.
ఎంత చేయి తిరిగిన రచయిత అయినా సరే… ఎంత పాపులారిటీని ఎంజాయ్ చేస్తున్నా సరే… తన క్రియేటివ్ రచనలతో అందరూ ఏకీభవించాలని లేదు… ఆ రచనల్లో కొన్నిచోట్ల కనిపించే అబ్సర్డిటీ కూడా కాస్త చిరాకు పుట్టించేదే…
తెలుగునాట అందరికీ తెలిసిన పేరు Veerendranath Yandamoori … ఓ కొత్త నవల రాబోతోంది… నిజానికి తన నుంచి తన మార్క్ ఫిక్షన్ రాక చాన్నాళ్లయింది… పాత నవలల పునర్ముద్రణ మీద కాన్సంట్రేషన్ ఉన్నట్టుంది… సరే, రాబోయే కొత్త నవలలో ఓ సీన్… (తన వాల్ మీద తను పోస్టు చేసిందే…)
Ads
ఖరీదైన బిజినెస్ క్లాస్ లో కూర్చున్న ఒక యువకుడికి ఎయిర్ హోస్టెస్ విస్కీ తీసుకు వెళ్లి ఇచ్చింది. వద్దన్నాడు. ‘వైన్ తీసుకుంటారా’ అని అడిగింది. వద్దన్నాడు.
అతడు చాలా పెద్ద పారిశ్రామికవేత్త అని ఆమెకు తెలుసు. అలాంటి కష్టమర్ని ఇంప్రెస్ చేద్దామని మరింత ఖరీదైన విస్కీ తీసుకొని వచ్చింది.
‘నేను తాగను. వద్దు” అన్నాడు సుతారంగా తిరస్కరిస్తూ.
“ఎప్పుడూ తాగరా? ఎందుకు?” అని అడిగింది.
“ఈ గ్లాస్ తీసుకెళ్లి మీ పైలెట్ కి ఇవ్వు. ఆయన తాగితే నేను తాగుతాను” అన్నాడు.
“మా పైలెట్ డ్యూటీలో ఉన్నారు” అంది ఆ మాత్రం తెలీదా అన్నట్టు.
“అయితే ఏం?” అని అడిగాడు.
హోస్టెస్ కాస్త విసుగ్గా, “డ్యూటీ లో ఉన్నప్పుడు తాగకూడదు. తాగరు”అంది.
“అదే ఏం – అని అడుగుతున్నా”
“విమానం నడుపుతున్నప్పుడు ఎంతోమంది ప్రయాణికుల బాధ్యత ఆయన మీద ఉంటుంది”.
“ఎగ్జాట్లీ. నా మీద కూడా నా కుటుంబo, నా మీద ఆధార పడ్డ పాతిక వేలమంది ఉద్యోగుల బాధ్యత ఉంది. నాది 24 గంటల డ్యూటీ. అందుకని తాగను” అన్నాడు యువ పారిశ్రామికవేత్త.
(ఆధునీకరణ చేసిన ఒక బుద్ధుడి కథ – ప్రస్తుతం వ్రాస్తున్న కొత్త నవల నుంచి)
నాకు అలవాటు లేదు, మద్యం మనిషి విచక్షణను చంపేస్తుంది, అందుకే నేను ఎప్పుడూ తాగను అని చెబితే అది వేరు… కానీ తను ఆ మాట అనడం లేదు…
నా కుటుంబం, నామీద ఆధారపడ్డ పాతిక వేల మంది ఉద్యోగుల బాధ్యత ఉంది, నాది 24 గంటల డ్యూటీ అనడమే అబ్సర్డ్… పైలట్ ఆన్ డ్యూటీ ఆ సమయంలో… కానీ ఈ పారిశ్రామికవేత్త డ్యూటీలో లేడు… విమానంలో లావాదేవీలు ఏమీ కుదరవు… అప్పుడు తను తీసుకునే నిర్ణయాలూ ఏమీ ఉండవు… డెస్టినేషన్ చేరేవరకూ చేసేదీ ఏమీ ఉండదు…
లిక్కర్ వద్దు అనుకుంటే వద్దు అనేస్తే చాలు, నో ప్లీజ్ అంటే సరిపోతుంది… కానీ పైలట్‌కు ఇవ్వు, తను తాగితే నేను తాగుతాను అని చెప్పడం సదరు వ్యాపారి ఫూలిష్‌నెస్… రెగ్యులర్ డ్రింకింగ్ హేబిట్ లేని అకేషనల్ డ్రింకర్స్ కూడా విమానంలో (ఇంటర్నేషనల్ జర్నీ) అందించే ఓ స్మాల్ చప్పరించి, నిద్రలోకి జారిపోతారు… రిలాక్స్…
అన్నట్టు… ఎంత పెద్ద పారిశ్రామికవేత్త అయినా సరే, విమాన సర్వీసులో ఎయిర్ హోస్టెస్‌లు ఇంప్రెస్ చేయడానికి బలవంతంగా తాగు తాగు అని లిక్కర్ ఆఫర్ చేయరు… ఎంతటి బిజినెస్ క్లాస్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ అయినా సరే… బట్, యండమూరి తనే చెబుతున్నట్టు… Opinions Differ…
Share this Article