ఇలా తలుచుకోగానే అలా నిద్ర పట్టేసి… వెంటనే గాఢ నిద్రలోకి జారిపోయి… లోకాన్ని మరిచిపోయి… అనుకున్న టైంకు టంచన్‌గా మెలకువ వచ్చేవాళ్లంత అదృష్టవంతులు ఇంకెవరూ ఉండరేమో..! Sound Sleep అనండి, ReSoundSleep అనండి… నిద్ర… మన దైహిక జీవక్రియల్ని సెట్‌రైట్ చేయడానికి ఉపయోగపడే రెస్ట్ పిరియడ్… నిద్ర… ఒక మెడిటేషన్… నిద్ర… ఒత్తిళ్ల నుంచి రిలాక్స్ చేసి, సగం ఆరోగ్య సమస్యల్ని దరిదాపుల్లోకి రానివ్వకుండా చేసే ప్రొటెక్టర్… నిద్ర… అతి పెద్ద స్ట్రెస్ బస్టర్… కానీ మన నిద్ర కూడా మనకు కాకుండా పోతోంది… దెబ్బతింటోంది… వెరసి మనల్ని నష్టపరుస్తున్న జాబితాల్లోకి నిద్రారాహిత్యం… అనగా స్లీప్లెస్నెస్… Sleeplessness… కూడా చేరిపోతోంది… కాదు, కాదు, చేరిపోయింది… Wakefit.co అనే ఓ సంస్థ ఉంది… హోమ్ సొల్యూషన్స్ దాని వ్యాపారం… కరోనా మన జీవితాల్ని కకావికలం చేయడం మొదలుపెట్టిన మార్చి 2020 నుంచి ఫిబ్రవరి 2021 వరకు… అంటే సంవత్సరకాలం 16 వేల మంది అభిప్రాయలను సేకరించి, క్రోడీకరించి Great Indian Sleep Scorecard (GISS) 2021 పేరిట ఓ నివేదిక విడుదల చేసింది… కొన్ని ఆందోళనకరమైన అంశాలు కనిపిస్తున్నయ్… ఉదాహరణకు బెంగుళూరునే తీసుకుందాం… అది ఐటీ హబ్ కదా… (అన్ని నగరాలూ ఇలాగే ఉంటయ్, కాస్త ఇటూఅటూ…)
- పనిచేస్తున్న సమయంలోనే అకస్మాత్తుగా నిద్ర ముంచుకొస్తున్నదట 81 శాతం మందికి… అప్పటికప్పుడు కళ్లుమూసుకుని కాసేపు నిద్ర పోతే బాగుండు అనిపిస్తున్నదట… ఇలా వారానికి రెండుమూడుసార్లు… అంటే కారణం రాత్రిళ్లు సరైన నిద్ర లేకపోవడం…
- రాత్రి పడుకున్నాక ఏదో ఒక టైంకు అకస్మాత్తుగా దిగ్గున లేచి కూర్చుంటున్నారట… తరువాత నిద్ర పట్టదట… కలత నిద్ర… అంటే నాసిరకం నిద్ర… Not Sound Sleep… దాదాపు 92 శాతం మందికి ఉంది ఈ సమస్య… అంటే మన స్లీప్ సైకిల్ ఆల్రెడీ దారుణంగా డిస్టర్బ్ అయిపోయిందన్నమాట…
- 15 శాతం మంది రాత్రి ఒంటి గంట తరువాతే నిద్రపోతున్నారు… 19 శాతం మంది ఉదయం ఎప్పుడు లేస్తున్నారో తెలుసా..? 9 గంటల తరువాత..! ఇలా లేచేవాళ్లలోనే కాదు, అసలు 42 శాతం మందికి లేవగానే ఒళ్లునొప్పులు, నడుంనొప్పులు…
- అప్పటిదాకా ఏం చేస్తున్నారు.? సోషల్ మీడియాతో టైం కిల్ చేస్తున్నారు… అర్ధరాత్రి దాటేదాకా సోషల్ మీడియాలో మునిగితేలుతున్నారు… ఇలాంటివాళ్లు 25 శాతం ఉన్నారు… 29 శాతం మంది మూవీస్, వీడియోస్ చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు…
- 95 శాతం మంది పడుకునేముందు వరకూ స్మార్ట్ ఫోన్ వాడుతూనే ఉన్నారు… పడుకునే సమయంలోనూ పక్కలోనే ఉండాలి… అంటే స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా మన జీవితాల్లో ఎంత భాగమయ్యాయో చెప్పే అంకెలు ఇవన్నీ…
- నైట్ షిఫ్టులు, సుదీర్ఘమైన స్క్రీన్ టైమ్ (కంప్యూటర్, స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్, ట్యాబ్), ఎక్కువ పనిగంటలు, పని టార్గెట్లు గట్రా ఇప్పటికే మన నిద్రావ్యవస్థను ఛిన్నాభిన్నం చేసేస్తున్నయ్… మన జెనెటిక్ కేరక్టర్ రాత్రి సుఖనిద్ర, పగటివేళ పని… అది లేదిప్పుడు… దాని పర్యవసానాలు ఇంకెన్ని చూడాలో ఏమో…
- డాక్టర్ల వద్దకు ఇన్సోమ్నియా (నిద్రలేమి) పేషెంట్ల రాక చాలా పెరిగిపోయింది… అసలు సమస్య అది కాదు, నిద్రాలేమి వల్ల కలిగే ఇతర సమస్యలు…!!
Share this Article
Ads