.
Priyadarshini Krishna …… మువ్వగోపాలా ‘ముద్ర’ తో తెలుగునాట క్షేత్రయ్యపదాలు ప్రాచుర్యంలో ఉన్న సంగతి మనందరికీ తెలుసు. కూచిపూడి భాగవతారులు వారి వారి ప్రదర్శనల్లో క్షేత్రయ్య పదాలను అభినయించడం కద్దు.
పదం అంటే మనం తెలుగు భాషలో రోజువారీ వాడే పదం కాదు…. సాహిత్యం ‘పదం’ అనేది ఒక ప్రక్రియ… కవిత, కృతి, కీర్తన, సంకీర్తన, జావళి, తిల్లానా, పదం మొదలైనవి సంగీతాన్ని అనుసరించే సాహిత్య ప్రక్రియలు.
Ads
వీటికి నిర్దిష్టమైన, నిర్ణీతమైన ఛందస్సు ఉంటుంది… ఈ ఛందస్సు వల్లనే ఆయా ప్రక్రియలకు అటువంటి అద్భుతమైన లయ గతులు, శ్రావ్యం ఇముడుతాయి ….
తర్వాతి కాలంలో స్వర్గీయ రుక్మిణీదేవి అరండేల్ సంస్కరించిన భరతనాట్యం రిపట్వా లో ( repertoire ) క్షేత్రయ్య పదం / తెలుగు వారి జావళిలను తప్పనిసరిగా ఉండేలా ఇమడ్చారు. ఇవి అభినయానికి అత్యంత ఆస్కారం వుండే గీతికలు.
వేదాంతం రాఘవయ్య గారు మలిచిన ‘దేవదాసు’ లో ‘ఇంత తెలిసియుండి ..ఈ గుణమేలరా…’ అనే గీతం రూపొందించారు. ఇది సముద్రాల సీనియర్ రచించిన ‘పదం’ పోకడలున్న గీతం… కొండొకచో పదమే ..!! ( కొందరు ఇది సముద్రాల శిష్యుడు మల్లాది వారు రాసినదే అని అభిప్రాయపడతారు).
అయితే, ఇందులో కూడా ‘మువ్వగోపాలా’ ముద్రను యధావిధిగా వాడేసుకున్నారు. నావరకు ఇది ఆక్షేపణీయమే (చిన్నదాన్ని, ఖండించేంత సీన్ లేదు లెండి నాకు, తమ వస్తువును వేరొక బ్రాండ్ గా చలామణి కావించడం లాగా వుంది )
దర్శకుడు వేదాంతం రాఘవయ్య స్వయానా భాగవతార్ కుటుంబం వారవడం వల్ల ఈ చొరవ తీసుకున్నారేమో అని నాకనిపిస్తుంది.
‘వింతదానివలె నన్ను వేరుచేసి రావైతివి
అంతరంగులున్నారా నన్నాదరించేరా
అంతరంగమైన నీవే
ఆదరించిన నీవే
చింతించి చూడా
నా జీవనమూ నీవే…’
అని అచ్చు గుద్దినట్లు క్షేత్రయ్య పోకడలతో సాగుతుంది. ఈ పదానికి మహానర్తకి ట్రావన్‌కోర్ సిస్టర్స్ (లలిత పద్మిని రాగిణి) లో ఒకరైన లలిత ఎంతో హృద్యంగా , అలవోకగా నర్తిస్తారు. పదార్థాభినయం, ముక్తాయింపు జతులు అలవోకగా అలా అలా దొర్లిపోతుంటాయి…
రావూ బాలసరస్వతి గాత్రానికి నేను పేరుపెట్టేంత దానినికాదు. గమకాలకి తగినట్లే ముక్తాయింపు తీర్మానాలను తిప్పికొట్టేస్తారు, ఇద్దరూ…! ఇద్దరూ ఇద్దరే మరి ! అసలు లలితే పాడేస్తోందనేట్లుగా ఉంటుంది. ఇందులో (నాకైతే ) పంటి కింద రాయిలా ANR క్లోసులుంటాయి (Closeups) !! చూసి ఆనందించండి… క్లోసులను కాదు, లలిత సరస్వతులను…
Share this Article