.
ముందుగా చిన్న వివరణ… హైకోర్టు బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేయడం వేరు… హైకోర్టునే కర్నూలుకు తరలించడం వేరు…
కేవలం కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం వల్ల, హైకోర్టు కక్షిదారులు ఏపీ రాజధాని దాకా రానవసరం లేదు… కర్నూలు చుట్టూ తిరిగితే చాలు… మరి దీనివల్ల కర్నూలు న్యాయ రాజధాని అవుతుందా..?
Ads
దీంతో కర్నూలు అదనంగా అభివృద్ది చెందడానికి ఆస్కారం కల్పిస్తుందా..? అప్పట్లో ఎవరో అన్నారు కదా… నాలుగు జిరాక్స్ షాపులు పెరుగుతాయి అని… అంతేనా..? సరే, ఒక్కసారి ప్రయాగరాజ్ వెళ్లొద్దాం…
అదే, ప్రస్తుతం కుంభమేళా జరుగుతున్న ప్రదేశమే… అక్కడ ఏకంగా హైకోర్టునే ఏర్పాటు చేశారు… మిగతా పాలన వ్యవహారాలు లక్నోలోనే… కానీ లీగల్ వ్యవహారాలు ప్రయాగరాజ్‌లో..! ఇటీవల ప్రయాగరాజ్‌లో కుంభమేళా పనుల కోసం వెళ్లి, అక్కడే అడ్డావేసిన ఒకరిద్దరు మిత్రులు గమనించింది ఏమిటీ అంటే..?
అక్కడి ప్రాపర్టీలు విపరీతమైన లీగల్ ఇష్యూల్లో ఉన్నాయి… ఎందుకంటే..? అడ్మినిస్ట్రేషన్, బిజినెస్, పాలిటిక్స్, లీగల్ నడుమ బ్యాలెన్స్ లేదు… అక్కడ ప్రధానమైన వ్యాపకం లీడల్ ఇష్యూసే… అందుకే లాయర్ల సంఖ్య బాగా ఎక్కువ… చిన్న చిన్న ఇష్యూస్‌కు సైతం కోర్టుల్లో కేసులు వేసుకోవడమే…
ఈ ఆధ్యాత్మిక ఉత్సవాలు, రెగ్యులర్ భక్తుల రాకడ తప్ప వేరే ఆదాయ మార్గాలేమీ లేవు… లాయర్లు ఎక్కువ కావడం వల్ల పోలీసుల పెత్తనాలు కూడా తక్కువే అక్కడ… ఓచోట ఈ మిత్రుల బృందం గమనిస్తే, వరుసగా 15 ఇళ్లలో ఆరేడు ఇళ్లకు కోర్టు సీళ్లు…
సిటీలో ఇలాగే అనేక లిటిగేషన్లు… సో, వేరే డెవలప్‌మెంట్ యాక్టివిటీ ఏమీ ఉండదు… ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే..? ఒకవేళ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యి, కోర్టులు కూడా అంగీకరించి, కర్నూలును న్యాయరాజధానిగా చేసినా సరే, అది కర్నూలు అభివృద్ధికి పెద్ద స్కోప్ ఏమీ ఉండేది కాదు అని చెప్పడానికి అలహాబాద్ (ప్రయాగరాజ్) న్యాయనగరమే ఉదాహరణ…
మూడు రాజధానులు అనే కాన్సెప్టు స్థూలంగా పైకి బాగానే వినిపించినా, అనిపించినా సరే, ఆచరణలో క్లిష్టత, అసలైన ప్రయోజనం పెద్ద ప్రశ్నార్థకం… కానీ ఏపీ పాలిటిక్స్ ప్రస్తుత స్థితిలో ఏ ఇష్యూ అయినా సరే, సరైన, శాస్త్రీయ అధ్యయనాలు, చర్చలు జరిగే సీన్ లేదు… అందుకే కర్నూలు న్యాయరాజధాని అనే అంశంపైనా సరైన అంచనాల్లేవు, ఆలోచనల్లేవు, అడుగుల్లేవు..!!
Share this Article