.
అంటే అన్నామంటారు గానీ… ఎప్పుడూ కొనేవాడు అమ్మేవాడికి లోకువే… అన్నింటికీ మించి వాడు చేసే వాణిజ్య ప్రచారాలకు అలుసే… ప్రత్యేకించి బ్రాండెడ్… ఆ ప్రకటనలు పెద్ద బ్యాండ్…
వాడికి ఇష్టమొచ్చినట్టు చెప్పుకుంటాడు… అడిగేవాడు ఉండడు కదా… ఐనా, గుట్కా ప్రకటనలు వద్దురా అంటే పాన్ మసాలా అని బ్రాండ్ ప్రమోషన్స్, అదీ మహేశ్ బాబు రేంజులో… మద్యం ప్రకటనలు నిషిద్దంరా అంటే మినరల్ వాటర్, సోడా పేరిట బ్రాండ్ ప్రమోషన్స్… వీటినే సరోగేట్ యాడ్స్ అంటారు…
Ads
మెడిసిన్స్, డాక్టర్స్, హాస్పిటల్స్ యాడ్స్ ఇవ్వొద్దు అంటే ఎవడు విన్నాడు..? పట్టణాల్లో, నగరాల్లో కార్పొరేట్ హాస్పిటల్స్ పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టడం లేదా…? ఈ సోది ఇప్పుడెందుకూ అంటే… ఓ విచిత్రమైన యాడ్ కనిపించింది ఫేస్‌బుక్‌లో… ఇదే అది…
లెట్స్‌షేవ్… బ్రాండ్ పేరే అది… గడ్డం గీక్కునే రేజర్… వాడెందుకు తెగించాడూ అంటే… ఆరు బ్లేడ్స్ ఉంటాయట, ఒక్కసారి గీకితే ఆరుసార్లు గీకినట్టు అంటాడు, సరే, అక్కడికి వోకే…
కానీ దీంతో గీక్కుంటే ఆలో వీరా, విటమన్ ఈ, మాయిశ్చరైజేషన్ కూడా అయిపోతుందట… ఎలా…? చివరకు ఆఫ్టర్ షేవ్ లోషన్ అమ్మకందారులు కూడా ఇలాంటివి చెప్పడం లేదు… జస్ట్, యాంటీసెప్టిక్, విత్ సెంట్ అని చెప్పుకుంటారు…
అసలు ప్రజెంట్ ట్రెండే గడ్డం గీక్కోకపోవడం, లేదా జస్ట్, ట్రిమ్ చేసుకోవడం… ఎంతగా బవిరిగడ్డాలు పెంచితే అంత ట్రెండ్ ఇప్పుడు… మరోవైపు మా బ్లేడ్‌తో గీక్కొండిరా, క్లీన్ షేవ్ విత్ మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ అంటాడు వీడు… (గుండు కూడా గీక్కోవచ్చట ఈజీగా…)
అన్నట్టు దీని ధర ఎంతో తెలుసా..? రెండు పీసులకు 399 రూపాయలు అట… అంటే రెండొందలు… అన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లోనూ దొరుకుతుంది… మార్కెట్‌లో సింపుల్ వన్‌టైమ్ యూజ్ అండ్ థ్రో రేజర్లు 5, 10 రూపాయలకు దొరుకుతాయి…
అంతెందుకు..? గిలెట్ వాడి 7 ‘o క్లాక్ బ్లేడ్ ధర రెండు రూపాయలు… పాతకాలం షేవింగ్ సెట్‌లో పెట్టి వాడితే, ఏ ఆరు రేజర్ల బ్రాండెడూ పనికిరాదు… ఇంకా తక్కువకు దొరికేవీ ఉన్నాయి… బార్బర్ షాపులో వాళ్ల కత్తిలో సగం బ్లేడ్ పెట్టి నీట్‌గా పనికానిచ్చేస్తారు…
గిలెట్ మ్యాక్3 అని మరో బ్రాండెడ్ బ్యాండ్… రెండు పీసులకు 349 రూపాయలు, అంటే ఒక్కొక్కటీ 175… నీ స్పెషాలిటీ ఏమిట్రా అనడిగితే మాది చార్‌కోల్ ప్రొడక్ట్ అంటాడు… గీకేకొద్దీ బొగ్గు పొడి ఇంజెక్ట్ అవుతుందా..? ఏమీ లేదు… ఇప్పుడు బొగ్గు, ఉప్పు, వేప అని కోల్గేట్ వాడు కథలు పడుతున్నాడు కదా, ఇండియన్స్ ఇట్టే ఆ ఆయుర్వేద, పురాతన ఉపయోగ దంతధావన పదాలకు ఇంప్రెస్ అవుతారని… ఈ గిలెట్ వాడిదీ అదే కథ…
Share this Article