.
Srinivas Sarla …….. అమెరికాలో జాబ్ చేయాలని ప్రయత్నించే ఓ యువకుడు, అసలు పల్లెటూరు అంటేనే ఇష్టం లేని వాడు పంచాయతీ సెక్రటరీగా పల్లెటూరికి వచ్చాక ఏం జరిగింది అనేదే సివరపల్లి సినిమా కథ..
హిందీ 7 పంచాయతీ సిరీస్ కి ఇది రీమేక్ అయినప్పటికీ తెలంగాణ యాసలో పర్ఫెక్ట్ గా కుదిరింది..
Ads
ఈ సిరీస్ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మూఢనమ్మకాలతో పాటు మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి లాంటి సామాజిక రాజకీయ అంశాలను చాలా సున్నితంగా చర్చిస్తుంది.
సెక్రటరీ పాత్ర లో రాగ్ మయూర్ జీవించేసాడు. face లో ఆ ఇరిటేషన్, అసహనం, కోపం ఆ సీరియస్ నెస్ సూపర్ అసలు… పంచాయతీ సెక్రటరీ బిహేవియర్ అలా ఎందుకు ఉంటుంది ఈ సిరీస్ చుసిన వాళ్లకు ఖచ్చితంగా అర్థం అవుతుంది
గ్రామ పంచాయతీ అభివృద్ధిలో బాగంగా స్థానిక రాజకీయాల వల్ల సర్పంచ్, సెక్రటరీల మధ్యలో వచ్చే చిన్న చిన్న మనస్పర్థలు, ఆ ఇద్దరి మధ్యలో వారికే తెలియకుండా ఏర్పడే ఎమోషనల్ బాండింగ్ ని చాలా అద్భుతంగా ఈ సిరీస్ ద్వారా చూపెట్టారు..
ఈ సిరీస్ లో ప్రతి సీన్ కంప్లీట్ రియాలిటీలో సాగుతుంది ముఖ్యంగా ఆ కారోబార్ నరేష్ పాత్ర అయితే హైలెట్. సర్పంచ్ కి గ్రామ ప్రజలకు, సర్పంచ్ కి పంచాయతీ సెక్రటరీకి మధ్య వారధిగా చాలా కీలకంగా ఉంటుంది
ప్రతి ఒక్కరికి సొంత ఊరు ఒకటి ఉంటుంది కానీ పంచాయతీ సెక్రటరీకి వాడు విధులు నిర్వర్తించే ప్రతి ఊరు వాడికి సొంత ఊరే..
ఫైనల్ గా అందరు చూడాల్సిన సిరీస్.. సర్పంచులు సెక్రటరీలు అయితే మిస్ అవకుండా చూడాల్సిన సిరీస్.. ప్రైమ్‌లో ఉంది…
Share this Article