.
మనసును కదిలించిన ఓ మంచి సంఘటన…!!
*****************************
ఉదయాన్నే వివిధ పనులు…. వృత్తులకు వెళ్లే వారి హడావుడి రోడ్లపై ఉంది.
ఉరుకుల, పరుగుల జీవితంలో…..
పొద్దున్నే …. ప్రజల సంచారం ….
అధికంగా కనిపిస్తుంది.
వాహనాల రద్దీ అధికంగా ఉంది.
ఈలోగా…..
ఓ … అంబులెన్స్ ….
కుయ్.. కుయ్.. మంటూ రోడ్డుపై వేగంగా వెళ్తుంది.
దాన్ని గమనించిన వాహనదారులు పరుగు పరుగున పక్కకు జరుగుతున్నారు.
మంగళవారం నాడు ఉదయం పూట….
పాత బస్టాండ్ మీదుగా సూర్యాపేట ఏరియా హాస్పిటల్ వైపు అంబులెన్స్ …..
సైరన్ మ్రోగిస్తూ …. వేగంగా వెళుతుంది.
ప్రమాద పరిస్థితుల్లో ఉన్న ఎవరినో ఆసుపత్రికి చేర్చేందుకు అంబులెన్స్….
వేగంగా దూసుకుపోతోంది.
Ads
అయితే …
ఇక్కడ ఓ సంఘటన చూస్తే …..
మనస్సు చలించి పోయింది.
స్పీడ్ గా వెళుతున్న అంబులెన్స్ వైపు చూస్తూ…..
రోడ్డుపై వెళ్తున్న ఓ విద్యార్థిని …
రోడ్డు పక్కన నిల్చొని…. కళ్ళు మూసి… చేతులు జోడించి…. అంబులెన్స్ వెళ్తున్న దిశగా మళ్లీ….. నమస్కరిస్తుంది….!
అక్కడి నుండి వెళ్తూ….
ఆ సన్నివేశాన్ని గమనించిన నేను ఆ…. చిన్నారిని ఇలా అడిగాను….!
సాధారణంగా …. దారిన వెళ్తున్నప్పుడు… పవిత్ర దేవాలయాలు.., ప్రార్థన మందిరాలు…, దైవిక ప్రదేశాల్లో అటుగా వెళ్తున్న వారు కళ్ళు మూసుకొని ప్రార్థించుకోవడం జనరల్ గా గమనిస్తుంటాం ..!
కానీ….
మరి నీవెందుకు… అంబులెన్స్ వెళ్తుంటే…. కళ్ళు మూసుకొని…. చేతులు జోడించి … కళ్ళను చేతులతో అద్దుకొని వెళ్తున్నారు….. ఎందుకని…? అని అడిగాను.
అప్పుడు…
ఆ చిన్నారి… చెప్పిన మాటలు వింటే…. నిజంగా గుండె బరువెక్కింది.
ఆ … అంబులెన్స్ లో… ఎవరో ప్రాణాపాయ స్థితిలో ఉండి ఉంటారు..!
వారు ఎవరో మనకు తెలియకున్నా…..
సాటి మనిషి ఆపదలో ఉన్నట్టు అర్థమవుతుంది.
అలాంటి ఆపద పరిస్థితుల్లో…. వారి కుటుంబీకులు బాధతో ఉంటారు. పేషెంటు ప్రాణాపాయ స్థితిలో ఉంటారు.
వారిపై …..
కుటుంబ సభ్యులు ఆధారపడి ఉంటారు. వారు ఒక్కరు సరిగా లేకుంటే…..
వారి కుటుంబం చిన్నా భిన్నమయ్యే పరిస్థితి ఉంటుంది.
వారి కుటుంబీకులు, వారి బంధువులు ఎంతో ప్రేమ ఆప్యాయతతో ఉంటారు.
వారు ప్రమాదంలో చిక్కుకొని ఇబ్బంది పడితే…..
వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురవుతుంది.
కుటుంబ పరిస్థితి అంతా…..
తారుమారవుతుంది.
జరగరానిది ఏదైనా జరిగితే …..
ఆ కుటుంబం బజారున పడే పరిస్థితి ఉంటుంది…!
అందుకే….
ప్రమాదాల్లో ఉన్న ఏ వ్యక్తి అయినా….
సత్వరమే కోలుకునేలా దీవించమని….
వెళ్తున్న ఆ అంబులెన్స్ ని చూస్తూ ….
భగవంతుడిని కోరుకున్నాను అంది ఆమె…
కాసేపు నా మనసును ఆవరించిన మౌనం.
నిజంగా దేవుడు …
ఇలా ప్రతి మనిషి మంచి ఆలోచనల్లో …
మంచి పనుల్లో ఉంటాడని అర్థమయ్యింది.
ఆపదలో ఉన్న…..
సాటి మనిషి….
ప్రమాద స్థితి నుంచి వేగంగా కోలుకొని….
మళ్లీ సాధారణ మనిషిగా జీవించాలని…. కోరుకుంటూ ….
కాస్త …..
కళ్ళు మూసుకొని వారి కోసం భగవంతుని ప్రార్థించాను….
అని చెప్పిన ….
ఆ చిన్నారి సమాధానం నిజంగా హృదయాన్ని తాకింది.
కానరాని భగవంతుడిని కనుల ముందుకు తెచ్చుకుని….
ఎవరో తెలియని మనిషి కోసం కాసింత ఆగి….
వారు బాగుండాలని కోరుకునే ఆ… చిన్నారి విధానం చూస్తే…..
నిజంగా చాలా సంతోషం కలిగింది.
మనిషే సాటి మనిషిని…
వివిధ అంతరాలు… ఆచారాలు …అలవాట్ల పేరుతో ….
కొందరు అసమానతతో చూస్తున్న పరిస్థితుల్లో…..
సమాజ హితాన్ని కోరుతూ…..
ఓ మంచి ఆలోచనలతో….. సాటి మనుషులంతా మంచిగా ఉండాలనే తలంపుతో ఉన్న …..
ఈ చిన్నారి మనస్తత్వాన్ని …..
నిజంగా అభినందించాల్సిందే.
ఎవరు… ఎవరికి ఏమి పెట్టకున్నా…
అందరూ బాగుండాలి … అందులో మనం ఉండాలని…. కోరుకుంటే…..
సమాజమంతా బాగుంటుంది.
ఓ మంచి వ్యవస్థ రూపుదిద్దుకుంటుంది.
ఇంత మంచి మనసున్న ఈ చిన్నారికి….
నిజంగా …..
సెల్యూట్ చేయాల్సిందే……! –— బి.వి.ఆర్. ( బొల్లెద్దు వెంకట్ రత్నం ) Cell : 9963616381
Share this Article