.
టీవీ షోలు అంటేనే కృత్రిమత్వం కనిపిస్తున్న రోజులివి… ప్రత్యేకించి మ్యూజిక్ షోలు… పాటల ఎంపిక, వాటికి తగినట్టు డ్రెస్సులు, ఈమధ్య మరీ గాయకులు పాడుతుంటే చుట్టూ తిరుగుతూ గ్రూపు డాన్సర్లు… అంతేనా..? ఏదైనా భక్తి పాట అయితే కన్సర్న్‌డ్ దేవుడి బొమ్మకు అక్కడే హారతులు, పొర్లుదండాలు…
నానా వింత ధోరణులు వచ్చాయి… పోల్స్, వోట్ల ఖర్చులు, సిఫారసులు, విజేతల ఎంపికలో రాగద్వేషాలు, తప్పులు, ప్రలోభాలు వేరే కథ… చివరకు ఈ షోలను మరీ శ్రీదేవి డ్రామా కంపెనీ షోలాగా మార్చారు…
Ads
జీసరిగమప అయితే మరీ నాసిరకం… ఉత్త సగటు టీవీ రియాలిటీ షో బాపతు ఓ పర్‌ఫామెన్స్… హిందీ ఇండియన్ ఐడల్ దగ్గర నుంచి ప్రతి టీవీ మ్యూజిక్ షోలలో కావాలని నాటకీయత కోసం సీన్లు క్రియేట్ చేస్తుంటారు కూడా… రేటింగుల తాపత్రయం…
కొన్నిసార్లు అరుదుగా సహజమైన ఎమోషన్లు ఆవిష్కృతమవుతయ్… అవి ప్రేక్షకులను కదిలిస్తయ్… అలాంటిదే ఈ సీన్ కూడా… ఈటీవీ పాడుతా తీయగా షోకు సంబంధించి, ఇంకా పూర్తిగా చెడగొట్టబడని షో…
గాయని పేరు కీర్తన… రెండేళ్ల క్రితం… ఆ అమ్మాయి వయస్సు 12 ఏళ్లు, ఏడో తరగతి చదువుతోంది… ఆమె గురించి ఈమధ్యే ‘ముచ్చటించుకుంటున్నాం’ కూడా… గమకాలు, శృతులు, సంగతులు ఎట్సెట్రా టెక్నికల్ అంశాలను కాసేపు వదిలేస్తే… ఆ అమ్మాయిలో సహజమైన గాన విద్వత్తు ఉంది… దానికి తగిన గొంతు…
స్పష్టమైన ఉచ్ఛారణ, భావప్రకటన, సాధన, అణకువ, పాజిటివిటీ, ఏ జానరైనా అలవోకగా పర్‌ఫామ్ చేయగలగడం ఆ అమ్మాయి పాట విశేషాలు, ఆస్తులు… ఐతే ఓరోజు ఆమె ఎంచుకున్న పాట వెన్నెల్లో గోదారి అందం… సితార సినిమాలోనిది…
పాట అయిపోయింది… జడ్జిలు దగ్గరకు పిలుచుకుని ఆశీర్వదించారు… రంధ్రాన్వేషకులు విజయప్రకాష్, సునీత కూడా చప్పట్లు కొట్టారు… తరువాత ప్రేక్షకుల దగ్గరకు వెళ్లింది… అక్కడ తల్లి ఆనందంగా అలుముకుంది… సహజం… ఒక బిడ్డ, ఒక తల్లి… పక్కనే ఆమె తాత… మనవరాలి సాధనలో తనదీ ఓ పాత్రే…
పక్కనే మరొకామె… ఆమె కీర్తన గురువు… వైవీఎస్ పద్మావతి, ఆమె తిరుపతి వెంకటేశ్వర్ మ్యూజిక్ అండ్ డాన్స్ విభాగం ప్రిన్సిపల్‌గా చేసి రిటైరైంది… ఓసారి పాడుతా తీయగా షోకు జడ్జిగా కూడా వచ్చింది… కీర్తనను గట్టిగా కౌగిలించుకుని ముద్దులు పెట్టింది… ఏ శిష్యురాలికైనా గురువు నుంచి ఇలాంటి అభినందన అపురూపమే కదా…
ఏదీ కృతకం కాదు, ఆర్గనైజ్డ్ డ్రామా కాదు, ఆమె మనస్సులో నుంచి డివైన్ సోల్ అని ప్రశంసించింది… అప్పటికప్పుడు బయటికొచ్చిన వాస్తవ ఉద్వేగాలే అవన్నీ… ఆ అమ్మాయి కూడా కన్నీళ్లు పెట్టుకుంది, ఇదంతా ఊహించలేదు కదా…
ఆ రియల్ ఎమోషన్స్ టీవీ షోలలో కనిపించకుండా పోతున్న ఈ రోజుల్లో ఒకటీ అరా, ఎప్పుడో ఒకసారి ఇలాంటి సీన్లు కనిపిస్తాయి… నాకూ అనుకోకుండానే కనిపించింది… అందుకే ఇది చెెప్పుకోవడం… ఆ పాట లింక్ దిగువన…
రెొండేళ్ల క్రితం నాటి ఆ పాట తాలూకు యూట్యూబ్ వీడియో లింక్ ఇది…
Share this Article