Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

16 ఏళ్ల సహజీవనం తరువాత అత్యాచారం కేసు, సుప్రీం సీరియస్..,

March 6, 2025 by M S R

.

Supreme Court: ఇకపై అలాంటివి చెల్లవు.. రిలేషన్‌షిప్‌- అత్యాచార కేసులపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు!

సుదీర్ఘ కాలం పాటు ఓ వ్యక్తితో సహజీవనం చేసి ఆ తర్వాత తనను పెళ్లి పేరుతో మోసం చేసి శారీరక సంబంధం పెట్టుకున్నాడంటూ మహిళలు పెట్టే అత్యాచారం కేసులు చెల్లవంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

Ads

అలాంటి సందర్భాలలో పెళ్లి చేసుకుంటాననే హామీతో మాత్రమే వారి మధ్య శారీరక సంబంధం ఏర్పడిందని కచ్చితంగా నిర్ధారించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. లివ్-ఇన్ పార్టనర్ అత్యాచారం చేశాడని ఆరోపించబడిన బ్యాంకు అధికారిపై క్రిమినల్ చర్యలను రద్దు చేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

వివాహం చేసుకుంటానని చెప్పడంతోనే అతనితో 16 సంవత్సరాలుగా శారీరక సంబంధం పెట్టుకున్నానని ఆరోపించిన మహిళా లెక్చరర్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది.

ఇద్దరు వ్యక్తులు బాగా చదువుకున్నారని, ఇష్టపూర్వకంగా ఏకాభిప్రాయ సంబంధాన్ని కొనసాగించారని, వేర్వేరు పట్టణాల్లో నివసిస్తున్నప్పటికీ తరచుగా ఒకరి ఇళ్లను ఒకరు సందర్శించేవారని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసు లవ్‌ ఫెయిల్యూర్‌ లేదా లివింగ్- ఇన్ బ్రేకప్‌గా కోర్టు పరిగణించింది.

16 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు సన్నిహిత సంబంధం కొనసాగినందున, వారి మధ్య 16 సంవత్సరాల పాటు లైంగిక సంబంధాలు నిరంతరాయంగా కొనసాగాయి, వారి బంధంలో నిందితుడు ఎప్పుడూ బలవంతం లేదా పెళ్లి పేరుతో మోసం చేశాడని అనుకోలేం.

ఎందుకంటే దాదాపు 16 ఏళ్లుగా వాళ్లు కలిసే ఉన్నారు. ఇన్నేళ్లపాటు అతను కేవలం పెళ్లి చేసుకుంటాననే మాట చెబుతూ ఆమెను లైంగికంగా వాడుకున్నాడని కచ్చితంగా చెప్పలేం. ఇద్దరి పరస్పద అంగీకారంతోనే వారి మధ్య శారీరక సంబంధం ఏర్పడి ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

పెళ్లి పేరుతో మోసం చేశాడని భావించినప్పటికీ, కేవలం పెళ్లి చేసుకుంటాడనే నమ్మకంతోనే ఇన్నేళ్లు ఆమె, అతనితో శారీరక సంబంధం పెట్టుకుందని భావించడం సరికాదని కోర్టు పేర్కొంది. బంధం ఎక్కువ కాలం కొనసాగినప్పుడు అటువంటి వాదనలు విశ్వసనీయతను కోల్పోతాయని కోర్టు వెల్లడించింది…….

…. ఇదీ వార్త, చదివారు కదా… ఎన్నో ఏళ్లు కలిసి కాపురం చేస్తారు, కలిసే ఉంటారు… పెళ్లీ గిళ్లీ జాన్తా నై అనుకుంటారు… తీరా ఎన్నేళ్లకో, ఎక్కడో తేడా కొట్టేసరికి ఇదుగో పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారం చేశాడంటూ ఇలా అత్యాచారం కేసులు పెడతారు, ఇలాంటి సందర్భాల్లో పోలీసులు కూడా గుడ్డిగా కేసులు పెట్టేసి, కోర్టుల్లోకి వదిలేస్తున్నారు…

ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి… అసలు అత్యాచారం, లైంగికదాడిని సుప్రీంకోర్టు మరోసారి నిర్వచిస్తేనే మగవాళ్లకు రక్షణ… ఈ చట్టం దుర్వినియోగం గాకపోవడమే మహిళలకూ మంచిది…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అంతటి చిరంజీవే మరణిస్తే… తెలుగు ప్రేక్షకులు మెచ్చుతారా..?
  • కామాఖ్యలో కనిపించిన ఓ విశిష్టమైన తంతు… నొప్పి మార్పిడి…
  • స్టార్ల చిన్ననాటి ముచ్చట్లు… జగపతిబాబు టాక్ షో ఆసక్తికరం…
  • సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన కరెక్ట్… మన స్కూలింగ్ విధానం మారాలి…
  • వాము మంచిదే కానీ జాగ్రత్త, రెచ్చిపోకండి… మసాలా దినుసుల్లో మహారాణి…
  • సీతారామశాస్త్రి రాసిన చరణాల్ని కూడా… బేసబబు అని బాలు మార్చేశాడు..!!
  • *నువ్వు లేకపోతే ఈ లోకం ఏమీ ఆగిపోదు… పిచ్చి భ్రమల్లో బతకొద్దు…*
  • జపాన్ దేశం ఉనికికే ముప్పు..? ఆమె జోస్యంతో భారీ భయ ప్రకంపనలు..!!
  • చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కనిపించుట లేదు… విధుల్లో లేడు, దింపేశారా..?
  • తెలంగాణ సీఎం ఎవరు..? అసలు ఈ మీనాక్షి నటరాజన్ ఎవరు..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions