Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ ఒక్క సినిమా డైలాగ్‌కు… ఇప్పటికీ సొసైటీకి జవాబు దొరకలేదు…

March 12, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ………. కోర్టు కోర్టుకి, తీర్పు తీర్పుకి ఇంత మార్పుంటే మీ న్యాయస్థానంలో న్యాయం ఉన్నట్టా ! 42 ఏళ్ల తర్వాత కూడా జనం మరచిపోకుండా ఉపయోగిస్తున్న డైలాగ్ .

యన్టీఆర్- దాసరి- శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన మరో బ్లాక్ బస్టర్ బొబ్బిలి పులి సినిమా ఐకానిక్ డైలాగ్ . మరో సర్దార్ పాపారాయుడు . 39 సెంటర్లలో వంద రోజులు , రెండు సెంటర్లలో 175 రోజులు ఆడిన సూపర్ డూపర్ హిట్ . 1993 లో హైదరాబాదులో రెండో సారి విడుదలయి మళ్ళా 175 రోజులు ఆడిన సినిమా .

Ads

జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ అనే దాసరి వ్రాసిన పాట తెలుగు దేశం పార్టీ ఐకానిక్ ఉత్తేజకరమైన పాట . 1982 జూలైలో విడుదలయిన ఈ సినిమా టైంకే యన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీ ప్రచారం ప్రభంజనంలాగా సాగుతుంది .

ఆ టైంలో ఈ పాట వేయకుండా ఆయన మీటింగే లేదు . ఈ రోజుకీ TDP మీటింగుల్లో ఈ పాట వేయాల్సిందే . దీనితో పాటు మరో పాట . అదీ దాసరే వ్రాసారు . సంభవం నీకే సంభవం ధర్మానికి నువ్వే రాజువై న్యాయానికి నువ్వే మూర్తివై పాట .

ఈ సినిమాలో జనాన్ని ఊపేసిన పాట ఓ సుబ్బారావో ఓ అప్పారావో పాట . రాజమౌళి దర్శకత్వం వహించిన యమదొంగ , బాహుబలి సినిమాలలో ముగ్గురు డాన్సర్లే . ఈ బొబ్బిలి పులి సినిమాలో ఈ పాటలో ఏకంగా నలుగురు నాట్యించారు . విజయలలిత , జ్యోతిలక్ష్మి , జయమాలిని , సుభాషిణి . ఈ పాటనూ దాసరే వ్రాసారు .

దాసరి వ్రాసిన మరో డ్యూయెట్ సాంగ్ తెల్లా తెల్లని చీరెలోనా చందమామా కూడా చాలా బాగుంటుంది .
ఆరు పాటల్లో మిగిలిన రెండు పాటల్ని వేటూరి వారు వ్రాసారు . అది ఒకటో నంబరు బస్సు దాని యవ్వారం నాకు తెలుసు , ఎడ్డేమంటె తెడ్డేమంటే నడ్డి విరిగిపోతుంది . రెండూ యన్టీఆర్, శ్రీదేవిల మీద డ్యూయెట్లే . రెండూ హుషారుగానే ఉంటాయి . మొదటి పాటలో గొల్లపూడి , కంకిపాడు ప్రస్తావనలు కృష్ణా జిల్లా వాళ్ళకు బాగా హుషారును కలిగించాయి .

నటన పరంగా ఎప్పటిలాగే అగ్ర తాంబూలం యన్టీఆరుదే . దాసరి యన్టీఆర్ పాత్రను బ్రహ్మాండంగా మలిచారు . మహా వీర చక్ర పతకాన్ని పొందిన ఓ దేశభక్తుడయిన మిలిటరీ మేజర్ తనకు , సమాజానికి అన్యాయం చేసిన , చేస్తున్న చీడపురుగులను ఏరేయటానికి ఆవేశపరుడై చట్టాన్ని తన చేతులోకి తీసుకుని శిక్షించే బొబ్బిలి పులిగా మారటాన్ని దాసరి చాలా ఎఫెక్టివుగా తీర్చిదిద్దారు .

