పూర్వకాలంలో తర్కం… అనగా లాజిక్ అనేది ఒక శాస్త్రం… ఎప్పుడైతే రాజకీయ నాయకులు ‘విపరీత తర్కానికి’ ఎగబడ్డారో అప్పుడే తర్కశాస్త్రానికి దుర్దినాలు ప్రారంభమై… ఇప్పుడు తర్కం అనేది ఓ బూతుగా మారింది… ఉదాహరణ కావాలా..? ఉండవల్లి అరుణ్‌కుమార్ అనబడే ఓ మాజీ ఎంపీ… అప్పుడప్పుడూ ఉండవల్లి ప్రెస్మీట్లు చూస్తుంటే ఘాజి హరి అలియాస్ సబ్బం హరి కాస్త బెటరేమో అనిపిస్తూ ఉంటుంది… ఎందుకంటే..? ఘాజి హరి బీకామ్ ఫిజిక్స్ కావచ్చుగాక… ఉండవల్లిది కాస్త పర్వర్షన్… కాస్త డిటెయిల్డ్గా చెప్పుకుందాం… పోనీ, ఆ తర్కాన్నే ఆశ్రయిద్దాం… ఈ సోకాల్డ్ జగన్ క్యాంపుకి, జగన్ కోట్లు వెచ్చిస్తున్న మీడియా విభాగాలకు అంతకుమించి ఉందని అనుకోలేం గానీ, నిష్ఠురంగా ఉన్న నిజాల్ని మాట్లాడుకుందాం…
ఏం, మళ్లీ జైలుకు వెళ్తే తప్పేమిటి..? నీకేమైనా కొత్తా..? వెళ్లు… ప్రజల వైపో, మోడీ వైపో తేల్చుకో… జైల్లో పడితే అక్కడి నుంచే పాలన కొనసాగించొచ్చు… మరింత మైలేజీ వస్తుంది… కమాన్, విశాఖలో కూర్చుని ఓ డిక్లరేషన్ ఇద్దాం అంటున్నాడు ఈ పెద్ద మనిషి… ఇది తమ లైన్‌కు అనుగుణంగా ఉంది గనుక, తమ లైన్‌కు అనుగుణంగా ఉండే ఏ సాదాసీదా మనుషులకైనా యెల్లో మీడియా ప్రాధాన్యం ఇస్తుంది గనుక అది జనంలోకి వెళ్తోంది… అయితే..? తెలివి మరీ ఎక్కువైన ఉండవల్లికి ఒకటీరెండు ప్రశ్నలు వేద్దాం… జస్ట్, మన క్లారిటీ కోసమే…
Ads
- నువ్వెవరు..? కాంగ్రెసా..? అసలు ఆ పార్టీ ఉందా ఏపీలో..? ఏ హోదాలో ఏం డిమాండ్ చేస్తున్నవ్..;
- వోకే, నువ్వు ఓ సగటు మనిషివి అనుకుందాం… ఒక పార్టీ అధినేత ధోరణి ఇలా ఉండాలని నువ్వెవరు డిక్టేట్ చేయడానికి..?
- చేశావుపో, ప్రైవేటీకరణ పాలసీ అనేది ప్రజావ్యతిరేకం అని తేల్చేయడానికి నువ్వెవరు..?
- తేల్చేశావుపో, కానీ ప్రైవేటీకరణ అనేది కేవలం విశాఖ ఫ్యాక్టరీ గురించే కాదుగా… అది నేషనల్ పాలసీ… దేన్ని సమర్థించాలో, దేన్ని వ్యతిరేకించాలో వైసీపీ అనే పార్టీ తనదైన శైలిలో ఖరారు చేసుకుంటుంది… ఒక పార్టీ లైన్ ఇలా ఉండాలని నువ్వెవరు చెప్పడానికి..?
- ఎస్, జగన్ దుర్మార్గుడు, చేతకాదు, జైలుకు వెళ్తానని భయపడుతున్నాడు, మరి నువ్వు ఉన్న పార్టీ ఏం చేస్తోంది..? నీ పార్టీ ఏం చెప్పినా వేస్ట్ అనే కదా (కాంగ్రెస్‌లో ఆయన ఉండి ఉన్నట్టయితే… ఆ పార్టీ ఇంకా ఏపీలో ఉన్నట్టయితే…) మిమ్మల్ని జనం బంగాళాఖాతంలో కలిపింది… మరిక మీ మాటలకున్న విలువ ఎంత..?
- ప్రజలా..? మోడీయా..? అనేది మరో నాన్సెన్స్…. ప్రజలు మోడీతో ఉన్నారో లేదో ఉండవల్లి కాదు, జనం తేలుస్తారు… జనం తిరస్కరించిన ఉండవల్లి వంటి కేరక్టర్లు కాదు కదా… మరీ ఉండవల్లి కూడా బండ్ల గణేష్, కేఏపాల్ అయిపోతే ఎలా..?
- జైళ్లో ఉండు, నీకేమైనా కొత్తా..? అనే వ్యంగ్య వ్యాఖ్య సరే….. పరోక్షంగా మళ్లీ జగన్ జైలుకు వెళ్తే బాగుండు అనుకుంటున్నావా..? ఇలాంటి పర్వర్షన్ ఉన్నందుకే కదా నీలాంటోళ్లను జగన్ పది ఆమడల దూరం ఉంచింది… మళ్లీ ఈ పనికిరాని సలహాలు దేనికి..?
