.
కేరళ సినిమా పూర్తిగా దెబ్బతిన్నది… ఇక సినిమాలు తీయలేం… ఇవేం పారితోషికాలు..? ఇంత నిర్మాణ ఖర్చు ఎలా రికవరీ… అంటూ నిర్మాతలు లబోదిబో… అవసరమైతే మొత్తం సినిమాలపై బ్యాన్ పెట్టుకుంటాం, నో షూటింగ్స్, నో మోర్ న్యూ ప్రాజెక్ట్స్ అంటున్నారు కదా…
నిజానికి అది ప్రతి భాష ఇండస్ట్రీలోనూ ఉన్నదే… తమిళం, తెలుగు అయితే మరీ దారుణం… హీరోల రెమ్యునరేషన్లు మరీ అడ్డగోలు… టికెట్ల ధర పెంపుతో అదంతా ప్రేక్షకుల జేబుల నుంచి వసూళ్లు… ఎవడు అంతగా ఖర్చు పెట్టమన్నాడురా అని ప్రభుత్వాలు అడగవు… ఏ దిల్ రాజో కన్విన్స్ చేస్తాడు కదా… జీవోలు వచ్చేస్తుంటాయి… హీరోలు మరికొన్ని సొంత విమానాలు కొనుక్కుని మబ్బుల్లో తిరుగుతూ ఉంటారు…
Ads
నిజానికి ఏడవాల్సింది కన్నడ ఇండస్ట్రీ… రెండుమూడేళ్లుగా కేజీఎఫ్, కాంతారా వంటి సినిమాలతో కన్నడ ఇండస్ట్రీ సంచలన హిట్స్ కొట్టింది… హిందీ డబ్బింగ్ వెర్షన్లతో బాలీవుడ్‌నూ షేక్ చేసింది వసూళ్లతో… కానీ కొన్నాళ్లుగా చతికిలపడిపోయింది… ఈ ఏడాది ఇప్పటివరకు దాని దుర్గతి ఏమిటో తెలుసా..?
37 సినిమాలు రిలీజైతే మొత్తం వసూళ్లు 13 కోట్లు… అంటే సగటున ఒక్కో సినిమా కలెక్షన్ జస్ట్, 35 లక్షలు… అంటే ప్రమోషన్ల ఖర్చు, పబ్లిసిటీ ఖర్చు కూడా రాలేదన్నమాట… ఇప్పుడప్పుడే పెద్ద సినిమాలు వచ్చేవి కూడా ఏమీ లేవు… అదీ శాండల్‌వుడ్ దురవస్థ…
ఓసారి ఈ టేబుల్ చూడండి…
All Movies Gross : 1434 Cr / 224
All Movies Net : 1269 Cr / 224
Hindi Net : 490 Cr / 25
Kannada Net : 13 Cr / 37
Malayalam Net: 86 Cr / 34
Tamil Net : 192 Cr / 42
Telugu Net : 437 Cr / 32
Marathi Net : 8 Cr / 12
English Net : 23 Cr / 18
స్కై ఫోర్స్, ఛావా పుణ్యమాని హిందీ సినిమా కాస్త కళకళ… 25 సినిమాలకు 490 కోట్ల వసూళ్లు అంటే కాస్త నయమే… సగటున 20 కోట్లు… మలయాళం వాళ్లు మొత్తుకున్నది నిజమే… అక్కడ 34 సినిమాలు రిలీజైతే సగటున రెండున్నర కోట్లు… అంటే కన్నడంకన్నా బెటరే…
తమిళంలో అజిత్ విడముయార్చి (పాన్ ఇండియా) ఫెయిల్ టాక్ వచ్చినా సరే 135 కోట్లు వసూలు చేసింది… మొత్తంగా చూస్తే 42 సినిమాలకు గాను 192 కోట్లు, అంటే సగటున నాలుగున్నర కోట్లు అంటే నయమే కదా… ఎటొచ్చీ తెలుగు ఇండస్ట్రీయే కాస్త సేఫ్.,. సంక్రాంతికి వస్తున్నాం 250 కోట్లతో బ్లాక్ బస్టర్… కాగా డాకూ మహరాజ్ 125 కోట్లు, గేమ్ చేంజర్ 186 కోట్లు (పాన్ ఇండియా), తండేల్ 82 కోట్లు…
దాంతో సగటున 13, 14 కోట్లు… బ్రహ్మానందం, లైలా డిజాస్టర్లు… నిన్న కొత్తగా విడుదలైనవి కూడా పెద్ద వసూళ్లు తెచ్చి పెట్టే బాపతు కాదు… సో, రెండు మూడు పెద్ద సినిమాలు పడితే తెలుగు సినిమా ఇండస్ట్రీ దేశంలోకెల్లా ప్రాఫిటబుల్ అనిపించుకుంటుంది… థాంక్స్ టు టూ స్టేట్స్… ప్రేక్షకులు జేబులు కత్తిరించి మరీ నిర్మాతల గల్లాపెట్టెలను నింపుతున్నాయి కదా…!!
Share this Article