.
ఇప్పుడు మోడీ… కాదు, ఎన్నాళ్లుగానో కేసీయార్‌కు రహస్య స్నేహితుడే…. మధ్యలో ఎక్కడో ఏదో తేడా కొట్టింది… కేసీయార్‌కు కోపమొచ్చింది…
బీజేపీని బజారున పెట్టాలనుకున్నాడు… మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి మోడీషా ప్రయత్నిస్తున్నారని బదనాం చేయడానికి ఓ డ్రామా… ఎవరో పిచ్చి స్వాములను రంగంలోకి దింపి… ఏదో నాటకం రాశాడు…
Ads
రేవంత్ రెడ్డిని వోటుకునోటు కేసులో ఇరికించడం అంత ఈజీ అనుకున్నాడు… మోడీ అంతు చూద్దామని అనుకున్నాడు… దేశం మొత్తమ్మీద పార్టీల నాయకులకు, జడ్జిలకు తలాతోకా లేని సీడీలను, పెన్‌డ్రైవ్‌లను పంపించాడు… సరే, కేసీయార్ క్రెడిబులిటీ తెలిసిందే కదా, అందరూ చెత్తబుట్టల్లోకి పారేశారు…
విమానం పంపించి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్‌ను అరెస్టు చేయాలనీ, రచ్చ చేసి జాతీయ ప్రచారం పొందాలనీ అనుకున్నాడు… సీన్ కట్ చేస్తే, ఫామ్ హౌజులో ఎవడూ పలకరించేవాడు లేని దురవస్థ… బయటకు రాడు, ప్రజాజీవితంలోనే లేడు… తన రాజకీయ నైతికత అది…
పోనీ, మోడికి ఎస్ ఎస్ ఉన్నాయా..? లేవు… మళ్లీ మళ్లీ అదే చంద్రబాబుతో దోస్తీ, అదే కేసీయార్‌తో రహస్య దోస్తీ… రాజకీయాల్లో ప్రమాణాలు, విలువలూ ఉండవు సరే, మరీ ఈ స్థాయిలోనా..? అదే కేసీయార్ అయోధ్య మీద, రామజన్మభూమి మీద బురద వ్యాఖ్యలు చేశాడు… ఐనాసరే, ఆర్ఎస్ఎస్‌కు తనంటేనే ప్రేమ…
ఎందుకు..? కాంగ్రెస్ వ్యతిరేకతతో… పిచ్చి వ్యూహం… సరే, ఇప్పుడు ఎందుకీ ప్రస్తావన అంటే..? రేవంత్ ఏ కేసునూ సీబీఐకి అప్పగించడు… అప్పగిస్తే ఒరిగేది ఏమీ ఉండదని తనకూ తెలుసు… రాష్ట్ర బీజేపీ ఏవో పిచ్చి డిమాండ్లు పెట్టినా తను వినడు… పైగా కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తదితరులు ఏమిటో రేవంత్‌కు బాగా తెలుసు…
ఇప్పుడు మరో కేసు… కేదార్ మరణం… అదీ దుబయ్‌లో… టాలీవుడ్ ప్రముఖులే కాదు, బీఆర్ఎస్ సహా పలు పార్టీల అక్రమార్కులకు స్వర్గధామం దుబయ్… అన్నీ ఆర్గనైజ్ చేస్తున్నది కేదార్… అదేనండీ రాడిసన్ బ్లూ అని ఓ పాత డ్రగ్స్ కేసులో నిందితుడు…హఠాత్తుగా అనుమానాస్పదంగా మరణించాడు… అక్కడ బీఆర్ఎస్ మాజీ, ప్రజెంట్ ఎమ్మెల్యేలు…
ప్రపంచంలో ఏం జరిగినా స్పందించే కేటీయార్ సైలెంట్… ఎందుకు..? అర్థం చేసుకొండి మీరే… అలాగని నాయకులందరూ శుద్ధపూసలని కాదు… కానీ బీజేపీకి సూమోటోగా ఇందులోకి ఎందుకు ఎంటర్ కావాలని అనిపించడం లేదు… రేవంత్ పర్మిషన్ అక్కర్లేదు…
దుబయ్‌లో వేల కోట్ల పెట్టుబడులకు సరిపడా ఆదాయం ఎక్కడి నుంచి వచ్చింది..? సక్రమమా, అక్రమమా..? ఎవరెవరు ఆ బిగ్ ప్లేయర్స్…? పిచ్చి పిచ్చి కేసుల్లోనే ఎంటరయ్యే ఈడీలు, ఆర్ఐలూ, సీబీఐలూ ఈ విషయంలో ఎందుకు సైలెంట్..?
తెలంగాణలో కాలేశ్వరం మీద పిటిషన్ వేస్తే హతం… అంతకుముందు ఓ లాయర్ హతం… దుబయ్‌లో ఓ ప్రపర్టీ బ్రోకర్ హతం… అయ్యా, మోడీజీ, తెలంగాణ భారతదేశంలోనే ఉంది… మరిచిపోయారేమో… కాస్త అమిత్ షాను అడగండి ఓసారి..!! ఇక్కడ రేవంత్ రెడ్డితో ఏమీ కాదు, ఊదు కాలదు, పీరు లేవదు, మీరూ అంతేనా…!!
అవునూ, రేవంత్ రెడ్డి సాబ్… విదేశాలకు పారిపోతే రప్పించాల్సింది కేంద్రమే… ఫోన్ ట్యాపింగు మీద మనకేమీ చేతకాదు నిజమే…. కానీ ఫార్ములా రేసు కేసులో గవర్నర్ పర్మిషన్ ఇచ్చినా కేటీయార్ అరెస్టుకు బయపడి వణుకుతున్నది ఎవరు..?!
Share this Article