.
పైత్యం అంటే ఎలా ఉంటుంది..? పెద్దగా కష్టపడనక్కర్లేకుండానే జవాబు స్పురిస్తుంది… తెలుగు టీవీ సీరియళ్లు, టీవీ షోల క్రియేటివిటీ… అదే జవాబు…
శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఓ దిక్కుమాలిన కార్యక్రమం వస్తుంది కదా ఈటీవీలో… మొదట్లో బాగానే ఉండేది… కానీ అదీ ఢీ, జబర్దస్త్ తరహా బూతులు, రొటీన్ టీవీ షోలాగా మారిపోయింది… విషయం ఏమిటంటే..?
Ads
ఓ ప్రోమో కనిపించింది… వచ్చే ఎపిసోడ్‌కు సంబంధించి… ఎప్పటిలాగే ఇంద్రజ, రష్మి వచ్చారు… కాసేపు ఎగిరారు… తరువాత ఇంద్రజ చెబుతోంది… ‘‘నేను వాలెంటైన్స్ డేను ఈరోజు డిఫరెంటుగా ప్లాన్ చేశాను… ప్రేమ అంటే ప్రేమికుల నడుమ ఉన్నదే కాదు, అన్నా చెల్లెళ్లు, తల్లీకొడుకుల నడుమ ఉండేదీ ప్రేమే… ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకునేది ప్రేమికుల్ని కాదు, ప్రేమల్ని…’’
నిజానికి ఈ ఎపిసోడ్ రాబోయేది 9వ తేదీన… మరి వాలెంటైన్స్ డే 14న… ఈ తేదీల నడుమ ఈ ప్రేమ బంధం ఎలా కుదిరిందో తెలియదు గానీ… ఈ షో క్రియేటివ్ టీమ్‌కు క్రియేటివిటీ మరీ ఎక్కువై, పొంగి, మత్తళ్లు దూకుతున్నట్టుంది…
వాలెంటైన్స్ డే అంటేనే ప్రేమికుల దినోత్సవం… అది ప్రేమికుల కోసం ఉద్దేశించింది మాత్రమే… దానికి ఇక తల్లీకొడుకుల ప్రేమలు, అన్నాచెల్లెళ్ల ప్రేమలతో సంబంధం లేదు… ఆ ప్రేమలు వేరు… వాటికీ వాలెంటైన్స్ డేతో ముడిపెట్టడం అబ్సర్డ్… ఈ షోలను తీసేవాళ్లకు చూసేవాళ్లు లోకువ… అంతే… ఈటీవీ రియాలిటీ షోలన్నీ అదే బాట కదా…
సరే, ఏదో పైత్యం అనుకుందాం… షోలో తల్లీకొడుకులతో స్టెప్పులు కూడా వేయించారు… డాన్సులు చేయించారు… కలిపి ఆడించారు… ఒక్క ముక్కలో చెప్పాలంటే… దీనికే తెలుగులో దిక్కుమాలిన పైత్యం అనే పేరుంది… రోజురోజుకూ ఈటీవీ రియాలిటీ షోలు దారుణమైన రేటింగ్స్ నమోదు చేస్తూ… ఎవడూ చూడాల్సిన పనేమీ లేదులే అన్నట్టుగా మారిపోతున్నాయి…
దానికి తోడు ఇదుగో ఈ తలకుమాసిన ప్రయోగాలు… ఒక తల్లి ప్రేమను సెలబ్రేట్ చేయడానికి మదర్స్ డే లేదా..? ఫాదర్స్ డేలు, ఇంకా నానా డేలున్నాయి… వాలెంటైన్స్ డే అనేదే ఓ నాన్సెన్స్… యోయో రూమ్స్ అడ్డగోలుగా బుక్కయి, ఆ పనినే ప్రేమ వ్యక్తీకరణగా యువత బలంగా ప్రదర్శించేరోజు…
ఆ ప్రేమ తద్దినమే చిరాకు పుట్టించే యవ్వారం కాగా… చివరకు తల్లీకొడుకులతో స్టెప్పులు వేయించే ఈ ఈటీవీ వాలంటెన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ తిక్కదనం మరీ వికారం… అసలు యాణ్నుంచి వస్తార్రా మీరంతా..! నయం, ప్రోమోలో హైపర్ ఆది కనిపించడం లేదు, లేనట్టున్నాడు… ఉండి ఉంటే ఇంకెలా ఉండేదో..!!
Share this Article