.
ఈటీవీ పాడుతా తీయగా రజతోత్సవ సీజన్ అంటే 25వ సీజన్ గురించీ రాసుకున్నాం… ఈసారి కీరవాణి కూడా జడ్జిగా వచ్చాడు… కానీ 24వ సీజన్ ఫినాలే మూడు పార్టుల వీడియోలు చూస్తుంటే, చివరలో స్పాన్సర్ కనబరిచిన ఔదార్యం ఆశ్చర్యానికి గురిచేసింది… నిజంగానే చెప్పుకోవాల్సిన సంగతి…
క్రేన్ వక్కపొడి, దుర్గా నెయ్యి ఓనర్ గ్రంథి కాంతారావు… ఆయనే స్పాన్సర్… మామూలుగా ఇలాంటి ఫినాలేలు నాలుగు గోడల నడుమ స్టూడియోలో కానిచ్చేస్తుంటారు… కానీ ఈటీవీ కర్నూలులో బహిరంగంగా నిర్వహించింది… (స్వరాభిషేకం వంటి ప్రోగ్రామ్స్ ఈ టీవీకి అలవాటే… గుంటూరులో కూడా పాడుతా తీయగా ఓ సీజన్ ఫినాలే నిర్వహించినట్టు గుర్తు)…
Ads
ఆరుగురిని ఫినాలేలో పాడించారు… మొదట్లో ప్రకటించిన బహుమతి మొత్తాలు ఫస్ట్ ప్రయిజ్ 5 లక్షలు, సెకండ్ ప్రయిజ్ 3 లక్షలు, థర్డ్ ప్రయిజ్ 2 లక్షలు… వాగ్దేవి విజేత, ప్రకృతి రన్నరప్, ధీరజ్ సెకండ్ రన్నరప్… ఐతే హఠాత్తుగా స్పాన్సర్ ఆ ప్రయిజ్ అమౌంట్‌ను డబుల్ చేశాడు అక్కడికక్కడే… అనూహ్యం…
అంతేకాదు, ఎలిమినేట్ అయ్యిన ముగ్గురికి కూడా తలా రెండు లక్షలు ఇచ్చాడు… వావ్… జడ్జిలు, హోస్ట్ చరణ్ షాక్… 30వ సీజన్‌కు కూడా మీరే స్పాన్సరర్‌గా ఉండాలని అభివాదం చేశాడు చరణ్… (అదేమిటి తదుపరి సీజన్ 25 వది కదా..!! )
నిజానికి ఫినాలేలో చివరగా పాడింది ప్రణతి… (నభూతో అని జడ్జిలు అక్కడే కీర్తించారు, క్లిష్టమైన పాటే… మహాప్రాణదీపం పాట… కాకపోతే ఈ అమ్మాయి గొంతు ఎప్పుడూ జలుబు చేసినట్టు ధ్వనిస్తుంది… ఆ వాయిస్ కల్చర్ ఆమెకు కాస్త మైనస్… అలాగే చివరలో మ్ పలకాల్సిన చోట, ఉదాహరణకు శివమ్ అనాల్సినచోట శివౌ అంటోంది… హైపిచ్ సందర్భాల్లో… కానీ బ్రెత్ కంట్రోల్ భలే ఉంది…)
సరే, ఆమె ఫినాలే చివరి పాట పాడగానే వెంటనే విజేతల్ని ప్రకటించారు… అంటే ఫినాలే పర్‌ఫామెన్స్‌కు మార్కుల్లేవు, పరిగణనలోకి రాలేదన్నమాట… అంతకుముందే రిజల్ట్ డిసైడ్ చేసి పట్టుకొచ్చారన్నమాట… వాగ్దేవి, ప్రణతి ఇతర చానెళ్లలో గతంలో కంటెస్టెంట్లుగా పార్టిసిపేట్ చేసినవారే…)
వాగ్దేవి (ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ ఒక సీజన్ విజేత పేరు కూడా అదే) టాలెంటెండ్… పిల్ల కొంచెం, గాత్రం ఘనం అన్నట్టుగా ఏ జానర్ పాటయినా బాగా పాడుతుంది… ఆల్రెడీ సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నట్టు ఏదో వీడియో చూసినట్టు గుర్తు… పర్లేదు, విజేతగా మంచి ఎంపికే… ఓ మ్యూజికల్ ఫినాలే షోకు అంత మంది జనం రావడం, పద్ధతిగా ఎక్కడా ఏ చిన్న అపశృతి లేకుండా సాగడం.., ఆ నగర ప్రజల కళాభిరుచి, క్రమశిక్షణను అభినందించాల్సిందే…
Share this Article