.
సమ్మక్క సారలమ్మ జాతర తెలుసుగా… మన కుంభమేళా అంటుంటాం… ఒకప్పుడు గిరిజన జాతర, ఇప్పుడు జనజాతర… అందరూ వెళ్తున్నారు… కోట్ల భక్తజనం…
మహాకుంభమేళాలో త్రివేణీ సంగమం… మేడారంలో జంపన్నవాగు… గతంలో రెండేళ్లకు ఓసారి, ఇప్పుడు మినీ మేడారం అని రెండేళ్ల నడుమ మరొకటీ నిర్వహిస్తున్నారు… రెగ్యులర్ భక్తులు ఇతర రోజుల్లో కూడా వెళ్తున్నారు…
Ads
రెండేళ్లకోసారి జరిగే జాతర అయిపోయాక, భక్తజనం తిరిగిపోయాక… ఆ పరిసరాలు పారిశుద్ధ్య భీకరంగా కనిపిస్తాయి… మానవ వ్యర్థాలు సహా దుకాణదారులు వదిలేసి వెళ్లిన సామగ్రి, సీసాలు గట్రా… నిజానికి జాతర నిర్వహణకన్నా ఆ పరిసరాలను మళ్లీ ఓ కొలిక్కి తీసుకురావడమే పెద్ద పరీక్ష ప్రభుత్వ యంత్రాంగానికి…
ఆ పరిసరాల్లోని కొన్ని గ్రామాల ప్రజలు జాతర అయిపోగానే బంధువుల ఇళ్లకు వెళ్లి, నాలుగైదు రోజులకు మళ్లీ వస్తారు… ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే… ఉత్సవాలు వేరు, ఉత్సవాల అనంతరం పరిస్థితులు వేరు… సరిగ్గా ఓ ఫోటో, ఓ వీడియో, ఓ వార్త చూశాక అనిపించింది ఇదే…
కోటిన్నర, రెండు లేదా మూడు కోట్ల మంది హాజరయ్యే మన జాతర సిట్యుయేషనే ఇలా ఉంటే… 66 కోట్ల మంది భక్తజనం తాకిడితో ప్రయాగరాజ్ ఎలా మారిపోయి ఉంటుంది… యుద్ధం ముగిసిన తరువాత ఓ యుద్ధ క్షేత్రంలా…
మూణ్నాలుగు వేల కోట్లు పెట్టారా..? ఎక్కువ పెట్టారా..? అనేది అప్రస్తుతం… ఆ పెద్ద రాష్ట్రానికి, ఈ దేశం నిర్వహించుకునే ప్రపంచంలోకెల్లా ఓ అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవానికి అది పెద్ద ఖర్చేమీ కాదు… దానివల్ల 2 లక్షల కోట్ల ఆదాయమా, మూడు లక్షల కోట్ల ఆదాయమా అనేదీ ముఖ్యం కాదు…
ఈసారి యోగి ప్రభుత్వం మునుపెరగని భారీ ఏర్పాట్లు చేసిందనేది వాస్తవం… వందల ఎకరాల్లో టెంట్ సిటీ నిర్మించింది… ఒక తొక్కిసలాట ఓ యాక్సిడెంట్… దాన్ని వదిలేస్తే మొత్తం సాఫీగా సాగిపోయినట్టు లెక్క… ఎప్పటికప్పుడు నదీప్రవాహాల క్లీనింగ్, ఆ వీథుల్లో పారిశుద్ధ్యం పెద్ద టాస్క్… సరే, సోకాల్డ్ శుష్క సెక్యులర్ నాయకులు నోళ్లుపారేసుకుని హిందూ మతాన్ని, విశ్వాసాల్ని వెక్కిరించారు… తుచ్ఛ రాజకీయాలు…
https://www.facebook.com/reel/625359753434203
ఇప్పుడు ప్రయాగరాజ్‌ను క్లీన్ చేయడం మొత్తం కుంభమేళా నిర్వహణను మించిన పరీక్ష… యోగీ అక్కడే క్యాంప్ వేశాడు… తన మంత్రులు సైతం… మొదట అక్కడ పారిశుద్ధ్య పనుల్లో ఉన్న కార్మికులకు పదేసి వేల బోనస్ ప్రకటించాడు… నిజానికి ఇంకాస్త ఉదారంగా, ఇంకా ఎక్కువగా ఇచ్చి ఉండాల్సింది… వాళ్లతో కలిసి సహపంక్తి భోజనాలు చేశాడు…
ఇప్పుడు వీథులన్నీ ఖాళీ… ఇన్నిరోజుల జనం తాకిడితో పోలిస్తే ఇప్పుడు నిర్మానుష్య ప్రాంగణాలు… సాధులు, సంతులు, అఖాడాలు, ఆశ్రమాలు ఎట్సెట్రా మూటాముల్లె సర్దుకుని వెళ్లిపోయాయి… ఒక సూచన… త్రివేణీ సంగమానికి పితృకర్మల కోసం ఎప్పుడూ జనం వస్తూనే ఉంటారు… అక్కడ దోపిడీని అరికట్టే విషయంలో యోగీ ప్రభుత్వం దృష్టి సారించాలి…
అలాగే మహాకుంభమేళాకు వెళ్లిన ప్రతి ఒక్కరూ వీలును బట్టి, ఖర్చును బట్టి ఉజ్జయిని, కాశీ, అయోధ్యలను కూడా సందర్శించారు… కనీసం కాశీ, అయోధ్య, త్రివేణీ సపరేట్‌గా ఓ స్పిరిట్యుయల్ టూరిజం కారిడార్ డెవలప్ చేస్తే భక్తులకు ప్రయోజనకరం… అలాగే చార్ ధామ్ యాత్ర కూడా విడిగా..!!
Share this Article