.
Subramanyam Dogiparthi …… It’s a literary , musical and visual splendour . అద్భుతమైన కళా ఖండం . ప్రతి సినిమా ప్రియుడు , కళాభిమాని , రస హృదయుడు తప్పక తప్పక చూడవలసిన మరాఠీ సినిమా . ప్రైంలో ఉంది .
ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉన్నాయి . వాటిని ఎక్కడ చదవనిస్తుంది సినిమా ! ఏదేదో రస లోకాలకు తీసుకుని పోతుంది .
Ads
పీష్వాల కాలం సినిమా . ఫుల్వంతి అనే నర్తకి దేశమంతా పేరు మోసిన నర్తకి . ఎంత గొప్ప నర్తకో అంత శృతిమించిన ఆత్మ విశ్వాసం , అహంభావం కూడా ఉంటాయి . మస్తానీ నృత్యం చేసిన పూణేలోని శనివారవాడలో నృత్యం చేయాలనేది ఆమె చిరకాల కోరిక .
పూణేలో పీష్వా సమక్షంలో నృత్యం చేస్తూ ఆమె , ఆ ఆస్థాన పండితుడు అయిన వెంకట శాస్త్రి ఒకరి మీద ఒకరు సవాలు విసురుకుంటారు . ఆమె ఓడిపోతే శాస్త్రి గారికి బానిస కావాలి . ఆయన ఓడిపోతే ఆమె గజ్జెలు కట్టుకుని నగరంలో తిరగాలి .
ఆ పోటీ దేశమంతా సంచలనం కలిగిస్తుంది . పోటీలో ఆమె కావాలనే ఓడిపోతుంది . కానీ , శాస్త్రి గారు ఆమెను బానిసగా తీసుకోలేక నగరం విడిచి వెళ్ళిపోతారు . ఆమె శాస్త్రి గారింట్లోనో తదుపరి జన్మలోనయినా ఆయనను చేరాలని అక్కడే ఉండిపోతుంది .
బేక్ గ్రౌండ్ మ్యూజిక్ , నృత్యాలు , సెట్టింగులు అద్భుతం . సినిమా రంగంతో సంబంధం ఉన్న ప్రతీ నిపుణుడు , నటులు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడని సినిమా . మీ సినీ రంగ మిత్రులను కూడా చూడమని చెప్పండి . #సినిమా_కబుర్లు
Share this Article