- ప్రైవేటీకరణ కావచ్చు, మరేదైనా పాలసీ కావచ్చు… సమర్థించాలా, వ్యతిరేకించాలా అనేది వైసీపీ ఇష్టం… పార్టీగా దానికీ కొన్ని ఎత్తుగడలు, పట్టూవిడుపులు ఉంటయ్… నాన్సెన్స్, అది కరెక్ట్ కాదు అని చెప్పడానికి తమరెవరు..? నీలాంటోళ్లను నమ్ముకుని ఉంటే ఆ పార్టీ ఇప్పుడు ఈ స్థితిలో ఉండేదా..?
- నీకు చేతనైతే నువ్వు పోరాడవయ్యా, అది చేతకాదు, ఆ బలం లేదు… పైగా నువ్విలా ఉండు, నువ్వు జైలులో పడి ఉండు అని చెప్పడం భావదరిద్రమే కాదు, అంతకుమించి…
- అసలు వైఎస్ ఆంతరంగికుడివి అయినా సరే, జగన్ నిన్ను దూరం పెట్టాడు అంటేనే, ఎక్కడో ఏదో తేడా ఉందని కదా అర్థం… ముందు ఆ ఆత్మవిమర్శ ముఖ్యం కదా…
- పెద్ద ఐరనీ ఏమిటంటే..? వైఎస్ సన్నిహితుడిగా ఏ రెండు పత్రికల్ని వ్యతిరేకించావో, వాళ్లు మాత్రమే నిన్ను మోస్తున్నారు ఇప్పుడు… వాళ్లకు అవసరం కాబట్టి… ఈమాత్రం సోయి లేకపోతే ఎలాగయ్యా ఉండవల్లీ…?
వివేకా హత్య కేసే తీసుకుందాం… ఎస్, ఆ తర్కాన్నే ఆధారంగా తీసుకుందాం,,, వివేకా హత్య నిందితులు బయటపడితే తనకు రాజకీయంగా నష్టం అని జగన్ భావిస్తున్నాడు… నిజం అదే… రాజకీయాల్లో బంధువులు, మిత్రులు తొక్కాతోలు ఏమీ ఉండవు… తను, తన కుర్చీ మాత్రమే ముఖ్యం… జగన్ కూడా రాజకీయ నాయకుడే కదా… సొంత బాబాయ్ అయితేనేం, హత్యకు గురయ్యాడు… మొదట్లో సీబీఐ దర్యాప్తు కావాలన్నాడు, తన పాలన వచ్చాక అక్కర్లేదన్నాడు, అటక మీద పారేశాడు… అంటేనే, వివేకా హత్య కారణాలు బయటపడకూడదని… అది తనకు నష్టం అని… ఇన్నిరోజులూ ఆ కేసు అలా పడి ఉందంటే అర్థం, జగన్‌కు అదలా కోల్డ్ స్టోరేజీలో పడి ఉండటమే కావాలి కాబట్టి… ఆ కేసు తేలితే తనకు నష్టం కాబట్టి… అందుకే తను మాట్లాడడు, ఏమీ చెప్పడు, సింపుల్… అదే లాజిక్… కానీ..?
వివేకా హత్య కారణాలు చెప్పాలి, హంతకులెవరో చెప్పాలి, జగన్ మాత్రమే చెప్పాలి అనే డిమాండ్లు దేనికి..? ఆయన చెల్లెళ్లు కూడా తిట్టిపోస్తున్నారు అనే టాంటాం దేనికి..? ఏం..? అప్పట్లో స్పెషల్ దర్యాప్తు చేయించాడు కదా, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పొచ్చు కదా వివేకా హంతకులెవరో, హత్యకు కారణాలు ఏమిటో..? తను ఎందుకు చెప్పడం లేదు..? రాజకీయ హత్యే అయితే చంద్రబాబు ఎందుకు చెప్పడం లేదు..? ఎందుకు జగన్‌ను బజారుకు లాగడం లేదు..? జగన్‌ను వ్యతిరేకించి, చంద్రబాబుకు డప్పు కొట్టడమే జర్నలిజంగా భావించే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈ డిమాండ్ చేయడం ఏమిటి అసలు..? తనకు తెలిసింది పబ్లిష్ చేయొచ్చు కదా… పోనీ, వివేకా వ్యక్తిగత జీవితం తాలూకు చీకటి కోణాలు జగన్ బయటపెడితే జీర్ణించుకోవడానికి ఆయన కుటుంబం సిద్ధంగా ఉందా..? పోనీ…. ఇదే షర్మిల, ఇదే వివేకా బిడ్డ ఎందుకు తమకు తెలిసిన నిజాలు చెప్పడం లేదు..? ఫలానా కారణంతో జగన్ ఈ హత్యను పట్టించుకోవడం లేదు అని ఎందుకు జనానికి వివరించడం లేదు..? జగన్ దుర్మార్గుడే, జగన్ అధికార దాహానికి స్వపరబేధం లేదు సరే… మరి చంద్రబాబు కూడా ఎందుకు దాచిపెడుతున్నాడు..? అన్నీ తెలిసినవాడే కదా… సో, తర్కం ఇలాగే ఉంటుంది…!! ఇక్కడ అంతిమంగా చెప్పేది ఏమిటంటే….. జగన్ శుద్ధపూస కాదు, అలా అయితే సీఎం అయ్యేవాడే కాదు… కాకపోతే నువ్వు ఇలా నడవాలి అని నిర్దేశించే నైతిక హక్కు వీళ్లకు ఉందా అనేదే ప్రధానమైన ప్రశ్న..!!
Share this Article