గతంలో… NTR, ANR, Krishna, KrishnamRaju, SobhanBabu ఎట్సెట్రా హీరోలు వెనుక నడుములకు బద్దలు కట్టుకుని, విగ్గులు పెట్టుకుని, వచ్చీరాని స్టెప్పులు వేస్తుంటే… విచిత్రమైన ఫైట్లు చేస్తుంటే… తెలుగు వెండితెర నడుం కూడా వంగిపోయినట్టు కనిపించేది… అప్పుడు చిరంజీవి ఎంట్రీ ఓ పెద్ద రిలీఫ్… తన స్టెప్పులు, తన జోష్, తన ఫైట్లు, యంగ్ అండ్ ఎనర్జిటిక్ లుక్కుతో ప్రేక్షకుల్లోకి బలంగా దూసుకొచ్చేశాడు… తరువాత క్రమేపీ వృద్ధ హీరోలంతా కనుమరుగైపోయారు… Venkatesh, నాగార్జున తదితరులు కూడా వెండితెర కొత్తరక్తాన్ని, కొత్త ఉత్సాహాన్ని అద్దారు… ప్రేక్షకుడు ఊపిరి పీల్చుకున్నాడు… సీన్ కట్ చేస్తే… ఇప్పుడు అదే చిరంజీవి స్టెప్పులు వేస్తూనే ఉన్నాడు… ఈ వయస్సులో ఆయన్ని కష్టపెట్టని స్టెప్పుల్నే డాన్స్ మాస్టర్లు కంపోజ్ చేస్తున్నారు… అదే Nagarjuna, అదే Venkatesh, అదే Rajasekhar…
వెంకటేష్ నయం… దృశ్యం, నారప్ప వంటి భిన్నమైన పాత్రల్ని ఎంపిక చేసుకుని కొత్త బాటలో వెళ్తున్నాడు… తనది డిఫరెంట్ పయనం… మరి నాగార్జున… ఎస్, అదే చెప్పుకోవాల్సింది… ఈ వయస్సులోనూ మంచి బాడీ ఫిజిక్ మెయింటెయిన్ చేస్తాడు… కుర్రాళ్లతో దీటుగా యాక్షన్ సీన్లు చేస్తాడు… డాన్సులు అనబడే గెంతులు కూడా బాగానే వేస్తుంటాడు… కానీ కథలు, పాత్రల ఎంపిక… పూర్, పూరున్నర… హాలీవుడ్ హీరో స్వార్జ్ నెగ్గర్ తరహాలో యంగ్ లుక్కు సరిపోతుందా..? ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటున్నారా..? ప్రత్యేకించి తెలుగు ప్రేక్షకులు చూసీ చూసీ మొహం విసుగ్గా పెడుతున్నారా..? నాగార్జున నటించిన కొత్త సినిమా వైల్డ్ డాగ్ రిలీజైన నేపథ్యంలో ఇది ఓ ఆసక్తికరమైన ప్రశ్నే… ఎందుకంటే..? అప్పుడెప్పుడో అయిదారేళ్లయింది తన సినిమా సోగ్గాడే చిన్ని నాయనా రిలీజై… ఆ తరువాత ఒక్క హిట్టూ లేదు… పైగా ఆఫీసర్, మన్మథుడు-2 వంటివి అడ్డంగా తన్నేశాయి…
Ads
నిజానికి నాగార్జున చాలామందికి ఇష్టుడు… మంచి యంగ్ ఏజ్‌లో, కుర్రపాత్రల జోష్‌లో అన్నమయ్య వేషం కట్టాడు… మీసాలు పెట్టుకుని మరీ మెప్పించాడు… ప్రతి తెలుగింటికీ చేరాడు… భక్తరామదాసు, షిర్టి సాయి, ఆదిశంకరాచార్య వంటి పాత్రలే కాదు… ఊపిరిలో కుర్చీకి అతుక్కుపోయిన పాత్ర… రాజన్నలో ఓ స్వాతంత్య్ర సమర యోధుడి పాత్ర… ప్రయోగాలకు ఎవర్ రెడీ హీరో తను… టీవీల్లోకి వెళ్తే కెరీర్ ఏమిటి అనే పిచ్చి భ్రమల్ని బ్రేక్ చేసి మీలో ఎవరు కోటీశ్వరుడు అంటూ హాట్ సీటులో కూర్చున్నాడు… నాగార్జున ఇంటింటి హీరోను