.
ఆ పెళ్లి వివరాలు, వధువు సమాచారం కోసం నెట్‌లో భారీ సెర్చింగ్, గూగుల్ ట్రెండింగ్… ఆ పెళ్లి ఎవరిదో తెలుసు కదా…
బీజేవైఎం ఫైర్ బ్రాండ్ తేజస్వి, చెన్న కళాకారిణి శివశ్రీ స్కంధప్రసాద్‌ల పెళ్లి అది… ఎక్కడో చెన్నైకి, ఎక్కడో బెంగుళూరుకు నడుమ బంధం కుదిరింది… ఇద్దరూ పూర్తి డిఫరెంటు రంగాలు…
Ads
బీజేపీ నేతలు, మరీ దగ్గర మిత్రులు, బంధువుల సమక్షంలో పెళ్లి జరిగింది, ఇక రిసెప్షన్ ఏర్పాటు చేశారు… ఈరోజు ఉదయం 11 గంటల నుంచి… ఈ సందర్భంగా తేజస్వి ఓ వీడియో రిలీజ్ చేశాడు… బాగుంది…
‘‘ఈ ఆదివారం మా పెళ్లి విందు, మీ రాక మాకు ఆనందం… మీ ఆశీస్సులు మాకు బలం… ఈ వేడుక మాకు మరింత ఆనందదాయకం కావాలంటే దయచేసి ఓ పనిచేయండి… పూల బొకేలు, డ్రైఫ్రూట్స్ గిఫ్టులు తీసుకురాకండి, ఇది మా అభ్యర్థన..’’
ఎవరైనా అవి తేవాలని ఆహ్వానిస్తారు, మరేమిటి ఈయన ఇలా అంటున్నాడు అంటారా…? దానికి వివరణ కూడా తనే ఇచ్చాడు… ‘‘దేశంలో ఏటా కోటి పెళ్లిళ్లు జరుగుతున్నాయి… 85 శాతం బొకేలు, డ్రైఫ్రూట్స్ జస్ట్ 24 గంటల్లో నిరుపయోగం అయిపోతాయి… ఆ వివాహ వేదికల వద్దే వదిలివేయబడతాయి… ఒక లెక్క ప్రకారం వాటి విలువ 315 కోట్లు…
అందుకే వాటిని తీసుకురావద్దని కోరుతున్నాను, మీరు రండి, ఆశీర్వదించండి, క్షేమంగా తిరిగి వెళ్లండి… దివ్యాంగులు, ముసలివాళ్ల కోసం సపరేట్ ఏర్పాట్లు చేస్తున్నాను…’’ ఇదీ తన వివరణ…
బాగుంది… దానికన్నా ఉదయం 11 గంటల నుంచే రిసెప్షన్ అనేది నచ్చింది… ఎందుకంటే, ఎవడు మొదలుపెట్టాడో గానీ పెళ్లి రిసెప్షన్ అంటే ఖచ్చితంగా రాత్రిపూట జరపాల్సిన కార్యక్రమం అన్నట్టుగా మార్చేశారు… వోకే, రంగులు, లైట్లతో తళతళ, కళకళ సరే…
కానీ వచ్చి తిరిగి వెళ్లేవారికి ఎన్ని అవస్థలు… దూరప్రాంతాలకు వచ్చేవాళ్లకు మరీ… వసతి కష్టం, రాత్రి ప్రయాణాలు కష్టం… వ్యయం, ప్రయాస… పైగా రిసెప్షన్‌లో డీజేలు, డాన్సులు ఎట్సెట్రా… ఇక వెట్ పార్టీ గనుక ఉంటే ఆ లెక్క వేరు…
చాలామంది తెల్లవారుజాము ముహూర్తాలు పెట్టించుకుంటున్నారు… అసలు ఇప్పుడన్నీ అభిజిత్ సర్దుబాటు లగ్నాలే కదా… పెళ్లికి ముందే పెళ్లి విందు… సరిగ్గా వివాహవేళకు మరీ ముఖ్యమైన బంధువులు తప్ప హాలులో ఇంకెవరూ ఉండరు… ఐనాసరే, చాలామంది ఈ పెళ్లిళ్లనే ప్రిఫర్ చేస్తున్నారు ఈమధ్య…
ఒకేసారి పెళ్లి విందు ప్లస్ రిసెప్షన్… కొంతమంది ఎంగేజ్‌మెంట్ జోలికి పోవడం లేదు… పెళ్లిలో కలిపేస్తున్నారు… ఎంత వ్యయం, ఎంత ప్రయాస తప్పుతుందో కదా… ఎస్, హిందూ వివాహ పద్ధతుల్లో మార్పులు అవసరమే… ఒకరినిచూసి మరొకరు గ్రాండ్ వాతలు పెట్టుకోవాల్సిన పనిలేదు…
మరీ నార్తరన్ మోజుతో, ఎవడో మెచ్చాలనే తాపత్రయంతో, ఫాల్స్ ప్రిస్టేజీ కోసం సంగీత్, మెహందీ, హల్దీ ఎట్సెట్రా వ్యయ పోకడలకు వెళ్లేవారిని నిరుత్సాహపరచాల్సిన అవసరం ఉంది… తప్పక ఉంది…!! పెళ్లి భోజనాల వృథాల గురించి మరోసారి చెప్పుకుందాం…
Share this Article