మౌత్ టాక్ బాగుంటే, ఏదీ సినిమా విజయాన్ని అడ్డుకోలేదు… హెచ్‌డీ ప్రింట్లు నెట్‌లోకి తెచ్చిపెట్టినా అదేమీ నష్టపరచదు… పైరసీ ఈనాటి సమస్యా..? ఎప్పుడూ ఉన్నదే కదా…
Ads
అంతెందుకు… సాక్షాత్తూ గేమ్ చేంజర్ దర్శకుడు శంకరే చెబుతున్నాడు… 5 గంటల ఫీడ్‌ను కుదించేసరికి ఫైనల్ ఔట్ పుట్ తనకే నిరాశ కలిగించిందని..! నిజానికి ఇండియన్-2 సినిమా టేకింగ్, ఔట్ పుట్ చూసినవాళ్లకు మొదటి నుంచీ ఈ గేమ్ చేంజర్ సినిమా నాణ్యత మీద కూడా సందేహాలున్నాయి… సినిమా శంకర్ మార్క్‌లో లేదు…
కొందరి సినిమాల మీద ఎక్స్‌పెక్టేషన్స్ బాగా ఉంటాయి… ఏమాత్రం తగ్గినా ఇదుగో ఇలాగే ఉంటుంది ఫలితం… పైగా నువ్వు 500 కోట్లతో సినిమా తీశావా… 1000 కోట్లతో తీశావా అనేది ప్రేక్షకుడికి అనవసరం… థియేటర్‌లో సినిమా తనను వినోదపరిచిందా లేదానేదే ముఖ్యం… ఐనా అత్యంత భారీ బడ్జెట్లలో హీరోల పారితోషికాలే కదా సింహభాగం…
సో, థమన్ బాధ ఒక కోణంలో అర్థరహితం… ఎందుకంటే, ఫ్యాన్స్ వార్ ఇప్పుడు కొత్త కాదు, గతంలో లేదనీ కాదు… రకరకాల రూపాల్లో కనబడేవి… కానీ అంతిమంగా నిజంగా సినిమాలో సరుకు ఉంటే ఏ ప్రత్యర్థి ఫ్యాన్స్ కూడా ఏమీ చేయలేరు… అంతెందుకు..? సంక్రాంతి సినిమాలే తీసుకుందాం, ఆ మూడు సినిమాల్లో ముందు రిలీజైంది గేమ్ చేంజరే కదా…
అది ఫట్… కలెక్షన్ల లెక్కలు, ఎక్కాలు బయట ఎంత ప్రచారం చేసుకున్నా, అసలు లెక్కలు ఎవరికీ తెలియవు… ఫ్లాప్ అనేది ఖాయం… సాక్‌నిల్క్ లెక్కల్లో చెప్పాలంటే 8 రోజుల్లో 176 కోట్లు… పాన్ ఇండియా రేంజు అయిఉండీ అదీ ఫలితం… సో, బయ్యర్లు దెబ్బతిన్నట్టే… రాంచరణ్ తన పారితోషికం కూడా దిల్ రాజుకు కొంతమేరకు వాపస్ ఇవ్వనున్నాడని వార్తలు కూడా వచ్చాయి…
డాకూ మహారాజ్ ఆరు రోజుల్లో 104 కోట్లు… సరే, బాలయ్య సినిమా అంటే… ఆ అతిని కొందరు మాత్రమే ప్రేమించగలరు… పైగా తన సినిమా అంటేనే నరుకుడే నరుకుడు… వందల మంది నెత్తుటితో తెర కమురు వాసన కొడుతుంది… సూపర్ హీరోయిజం… సరే, సంక్రాంతికి వస్తున్నాం సినిమా విషయానికి వద్దాం…
లాజిక్కులేమీ లేకుండా… కేవలం ఫన్ బేస్డ్ కథనం… జబర్దస్త్ తరహా సినిమా… ఐతేనేం, ఫ్యామిలీ ప్రేక్షకులకు ఉన్నంతలో అదే బెటర్ అనిపించింది… అందుకే నాలుగే రోజుల్లో 130 కోట్లు… గేమ్ చేంజర్ 8 రోజుల్లో 176 కోట్లు అయితే ఇది 4 రోజుల్లో 130 కోట్లు… క్లియర్ కట్‌గా సంక్రాంతి విజేత వెంకటేష్… చౌకగా సినిమా తీశారు… వేగంగా తీశారు… డిఫరెంట్ మార్గాల్లో ప్రమోషన్ చేసుకున్నారు… మొత్తం టీమ్ ఖుషీగా ఉంది… ఓటీటీ శకంలోనూ జనాన్ని థియేటర్లకు రప్పించారు…
సో, ఇప్పుడు చెప్పండి థమన్ గారూ… ఎవరూ సినిమాను, ఇండస్ట్రీని, నిర్మాతను చంపరు… చంపలేరు… అన్నీ స్వయంకృతాలే… అంతెందుకు…? బోలెడు డిజాస్టర్లు కొని నిండా మునిగి, నెత్తి మీద ఎర్ర తువ్వాల వేసుకున్న బయ్యర్లు ఎందరో… ఏమైనా ఆగిందా..? కొంటూనే ఉన్నారు, మునుగుతూనే ఉన్నారు, డబ్బు ఫ్లో అవుతూనే ఉంది… లాభపడేది హీరోలు, స్టార్ దర్శకులు.,. అంతిమంగా పరాజితులు బయ్యర్లు, ప్రేక్షకులు..!!
Share this Article