డెస్టినీ… అన్ని శాస్త్రాలూ మనిషిని చివరకు తీసుకెళ్లి అక్కడ వదిలేస్తయ్…. ఇదీ అంతే… నిజానికి మనిషి జీవితంలో ఉన్నంత మెలో డ్రామాను మనం కాల్పనిక సాహిత్యంలో కూడా అంతగా చూడలేం కదా… ఇదీ అంతే… ఎస్, ప్రతి మనిషి జీవితం ప్రిప్రొగ్రామ్డ్ చిప్… దాని ప్రకారమే నడుస్తూ ఉంటుంది… ఇదీ అంతే… విషయం ఏమిటంటే..? ఇది కథ… కథలాంటి వాస్తవం… తాజా వార్తే… చైనాలో జియాంగ్స్ ప్రావిన్స్ ఉంది… అందులో సుజో ఓ ఆవాసం,.. అక్కడ ఓ పెళ్లి వేడుక వాతావరణం… అందరూ ఉత్సాహంగా ఉన్నారు… పెళ్లికొడుకు తల్లి సందడి అయితే చెప్పనక్కర్లేదు… కాబోయే కోడలిని చూస్తూ మురిసిపోతోంది… కానీ చూస్తూ చూస్తూ ఉంటే ఆమెలో ఏదో అసౌకర్యం… ఇదీ చెప్పలేని ఏదో భావన ఆమెను ఉద్విగ్నతకు గురిచేస్తోంది… పెళ్లికూతురి దేహంపైని ఓ పుట్టుమచ్చను చూసేసరికి ఆమెకు ఏదో సందేహం… 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన తన కన్నబిడ్డకు కూడా ఇలాంటి పుట్టుమచ్చే, సరిగ్గా అక్కడే… ఈమె ఎవరు అసలు..?
‘ఈమె నిజంగా మీ బిడ్డేనా’ అని నిలదీసింది పెళ్లికూతురి తల్లిదండ్రులను… తన సందేహం ఏమిటో చెప్పింది… ఇది విన్న పెళ్లికూతురు మొదట నిర్ఘాంతపోయింది… ఇన్నేళ్లు తను తల్లిదండ్రులుగా భావిస్తున్నది తన వాస్తవ తల్లిదండ్రులు కారా..? తనకు కాబోయే అత్తగారు తన వాస్తవ తల్లా..? తనూ నిలదీసింది తల్లిదండ్రులను, నిజం చెప్పాలని..! వాళ్లు నోళ్లు విప్పారు… ‘నిజమే, 20 ఏళ్ల క్రితం రోడ్డు పక్కన ఏడుస్తున్న చిన్నారిని తెచ్చుకుని సొంత బిడ్డలాగే పెంచుకున్నాం… నిజం చెప్పే సందర్భం రాలేదు… ఆమెకు తనకు రక్తం పంచిన అసలు తల్లిదండ్రులు వేరే ఉన్నారనే భావన రావొద్దని భావించి ఈ నిజాన్ని దాచిపెట్టాం’ అని అంగీకరించారు… అంటే తనకు కాబోయే కోడలే తన నెత్తురు పంచుకుని పుట్టిన బిడ్డా..? ఎన్నేళ్లుగా వెతికి, వేసారిన బిడ్డ ఇన్నేళ్లకు అనుకోకుండా తన కళ్ల ముందుకొచ్చిందా అనుకుంటూ ఆనందాశ్రువులతో బిడ్డను హత్తుకుంది…
Ads
బాగుంది… అందరి కళ్లూ చెమర్చాయి… కానీ కొడుక్కి కూతురిని ఇచ్చి ఎలా పెళ్లి చేసేది..? ఇది కదా అసలు సమస్య… బంధుగణమంతా ఇదే ప్రశ్న వేశారు… పెళ్లి పెటాకులేనా..? వేరే సంబంధాలు చూడాల్సిందేనా ఇద్దరికీ..? తప్పదు కదా…. ఇవీ ప్రశ్నలు… వధూవరులిద్దరూ తెల్లమొహాలు వేసుకుని చూస్తున్నారు… ట్విస్టు ఏమిటంటే… ఆ తల్లి చెప్పింది మరో నిజాన్ని… ‘‘నా బిడ్డ కోసం వెతికీ వెతికీ ఇక ఆశలు వదిలేసుకున్నాను… ఓ పిల్లాడిని తెచ్చుకుని పెంచుకుంటున్నాను, ఈ కొడుకు నా సొంత కొడుకు కాదు, పెంచుకున్న కొడుకే…’’ అని వెల్లడించింది… ఈసారి నిర్ఘాంతపోవడం వరుడి వంతైంది… చివరకు ఏమైందీ అంటారా..? సింపుల్… సొల్యూషన్ దొరికేసింది కదా… వాళ్లిద్దరూ సొంత అన్నాచెల్లెళ్లు కాదు… సో, తప్పులేదు… కాకపోతే కాబోయే కోడలేమో తన బిడ్డ అయ్యింది… తన పెంపుడు కొడుకు కాస్తా తనకు అల్లుడయ్యాడు… అంతే… చప్పట్లు మారుమోగిపోయాయి…!!
Share this Article