.
జనసేన పార్టీ అర్జెంటుగా పత్రికల్లో పెద్ద పెద్ద యాడ్స్ ఇచ్చి… ఏయే నియోజకవర్గంలో ప్రభుత్వ అధికారులు ఎవరి మాట వినాలో, ఎవరు ఫోన్ చేస్తే వెంటనే రెస్సాండ్ అయిపోయి, జీహుజూర్ అని సాగిలబడి పనులు చేయాలో క్లారిటీ ఇస్తే బెటర్…
పాపం, ప్రభుత్వ ఉద్యోగులలకు ఏం తెలుసు..? పైగా హీరో ఫ్యాన్స్‌కూ, పార్టీ కార్యకర్తలకూ నడుమ విభజన రేఖ లేకుండా పోయింది… పైగా అధికారంలోకి వచ్చింది… ఉరికేంత మైదానం, చూపించుకునేంత అధికారం… అసలే ఆ ఫ్యాన్స్ ధోరణుల మీద జనానికి ఓ ఐడియా ఉంది కదా…
Ads
ఇలాంటి ఫ్యాన్లను వెనకేసుకొచ్చే నాగబాబు ఎమ్మెల్సీ కాబోతున్నాడు… కేబినెట్‌లోకీ వస్తాడు… అప్పుడిక ఈ పెత్తనాలు, పెడధోరణులకు మరింత ప్రోత్సాహం అని జనం భయం… అసలు వార్త వివరాల్లోకి వెళ్తే… ఇదుగో ఈ క్లిప్ చదవండి…
ఎక్కడో యాక్సిడెంట్ జరిగింది, ఎవరికో గాయాలు… ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు… ఓ మహిళ డాక్టర్ సిన్సియర్‌గా తన డ్యూటీ తాను చేస్తోంది… ఈలోపు ఓ మంద వచ్చింది… మా లీడర్‌తో మాట్లాడు అని ఫోన్ ఇచ్చారు… ఈ కొత్త పెత్తందార్లు ఎవరో, వారి పేర్లేమిటో పాపం ఆమెకు ఏం తెలుసు…? ఎవరో తెలియదు, నా డ్యూటీ నన్ను చేసుకోనివ్వండి అందామె…
కోపం సర్రుమంది… జిల్లా పార్టీ అధ్యక్షుడట, సదరు ప్రత్తిపాడు ఇన్‌చార్జి అట… వచ్చారు, సదరు తమ్మయ్యబాబు అనబడే ఇన్‌చార్జి ‘నేనెవరో తెలియదా… గాడిదలు కాస్తున్నారా..? నువ్వు డాక్టర్‌వా, జీతాలు తీసుకోవడం లేదా’ అని మొదలెట్టాడు… తను ఏం తప్పు చేసిందో తెలియక ఆ డాక్టరమ్మ తెల్లమొహం వేసింది పాపం…
ఎవరో వీడియో తీస్తుంటే లాక్కుని కార్యకర్తలు కమ్ ఫ్యాన్స్ అందులో వీడియోలు డిలిట్ చేసి, 2700 రూపాయలు కూడా ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారని సాక్షి కథనం… కూటమి ధర్మం ప్రకారం ఆంధ్రజ్యోతి, ఈనాడు పాపం ఏదో వార్తను డైల్యూట్ చేయడానికి, అండర్ ప్లే చేయడానికి బాగానే ప్రయత్నించాయి…
కానీ సాక్షి కథనంలో వివరణ కాస్త గందరగోళంగా ఉంది… బాధితుల వివరాలు తెలియకుండా, వాళ్లను ఎవరు తీసుకొచ్చారో తెలుసుకోకుండా వైద్యం చేస్తావా అని జనసేన సోకాల్డ్ లీడర్లు దబాయించినట్టు, తిట్టినట్టు రాసుకొచ్చింది సాక్షి…
ఏ డాక్టరైనా సరే, బాధితులను ఎవరు చేర్పించారు అనే వివరాలు కనుక్కుని వైద్యం చేస్తారా..? ఎవరు తీసుకొస్తే ఏం..? ముందు వైద్యం చేస్తారు… చేయాలి… ఈ కనీస సోయి కూడా లేకుండాపోయిందా సదరు లీడర్లకు..?
సరే, ఇలాంటివి ఇంకా పెరుగుతాయి… జనసేనకు, బీజేపీకి పోయిందేముందిలే గానీ టీడీపీకి కూడా అప్రతిష్టే… నిజానికి పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కాదు, మళ్లీ పార్టీలోకి రాకుండా రిమూవ్ చేయాలి… అలా చేస్తేనే ఇంకెవడూ ఇలా మహిళల పట్ల, అదీ ప్రభుత్వ ఉద్యోగుల పట్ల వ్యవహరించరు… ఆ భయం అవసరం…
చంద్రబాబు ఎవరినీ ఏమీ అనలేడు పాపం… పోనీ, నియోజకవర్గాల వారీ ప్రోటోకాల్ లీడర్ల జాబితాలపై ప్రత్యేకంగా సర్క్యులర్లను జారీ చేస్తే బెటరేమో…!! (ఇదంతా చదివేసి టీడీపీ, వైసీపీ కేడర్ శుద్దపూసలు అని భ్రమపడకండి… ఇప్పుడు చెప్పుకున్నది కొత్త భూతాల గురించి… ఆ రెండు పార్టీలేమో అందరికీ తెలిసిన పాత భూతాలు కదా… పైగా ఏపీ కదా…)
Share this Article