Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గంగజలానికి స్వీయశుద్ధి సామర్థ్యం… ఎవరు చెప్పారో తెలుసా..?!

February 23, 2025 by M S R

.

అయ్యో, అయ్యో… అపచారం… దారుణం… కుంభమేళా స్నానాలతో అక్కడ దారుణంగా మలబ్యాక్టీరియా పెరిగిపోయి కంపు కంపు అయిపోయాయి నీళ్లు… అంటూ ఆమధ్య ఎవరో ఏదో రిపోర్ట్ ఇచ్చారనీ, ఏదో సంస్థ సీరియస్ అయ్యిందనీ వార్తలొచ్చాయి కదా…

ఎహె, పోవయ్యా, తలతిక్క రిపోర్టులు రాయకండి, స్నానం చేయడమే కాదు, తాగొచ్చు కూడా… అంటూ యోగీ ఖండఖండాలుగా నరికాడు కదా… ఇప్పుడు ఓ భిన్నమైన రిపోర్టు గురించి చదువుకుందాం… అదేమిటంటే…?

Ads

‘‘అరవై కోట్ల మంది స్నానాలు చేసినా సరే ఏమీ కాదు, ఇక్కడ గంగ నీటిలో ఓ విశేషం ఉంది… అది సైంటిఫిక్ నిర్ధారణే… ఈ గంగాజలం తనంతటతానే స్వచ్ఛం అయిపోతుంది… అనగా క్రిమిరహితం అవుతుంది… దానికి కారణం 1100 రకాల సూక్ష్మజీవులు (బ్యాక్టీరియోఫేజ్)…

అవి సహజంగానే నీటిని శుద్ధి చేస్తాయి, ఎలాగంటే, అవి ఆర్ఎన్ఏ కూడా మారుస్తూ తమకన్నా 50 రెంట్లు అధికంగా ఉండే వైరస్, బ్యాక్టీరియాలను హతం చేస్తాయి… తద్వారా పొల్యూషన్ కంట్రోల్ ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది…

హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లలోని ఆర్ఎన్ఏను హైజాక్ చేసి, చివరకు నిర్వీర్యం చేస్తాయి… ఇవి వేగంగా 300 రెట్లు పెరిగిపోతాయి… ఫ్రెండ్లీ బ్యాక్టీరియా జోలికి పోవు…’’ ఇదీ ఆ రిపోర్టు సారాంశం… ఎవరో చెబితే దీనికి ప్రాధాన్యం రాకపోయేదేమో… కానీ చెప్పింది పద్మశ్రీ డాక్టర్ అజయ్ సోంకర్… ఒకప్పుడు ఈయన్ని మాజీ రాష్ట్రపతి కలాం కూడా ప్రశంసించాడు…

సెల్ బయాలజీ, ఆటోఫేజీల మీద విస్తృతంగా వర్క్ చేశాడు… టోక్యో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన నోబెల్ గ్రహీత యోషినోరి ఓసుమితో కలిసి పనిచేశాడు… హార్వర్డ్ స్కూల్‌లో కూడా..! ఈ 1100 రకాల సూక్ష్య జీవులు ఒకరకంగా గంగజలానికి సెక్యూరిటీ గార్డ్స్ అంటాడాయన… ఇది కేవలం గంగాప్రవాహంలో మాత్రమే కనిపించే విశిష్టత అంటాడు…

ఎస్, బాగా చెప్పారు సరే… కానీ చిన్న సందేహం, ప్రశ్న అలాగే మిగిలిపోయాయి మాస్టారూ… అంతటి సెక్యూరిటీ గార్డ్స్‌తో స్వీయ ప్రక్షాళన, స్వీయ శుద్ధీకరణ గంగా ప్రవాహాల్లో సాధ్యమవుతున్నప్పుడు… నమామి గంగే పేరిట వేల కోట్లను కాశిలో ఎందుకు గుమ్మరిస్తున్నట్టు..?! ఆ ఉపయుక్త సూక్ష్మజీవుల్ని మనం ఇతర నదుల్లో ప్రవేశపెట్టలేమా..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions