.
ఈటీవీ ప్రోమో ఒకటి కొత్తగా కనిపించింది… శ్రీదేవి డ్రామా కంపెనీ రాబోయే ఎపిసోడ్… వుమెన్ డే స్పెషల్ అట… అందులో డొక్కా సీతమ్మకు సంబంధించిన బిట్ ఉన్నట్టుంది… బాగుంది, మంచి ఎంపిక… ఆకాశ్ పూరి గెస్టు… పర్లేదు, ఈజ్ ఉంది, కానీ ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నాడో మరి…
కానీ విశేషంగా కనిపించింది ఏమిటంటే… యాంకర్ రవి… తను స్వతహాగా మంచి ఎనర్జీ, స్పాంటేనిటీ ఉన్న యాంకరుడే… కానీ మిగతా వాళ్లలాగే పికప్ కాలేకపోతున్నాడు ఎందుకో… యాటిట్యూడ్ ప్రాబ్లమా..? ఈ ఎపిసోడ్‌లో ఎంట్రీ ఇస్తూ…
Ads
‘‘అప్పుడప్పుడూ రావడం లేటవుతుందేమో గానీ, రావడం పక్కా’’ అంటున్నాడు… ఎపిసోడ్ మొత్తం రష్మి, తను కలిసే హోస్ట్ చేశారు… అప్పుడప్పుడూ వస్తుంటాను అని చెబుతున్నాడా..? ఇక వచ్చేసినట్టే అని చెబుతున్నాడా..? అంటే… ఈ డ్రామా కంపెనీలో రష్మి హోస్టింగుకు ఎసరు పెట్టడం లేదు కదా కొంపదీసి..?
అఫ్‌కోర్స్, రష్మికి ఇలాంటి ఉపద్రవాలు కొత్తేమీ కాదు… అప్పట్లో అనసూయ వచ్చి ఎసరు పెట్టబోయింది… కానీ సినిమా అవకాశాలు వచ్చి మొత్తానికే ఈటీవీ నుంచి జంప్ అయిపోయింది… ప్రస్తుతం రష్మి ఈటీవీ ఆస్థాన హోస్ట్… జబర్దస్త్ రెండు షోలు ప్లస్ శ్రీదేవి డ్రామా కంపెనీ…. దాదాపు పదేళ్లుగా జబర్దస్త్ షోకు…
ఈటీవీకి, మల్లెమాలకు ఏం కావాలో తనకు తెలుసు..? తెలుగు సరిగ్గా రాకపోయినా సరే, భలే నడిపించేస్తోంది ఇన్నేళ్లుగా… అఫ్‌కోర్స్, తన హోస్టింగ్ బాగానే ఉంటుంది… అందుకే పాతుకుపోయింది అక్కడ… సినిమా అవకాశాలు వచ్చీపోతూ ఉన్నా… ఈటీవీయే తిండిపెడుతోంది…
సరే, రవితో జాయింట్ హోస్టింగ్ అనేది పక్కన పెడితే… సుమ అడ్డా మరీ రోజురోజుకూ ఎటు పోతున్నదో ఆమెకే తెలియాలి… తాజా ప్రోమో చూస్తే ఆ ఆరుగురిలో ఎవ్వరూ తెలియదు… ఢీలో ఒకామె కప్పు గెలిచిందట… కానీ అసలు ఢీ చూసేవారెవ్వరు..? రాను రాను మరీ దయనీయంగా మారుతోంది ఆ షో…
ఆహాలో మాస్టర్ చెఫ్ హోస్టింగ్ స్టార్ట్ చేసినట్టుంది… అదే మొనాటనీ… చూసీ చూసీ సుమ ఫఱ్‌ఫామెన్సు బోర్ కొట్టేస్తోంది… కంటెస్టెంట్లుగా బిగ్‌బాస్ బాపతు కేరక్టర్లను ఎక్కువగా తీసుకున్నట్టున్నారు… మామూలుగానే మన ఇండియన్ టీవీల్లో వంటల కార్యక్రమాలు ఎప్పుడూ పెద్దగా క్లిక్ కాలేదు… యూట్యూబ్ వీడియోలు మాత్రం సూపర్ హిట్… దాన్నలా వదిలేస్తే…
సుడిగాలి సుధీర్ హోస్ట్ చేసే ఫ్యామిలీ స్టార్స్ ఈసారి (అంటే రాబోయేది) ఎపిసోడ్ కాస్త బాగున్నట్టు కనిపిస్తోంది… ప్రతి ఎపిసోడ్‌లో కొంత ఎమోషన్ దట్టిస్తున్నారు… (గతంలో శ్రీదేవి డ్రామా కంపెనీలో అలా చూసేవాళ్లు… అది ఇతర పిచ్చి షోల్లా మారిపోయింది…) ఫ్యామిలీ స్టార్స్ షోకు మాత్రం సుధీరే అసెట్… ప్లస్ కాస్త డిఫరెంట్ కంటెంట్..!
Share this Article