Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చిరంజీవి, మోహన్‌బాబు… ఏక్‌సేఏక్… పోటాపోటీగా భలే నటిస్తారయ్యా…

January 21, 2025 by M S R

.

Subramanyam Dogiparthi … కోదండరామిరెడ్డి- చిరంజీవి విజయవంతమైన కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా 1981 డిసెంబర్ క్రిస్టమస్ సీజనుకు విడుదలయిన ఈ కిరాయి రౌడీలు సినిమా . అందరికీ పేరు వచ్చింది . డబ్బులూ బాగా కురిసాయి .

ముందుగా మెచ్చుకోవలసింది కధను నేసిన సత్యానందునే . ఆ తర్వాత దాన్ని సినిమానుకూలంగా తయారు చేసుకుని పకడ్బందీగా తెరకు ఎక్కించుకున్న కోదండరామిరెడ్డిని మెచ్చుకోవాలి .

Ads

చిరంజీవి- రాధిక జోడీ మామూలుగానే చాలా ఎనర్జిటిగ్గా ఉంటుంది . ఈ సినిమాలో కూడా అదిరిపోతుంది . మూడు డ్యూయెట్లలోనూ అదరగొట్టేసారు . తర్వాత చిరంజీవి- మోహన్ బాబులు పోటాపోటీగా చాలా బాగా నటించారు .

కధ రొటీనుదే అయినా చాలా విభిన్నంగా తయారు చేసారు సత్యానంద్ . ముగ్గురు స్నేహితులు . డబ్బు విడదీస్తుంది . ఒకడిని హత్య చేపిస్తుంది . ఆ ముగ్గురి సంతానం చుట్టూ తిరుగుతుంది కధ . ఇద్దరు స్నేహితుల కొడుకులు కిరాయిరౌడీలు అవుతారు .

ఒకరి కూతురు ఆ ఇద్దరిలో ఒకరిని ప్రేమిస్తుంది . కధలో క్లైమాక్స్ చాలా విభిన్నం . తండ్రి చేసిన అఘాయిత్యాలకు చలించిపోయిన కూతురు తండ్రిని పేరు పెట్టి పిలుస్తుంది . కూతురిని శాంతపరచడానికి విలన్ తండ్రి ఆత్మహత్య చేసుకుంటాడు . ఈ క్లైమాక్స్ విభిన్నమయింది . ఈ సీన్ కూడా కోదండరామిరెడ్డి చాలా బాగా పండించాడు .

ఈ సినిమా విజయానికి మరో కారకుడు సంగీత దర్శకుడు చక్రవర్తి . ముఖ్యంగా అన్నాచెల్లెళ్ళ సెంటిమెంటల్ సాంగ్ ఆ దైవమే నా అన్నగా ఈ దీపమే నా కన్నుగా సినిమాకు హైలైట్ . సినిమాలో రెండు సందర్భాలలో వచ్చే ఈ పాటను వేటూరి చాలా బాగా వ్రాసారు .

మిగిలిన మూడు డ్యూయెట్ సాంగ్స్ చిరంజీవి , రాధికల మీద . బాగుంటాయి . ఓ కొంటె కోణంగీ సరసాల సంపంగీ , పంగనామాలు పెట్టుకో వంగి దండాలు పెట్టుకో , తమాషా ఇది ఒక తమాషా . మూడు పాటల్లోనూ చిరంజీవి, రాధికలు చాలా బాగా డాన్స్ కూడా చేస్తారు .

సోషల్ మీడియా లేని రోజులు , అనంత శ్రీరాం వంటి భక్తులు లేని రోజులు కాబట్టి పంగనామాలు పెట్టుకో అని వ్రాసిన వేటూరి , సినిమా తీసిన క్రాంతికుమార్, దర్శకత్వం వహించిన కోదండరామిరెడ్డి బతికిపోయారు . ఎవరూ బాయ్ కాట్ కేకేయలేదు .

ముగ్గురు స్నేహితులుగా రావు గోపాలరావు , ప్రభాకరరెడ్డి , జగ్గారావులు నటించారు . రావు గోపాలరావు విలనేశ్వరుడు . జగ్గారావు కొడుకు మోహన్ బాబు , ప్రభాకరరెడ్డి కొడుకు చిరంజీవి , రావు గోపాలరావు ముద్దుల కూతురు రాధిక . అల్లు రామలింగయ్య- చిరంజీవిల కాంబినేషన్ సీన్లు బాగుంటాయి . సువర్ణ నటన కూడా బాగుంటుంది .

తెలుగులో వంద రోజులు ఆడటమే కాకుండా డబ్బులు వర్షించిన ఈ సినిమాను హిందీలో హోషియార్ టైటిలుతో రాఘవేంద్రుడే దర్శకత్వం వహించినా అక్కడ సక్సెస్ కాలేదు . మన కిరాయిరౌడీలు సినిమా యూట్యూబులో ఉంది .

చిరంజీవి , మోహన్ బాబు అభిమానులు చూసి ఉండకపోతే తప్పక చూడండి . A 100% watchable entertaining , action-oriented , brother-sister sentiment movie . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒక్కసారి బంధాలు గాడితప్పితే… కథలో ఇక అన్నీ రోత ట్విస్టులే…
  • నిర్దోషిత్వం బయటపడేలోపు… నింద మాన్పలేని మచ్చల్ని మిగిలిస్తుంది…
  • వింత విజ్ఞత..! 90 శాతం గెలవని గెలుపు అసలు గెలుపే కాదట..!!
  • పాక్ గురించి కాదు, పాజ్ గురించే చర్చ..! ఉస్మాన్ తారీఖ్‌తో ఆడుకుంటారా..?
  • జీరోలు, సింగిల్ సీట్లు..! మున్సిపల్ తీర్పులో కొన్ని ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్..!!
  • కొన్ని కేసుల్లో న్యాయం ఓ చిక్కు ప్రశ్నే… ఇదీ అలాంటి కేసే…
  • పట్టణ వోటర్లూ చెప్పేశారు..! రేవంతుడి లీడర్‌షిప్‌కి క్లియర్ బూస్టప్..!!
  • శారద అనగానే… కథలూ, మాటలూ రెచ్చిపోయి రాసేస్తారు బ్రదర్స్…
  • స్టయిలిష్ సనాతనం… భజన్ క్లబ్బింగ్… న్యూ స్పిరిట్యుయల్ వైబ్స్…
  • డ్రమ్ముల కొద్దీ గాఢమైన యాసిడ్ కొనుగోలు… ఎపిస్టీన్ ప్లానేమిటి..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions