.
మిత్రుడు, సీనియర్ జర్నలిస్టు Murali Buddha ఛాంపియన్స్ ట్రోఫీ విజయం అనంతరం రాసిన ఓ పోస్టు చదవండి ముందుగా…
నాకు క్రికెటర్ల పేర్లు తెలియవు, నేను క్రికెట్ చూడను … కానీ నిన్న ఒక దృశ్యానికి సంబంధించిన వీడియో తెగ నచ్చింది … కెమెరామెన్ సరిగా క్యాప్చర్ చేయలేదు కానీ … అసలైన దృశ్యం ఇదేకదా అనిపించి, బాగా నచ్చింది …
Ads
విజయం తరువాత గ్రౌండ్‌లో క్రికెట్ జట్టు మీద రంగురంగుల మెరుపు కాగితాలు వేశారు కదా… ఈ క్రికెటర్ కూతురు తండ్రి వెనక్కి వెళ్లి ఆ రంగుల కాగితాలు ఏరి కొన్ని తీసుకొచ్చి, తండ్రిపై వేసింది … కెమెరా ఈ కుటుంబం ఫోటో తీసే పనిలో ఆ దృశ్యాన్ని సరిగా క్యాప్చర్ చేయలేదు కానీ నాకు ఆ ఫోటోకన్నా ఆ చిన్న పిల్ల ఉత్సాహం బాగా నచ్చింది …
కొన్ని ఉద్వేగాలు అనిర్వచనీయం… భారత క్రీడాభిమానుల్లో ఉత్సాహం, గెలుపు అనంతరం స్టేడియంలో బాణాసంచా… జట్టు సభ్యులు స్టేడియంలో డాన్సులు, సంబరాలు… ఆ జట్టులో ఒకడైన తన తండ్రి మీద ఆ రంగు కాగితాలు మురిపెంగా చల్లి ఆ పిల్ల కూడా మురిసిపోయింది… బాగుంది కదా…
సోషల్ మీడియాలో చాలా పోస్టులు… ఓ గోల… ఆధునిక వస్త్రధారణతో కాదు, దుబయ్‌కి జడేజా భార్య చీర కట్టుకుని, అచ్చం భారతీయ మహిళలా కనిపిస్తోంది… విరాట్, రోహిత్ ఫ్యామిలీలకు తప్ప ఈమెకు ఒక్క లైక్ అయినా కొట్టరా అంటూ బోలెడు పోస్టులు…
పిచ్చి… వస్త్రధారణ ఎలా ఉండాలో ఆమె ఇష్టం… చీర కట్టుకుని వస్తేనే పద్ధతిగా ఉన్నట్టా..? చాలామంది ఆమె రవీంద్ర జడేజా భార్య అని తెలుసు గానీ, ఆమె నేపథ్యం తెలియదు… ఆమె భారతీయ జనతా పార్టీ శాసనసభ్యురాలు… ప్రజాజీవితంలో ఉంది… పేరు రివాబా… అసలు పేరు Rivasinh Hardevsinh Solanki…
రాజ్‌కోట స్వస్థలం… గుజరాత్ టెక్నలాజికల్ యూనివర్శిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివింది… శ్రీ మాతృశక్తి చారిటబుల్ ట్రస్టు స్థాపించి సోషల్ సర్వీసులో ఉండేది… మంచి వక్త… రాజకీయాలపై ఆసక్తి… సంఘ్ నుంచి ఎమర్జయిన మహిళ… రవీంద్ర జడేజా సొంత సిస్టర్ నైనా, ఈ రివాబా మంచి ఫ్రెండ్స్…
ఆమె ద్వారానే రవీంద్ర జడేజాతో ఈమెకు పరిచయం… అది కాస్తా పెళ్లి దాకా దారితీసింది… 2016లో రవీంద్ర జడేజాను పెళ్లి చేసుకుంది… ఫోటోలో కనిపిస్తున్న బిడ్డ పేరు నిద్యానా… ఇదీ ఆమె నేపథ్యం…
Share this Article