.
నిన్న పాకిస్థాన్‌తో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ మ్యాచులో కోహ్లీ చేసిన ఓ తప్పు గురించి చెప్పుకోవాలి… అది గనుక నెగెటివ్ రిజల్ట్ చూపించి ఉంటే మ్యాచు చేజారిపోయేది… గవాస్కర్ కూడా అదే తప్పుపట్టాడు…
ఎస్, కోహ్లీ బాగా ఆడాడు… చెత్తా షాట్ల జోలికి పోకుండా, నిలకడగా, సింగిల్స్ తీస్తూ, కొత్త కోహ్లీ కనిపించాడు… సెంచరీ చేసి ఇండియాకు ఓ మంచి విజయాన్ని అందించాడు… నిజమే… కానీ..?
Ads
సరిగ్గా గమనించండి, గుర్తుకుతెచ్చుకొండి… అది 21వ ఓవర్… రవూఫ్ బౌలర్… ఐదో బాల్‌కు కోహ్లీ సింగిల్ తీశాడు… సురక్షితంగా క్రీజు చేరాడు… కానీ ఫీల్డర్ విసిరిన బంతిని చేతిలో అడ్డుకున్నాడు… అది ఓవర్ త్రో గాకుండా… ఆ పని కోహ్లీకి దేనికి..?
నిజానికి లైవ్ బంతిని బ్యాటర్ అడ్డుకుంటే ఔట్ ఇవ్వొచ్చు… సమయానికి మెదళ్లు పనిచేయలేదు పాకిస్థాన్ క్రీడాకారులకు… అందుకే ఎవరూ కనీసం అప్పీల్ కూడా చేయలేదు… కోహ్లీ దురుద్దేశంతోనో, స్టంప్స్ పైకి వస్తుందనో చేత్తో అడ్డుకోలేదు, కానీ టెక్నికల్‌గా రూల్స్ ప్రకారం తప్పు… కోహ్లీని ఔట్‌గా ప్రకటించాల్సిన తప్పు…
అదే జరిగి ఉంటే ఇండియా ఇబ్బందుల్లో పడేది… అదీ ఇక్కడ చెప్పాలనుకుంది… ఇది ఆటతీరుకు సంబంధించింది కాదు, కానీ పాటించాల్సిన కొన్ని పద్ధతులు ఉంటాయి, జాగ్రత్తలూ ఉంటాయి… ఆ బాల్ ఓవర్ త్రో అయి ఉంటే మరో రన్ కూడా వచ్చి ఉండేది… సమయానికి కోహ్లీ మైండ్ కూడా పనిచేయలేదేమో…
ఆ సమయానికి ఎవరూ పాకిస్థానీ క్రికెటర్లు దీన్ని గమనించలేదు… ఏమో, కోహ్లీ అలా అడ్డుకోవడం వల్ల, తాము చేయాల్సిన పనీ కోహ్లీ చేశాడులే అనుకుని, ఒక ఓవర్ త్రో రన్ సేవ్ అయ్యిందని సంబరపడ్డారేమో కూడా..! హహహ…
గవాస్కర్ కోహ్లీ చేసిన తప్పును తన కామెంటరీలో కూడా చెప్పాడు… కానీ మ్యాచ్ పూర్తయ్యాక ఇండియా గెలుపు, కోహ్లీ సెంచరీపై అభినందనల వర్షం కురిసింది… దాంతో ఈ చిన్న తప్పు, సారీ, పెద్ద తప్పే మరుగున పడిపోయింది…
ఇక్కడ కోహ్లీ గురించి మరొకటీ చెప్పుకోవాలి… పాకిస్థానీ బౌలర్ అబ్రార్ మంచిగా ఆడాడు… మన బ్యాటర్లు ఆడటానికి బాగా ఇబ్బంది పడ్డారు… కోహ్లీ అబ్రార్ విసిరే స్పిన్ బాల్స్‌ను వీలైనంతవరకూ సేఫ్‌గా డిఫెన్స్ ఆడుతూ, ఆ బాల్స్‌ను, ఆ బౌలర్‌నూ గౌరవించాడు… ఓ దశలో భుజం తట్టి అభినందించాడు కూడా…
చివరకు అదే కోహ్లీ అదే అబ్రార్‌ను వెక్కిరింపుగా, ఓ హెచ్చరికగా ఓ చూపు చూశాడు… ఎందుకంటే..? గిల్‌ను ఔట్ చేశాక అదే పాకిస్థాన్ బౌలర్ ‘‘చాల్లే, ఇక వెళ్లు’ అన్నట్టుగా మూడుసార్లు తలను ఊపుతూ వెక్కిరించాడు… గిల్ కాబట్టి సైలెంటుగా వెళ్లిపోయాడు, అదే ప్లేసులో కోహ్లీ ఉండి ఉంటే బ్యాట్ ఎత్తి దూకుడుగా వెళ్లేవాడేమో…
కానీ గిల్‌ను వెక్కిరించినప్పుడు సైలెంటుగా తన క్రీజులోనే చూస్తు ఉండిపోయిన కోహ్లీ మ్యాచ్ మొత్తం అయిపోయాక అదే అబ్రార్ వైపు… తెలిసిందా, ఇదీ మేమంటే అన్నట్టుగా ఓ డిఫరెంట్ లుక్కు ఇచ్చాడు..!!
Share this Article