.
పార్థసారథి పొట్లూరి….. అమెరికా చవకబారు రాజకీయం! అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ JD వాన్స్ ఉక్రెయిన్ లో ఉన్న ఖనిజాల మీద అమెరికాకి హక్కు ఇస్తూ ఒప్పందం చేసుకోవాలని డిమాండ్ చేశాడు!
జెలెన్స్కీ ససేమిరా అంటూ ట్రంప్ మీద తీవ్రంగా విమర్శలు చేశాడు!
బహుశా బ్రిటన్, ఫ్రాన్స్ లు తనకి మద్దతు ఇస్తున్నాయి అనే ధీమా తోనే ట్రంప్ మీద విమర్శలు చేసి ఉండవచ్చు! కానీ జెలెన్స్కీ కి జియో పాలిటిక్స్ మీద పూర్తిగా అవగాహన లేకపోయిఉండవచ్చు! లేదా వెనక ఉండి డెమోక్రాట్ పార్టీ జెలెన్ స్కీ చేత ట్రంప్ మీద విమర్శలు చేసి ఉండవచ్చు!
గత అమెరికా అధ్యక్ష ఎన్నికలలో జెలెన్స్కీ డెమోక్రాట్ల తరుపున ప్రచారం చేశాడు!
కానీ వైస్ ప్రెసిడెంట్ JD వాన్స్ యూరోపుకి వెళ్లి మరీ డిమాండ్ చేయడం దేనికి? అదేదో వైట్ హౌస్ కి పిలిచి అడిగితే బాగుండేది కదా?
Ads
రష్యాతో సంధి చేసుకునే నెపంతో చర్చలకి రమ్మని జెలెన్ స్కీ ని పిలిచి, సంధి విషయం పక్కనపెట్టి ఉక్రెయిన్ లో ఖనిజ సంపద మీద హక్కులు ఇస్తూ సంతకం పెట్టమని ఒత్తిడి చేయడం ఎందుకు?
జెలెన్ స్కీ చాలా ఖచ్చితంగా చెప్పేశాడు ఒప్పందం మీద సంతకం చేయనని!
చవకబారు రాజకీయం అని ఎందుకు అనాల్సి వచ్చింది అంటే అమెరికా అధ్యక్షుడు మరియు యుద్ధంలో పూర్తిగా నాశనం అయిపోయిన ఉక్రెయిన్ అధ్యక్షుడు మధ్య జరుగుతున్న చర్చలని LIVE బ్రాడ్కాస్ట్ చేయడం మీదనే!
అదేదో మూడవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నట్లు, దానిని ఆపడానికి ప్రపంచ దేశాల అధినేతలు ట్రంప్ తో సమావేశం అయ్యి చర్చలు జరుపుతున్నప్పుడు అన్ని దేశాల ప్రజలు వాస్తవం ఏమిటో తెలుసుకోవడానికి live broadcast చేశారు అంటే అర్ధం ఉంది.
పోనీ live లో ట్రంప్, జెలెన్స్కీ లు సామరస్యంగా మాట్లాడుకున్నారా అంటే అదీ లేదు!
తటస్థంగా ఉంటూ నిజాలు మాట్లాడాలి!
ట్రంప్ జెలెన్స్కీ ని యూజ్ లెస్ ఫెలో అనడం, ఒక అమెరికా అధ్యక్షుడు ఇంకో దేశ అధ్యక్షుడిని ఉద్దేశిస్తూ అనడం హుందాగా లేదు!
నువ్వు మూడో ప్రపంచ యుద్ధం వైపు తీసుకెళ్ళాలి అనుకుంటున్నావా అంటూ జెలెన్స్కీ ని అనడం పరిపక్వత లేని మాటలు అనిపిస్తుంది! అసలు అమెరికా జోక్యం లేకపోతే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా?
రెండో ప్రపంచ యుద్ధం ఒక పచ్చి నిజం ఏమిటంటే… జపాన్ పెరల్ హార్బర్ మీద దాడి చేసి అమెరికన్ నావీని ధ్వంసం చేయడం వల్లనే అమెరికా రెండో ప్రపంచ యుద్ధంలో జోక్యం చేసుకొని ప్రతీకారంగా జపాన్ లోని హీరోషిమా, నాగసాకిల మీద అణు బాంబులు వేసింది అనే కదా ఇన్నాళ్ళు చదివింది?
అసలు నిజం ఏమిటంటే పెరల్ హార్బర్ లో సముద్రం అడుగున మునిగిపోయి ఉన్న నౌకలని పరిశీలిస్తే అవి జపాన్ కామీకాజ్ (ఆత్మహుతి ) విమానాల దాడి వల్ల మునిగిపోలేదని తేలింది! నిజానికి జపాన్ కామీకాజ్ విమానాలు చాలా చిన్నవి. ఇంధనం బరువుతో పాటు కొద్దిపాటి పేలుడు శక్తి కలిగిన బాంబులు అంత పెద్ద అమెరికన్ యుద్ధ నౌకలని మునిగిపోయేట్లుగా చేయలేవు!
కాబట్టి అమెరికా జోక్యం లేకుండా మూడో ప్రపంచ యుద్ధం రాదు! అంటే జెలెన్ స్కీ ఎగదోస్తే మూడో యుద్ధం వస్తుందా? ట్రంప్ మాటలు పరిపక్వత లేనివి అని అనాల్సి వస్తున్నది!
ట్రంప్ జెలెన్స్కీ ని ఉద్దేశిస్తూ నువు ఉక్రెయిన్ ప్రజలు ఎన్నుకున్న అధ్యక్షుడివి కావు అన్నాడు! భేష్! ఇరాక్ లో ఇదే అమెరికా సద్దాం హుసేన్ ని ఉరితీసి తోలుబొమ్మ అధ్యక్షుడిగా ఒక అనామాకుడిని నిలబెట్టింది దేనికి?
ఇదే అమెరికా కాదా లిబియా అధ్యక్షుడు మొహమ్మద్ గడాఫీని చంపించి తిరుబాటుదారులకి అధికారం ఇచ్చింది? ఇరాక్, లిబియా దేశాలు 15 ఏళ్లుగా ఎందుకు అభివృద్ధికి నోచుకోక అంతర్యుద్ధలతో కొట్టుకుంటున్నాయి!
జెలెన్స్ కీని ఇదే అమెరికా కాదా ఉక్రెయిన్ అధ్యక్షుడిని చేసింది, అదీ ఎలాంటి ఎన్నికలు జరుపకుండా ? జెలెన్ స్కీ ఒక కమెడీయన్ అన్నది నిజం! మరి ఏం ఆశించి అధ్యక్షుడిని చేశారు?
ఇక్కడ అమెరికా అనేదే ముఖ్యం, అంతేకాని డెమోక్రాట్ జో బిడెన్, రిపబ్లికన్ ట్రంప్ లు ముఖ్యం కాదు. ఇద్దరూ అమెరికాకి ప్రాతినిధ్యం వహించారు, వహిస్తున్నారు!
ట్రంప్ కానీ, వైస్ ప్రెసిడెంట్ JD వాన్స్ కానీ హుందాగా ప్రవర్తించలేదు అన్నది స్పష్టంగా కనిపించింది!
ట్రంప్ వ్యాఖ్యలు ఎలా ఉన్నాయి అంటే… జెలెన్స్కీ ప్రజల చేత ఎన్నుకోబడ్డ అధ్యక్షుడు కాదు అన్నప్పుడు మరి ఏ హోదాలో చర్చల కోసం పిలిచారు? ఏ హోదా చూసి ఖనిజ సంపద మీద అమెరికా కీ హక్కులు ఇస్తున్నట్లు సంతకం చేయమని అడుగుతున్నారు? ఈ సంఘటన అన్ని దేశాల వారికి ఒక గుణపాఠం!
Share this Article