.
మహా కుంభ మేళా ఫిబ్రవరి 26న మహాశివరాత్రితో ముగుస్తోంది కదా… ఆ ముగింపు మరో ఖగోళ విశేషాన్ని తీసుకొస్తోంది… ఆసక్తికరమే… అరుదైన మరియు ప్రత్యేకమైన ఖగోళ దృగ్విషయం ఇది… సౌర వ్యవస్థలోని ఏడు గ్రహాలూ రాత్రిపూట ఆకాశంలో కనిపిస్తాయి…
వివరాల్లోకి వెళ్తే… సౌర వ్యవస్థలోని ఏడు గ్రహాలు – బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్ మరియు నెప్ట్యూన్ – ఆ రాత్రి సమయంలో కనిపించనున్నాయి.., ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సమావేశానికి ప్రత్యేక ప్రాముఖ్యతను కూడా ఇవ్వనుంది…
Ads
ఈ విశ్వ పరిణామాలు కూడా ఆధ్యాత్మిక శక్తులకు తోడ్పడతాయని కొందరు నమ్ముతున్నారు. జనవరి 2025లో శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్ మరియు నెప్ట్యూన్ కనిపించడంతో ప్రారంభమైన ఈ ఖగోళ దృశ్యం, ఫిబ్రవరిలో బుధుడు కూడా చేరడంతో గ్రాండ్ ఫినాలేకు చేరుకుంటుంది…
ఈ అమరిక ఫిబ్రవరి 28న గరిష్ట స్థాయికి చేరుకుంటుంది… అంటే మహాకుంభమేళా ముగిసిన రెండు రోజులకు…! అప్పుడు ఏడు గ్రహాలు సూర్యుని ఒక వైపున చేరి, అద్భుతమైన గ్రహాల కవాతును సృష్టిస్తాయి…
ఈ ఖగోళ వస్తువులు ఒక నిర్ణీత మార్గంలో గోచరమవుతాయి… ఎందుకంటే వాటి కక్ష్యలు దాదాపు ఒకే సమతలం లోపల ఉంటాయి… ఈ గ్రహాల కవాతు సమయంలో, ఐదు గ్రహాలు – బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి మరియు శని – మన కంటికి నేరుగా కనిపిస్తాయి. కానీ, యురేనస్ మరియు నెప్ట్యూన్ చూడటానికి బైనాక్యులర్స్ లేదా టెలిస్కోప్ అవసరం అవుతుంది…
ఈ ఏడు గ్రహాలు కూడా ఆకాశంలో సమ ఎత్తులో ఉన్నప్పుడు.., సరైన వీక్షణకు సూర్యాస్తమయం తర్వాత లేదా సూర్యోదయానికి ముందు సంధ్యా సమయం మంచిది…
Share this Article