చేసింది ఆ ప్రోగ్రాం… Biggboss టీవీ రియాలిటీ షోకు రెగ్యులర్ హోస్ట్ ఇప్పుడు తను… నిన్న ఎక్కడో చెప్పాడు తను 30, 40 మంది దర్శకుల్ని పరిచయం చేశాను అని… నిజం… చిరంజీవి ఇల్లు హీరోల ఫ్యాక్టరీ అయితే నాగార్జున ఇల్లు దర్శకుల ఫ్యాక్టరీ… కానీ ఆ నాగార్జునకు ఏమైంది..? పాత్రల ఎంపికలో ఎందుకు తప్పుటడుగులు వేస్తున్నాడు..? ఓ స్టూడియో ఓనర్, ఓ హీరో, ఇద్దరు హీరోల తండ్రి, టీవీషోల ప్రజెంటర్,… తనకు ప్రేక్షకుల పల్స్ ఎందుకు తెలియడం లేదు..? వైల్డ్ డాగ్ సినిమా చూస్తుంటే ఇవే ప్రశ్నలు…
వైల్డ్ డాగ్ సినిమాలో ఏముందని..? ఓ టెర్రరిస్టు యాసిన్ భత్కల్ను NIA పట్టేసుకున్న తీరు గురించి చాలా వెబ్ సీరీస్‌లో చూపించిందే కదా… అదేదో సినిమాలోనూ అదే కథ… పత్రికలు, టీవీలు కూడా భత్కల్ పట్టివేత మీద బోలెడు కథనాలు రాశాయి… అందులో ఇంకా ఏం మిగిలిందని ఆ కథను తీసుకున్నాడు నాగార్జున… పోనీ, ఎవరూ చెప్పని ఏదైనా కొత్త విషయాన్ని చెప్పాడా అంటే అదీ లేదు ఈ సినిమాలో… రొటీన్ ఎన్ఐఏ ఆపరేషన్… అదీ పేలవమైన కథనం… వాట్ నెక్స్ట్ అనే ఉత్కంఠను ఏ సందర్భంలోనూ కలగనివ్వని ప్రజెంటేషన్… ముగింపు దాకా అంతే… యాక్షన్, యాక్షన్, యాక్షన్… కేవలం యాక్షన్ కోసమే అయితే, కేవలం నాగార్జున కోసమే అయితే థియేటర్ దాకా వెళ్లాలా..? ఓటీటీలో ఇలాంటి కథలు, ఉత్కంఠ రేపే కథనాలు బోలెడు…
ఆ హీరోయిన్ దియా మీర్జా ఎందుకు ఉందో తెలియదు… సినిమాలో ఎప్పుడు, ఎందుకంత అకస్మాత్తుగా వెళ్లిపోతుందో తెలియదు… సినిమాలో వేరే రిలీఫే లేదు… సీరియస్ ఆపరేషన్… నిజానికి సోకాల్డ్ తొక్కలో కమర్షియల్ హంగులు లేకుండా స్ట్రెయిట్‌గా కథను చెప్పడం ఆహ్వానించాలి… కానీ ఆ చెప్పేదేదో ఆసక్తికరంగా చెప్పాాలి కదా… అది లేదు ఈ సినిమాలో… వయస్సు పైన బడుతున్న ఛాయలు కనిపిస్తూనే ఉన్నాయి నాగార్జున మొహంలో… నాగార్జున మినహా అంతా కొత్తకొత్తగానే కనిపిస్తుంటారు… (బిగ్‌బాస్ ఫేమ్ ఆలీరెజా కాస్త ముఖపరిచయం జనాలకు…) తెలుగు సినిమా గాకుండా ఏదో హిందీ వెబ్ సీరిస్ ఎపిసోడ్ తెలుగు పెద్ద తెర మీద చూస్తున్నట్టుగా…! మరీ ఫస్టాఫ్ అయితే బోరింగు… పైగా అక్కడక్కడా లాజిక్కులు లేని అంశాలు… సరే, ఏదో దిక్కుమాలిన క్రియేటివ్ లిబర్జీ తీసుకున్నారులే అనుకున్నా… కథ రక్తికడితే అవన్నీ కప్పబడిపోతాయి… అదే ఇక్కడ లోపించింది… సారీ నాగార్జునా… మళ్లీ ఓ ఆఫీసర్ సినిమా చూపించావుపో…! అన్నట్టు… మీరు చెప్పినట్టు Indias biggest under cover operation ఏమీ కాదు ఇది… బోలెడున్నయ్…
Share this Article