కోర్టు సీన్లో యన్టీఆర్ డైలాగులు , బొబ్బిలి పులి డెన్లో యన్టీఆర్- శ్రీదేవి , యన్టీఆర్- జగ్గయ్య డైలాగులు థియేటర్లలో యన్టీఆర్ అభిమానులకు పూనకం తెప్పించాయి . దాసరి సినిమా అంటేనే డ్రామా , డైలాగులు , ఎమోషన్స్ ఫుల్ . ఆ అగ్నికి యన్టీఆర్ లాంటి వాయువు తోడయితే చెప్పేదేముంది . ప్రభంజనం అవుతుంది . అదే అయింది ఈ సినిమాలో .

యన్టీఆర్ తర్వాత అద్భుతంగా నటించింది శ్రీదేవే . గ్లామర్ బొమ్మగా , తన ప్రియుడి చెల్లెలి పెళ్లి కోసం తన ప్రేమను త్యాగం చేసే నాయకిగా , కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటరుగా , తన ప్రియుడి భార్యకు తోడుగా ఉండే స్నేహితురాలిగా యన్టీఆర్ తో పోటీపడి నటించిందనే చెప్పాలి .

మిగిలిన ప్రధాన పాత్రల్లో సత్యనారాయణ , రావు గోపాలరావు , అల్లు రామలింగయ్య , మురళీమోహన్ , ప్రభాకరరెడ్డి , రావి కొండలరావు , భీమరాజు , ప్రసాద్ బాబు , త్యాగరాజు , రాజనాల , ధూళిపాళ , రాజా , జయచిత్ర , అంబిక , పుష్పలత , జయవిజయ , ప్రభృతులు నటించారు . విశేషం ఏమిటంటే సినిమాలో హాస్య నటీనటులు లేరనే విషయం కూడా ప్రేక్షకులు గమనించకుండా కట్టి పడేసే సినిమా .

దాసరి- యన్టీఆర్ కాంబినేషన్లో అయిదు సినిమాలు వస్తే మూడింటిలో యన్టీఆర్ ద్విపాత్రాభినయం . అలా ద్విపాత్రాభినయం లేకుండా సూపర్ హిట్టయిందీ సినిమా .ఈ సినిమా సూపర్ విజయానికి మరో కారణం జె వి రాఘవులు సంగీతం . పాటలకే కాదు ; బేక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది . బాలసుబ్రమణ్యం , సుశీలమ్మల గురించి చెప్పేదేముంది . ఈ సినిమాకు ఐకానిక్ పాటలయిన రెండు పాటల్నీ బాలసుబ్రమణ్యం బ్రహ్మాండంగా పాడారు .

హిందీలో జఖ్మీ షేర్ అనే టైటిలుతో దాసరే డైరెక్ట్ చేసారు . యన్టీఆర్ పాత్రను జితేంద్ర , శ్రీదేవి పాత్రను డింపుల్ కపాడియా , జయచిత్ర పాత్రను జయసుధ వేసారు . బాబీ సినిమా తర్వాత ఈ సినిమా ద్వారానే డింపుల్ సినీ రంగంలోకి పునఃప్రవేశం చేసింది . శ్రీదేవితో అసలు పోల్చలేం . యన్టీఆరుతో పోల్చాలంటే జితేంద్ర ఏం సరిపోతాడు !? మరో యన్టీఆర్ కావాల్సిందే .

బహుశా ఈ సినిమా చూడనివారు అప్పట్లో ఎవరూ ఉండరు . ఈతరంలో ఎవరయినా ఉంటే తప్పకుండా చూడండి . యూట్యూబులో ఉంది . An unmissable super duper movie totally filled with action , drama , emotions , romance and melodious , inspiring songs . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_కబుర్లు #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions