Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆమె మెడ వంచి, తాళికి మూడు ముళ్లు వేసేస్తే… ఇది పెళ్లంటారా..?

March 13, 2025 by M S R

.

Subramanyam Dogiparthi …….. ఏది పెళ్ళి ? కేవలం మూడు ముళ్ళు వేయటమేనా ? లేక కడదాకా భార్యను ప్రేమగా చూసుకోవటమా ? అనాదిగా వస్తున్న ప్రశ్నలే ఇవి .

భర్త మగాడు ఇద్దరు పెళ్ళాలతో ఊరేగేటప్పుడు , భార్య ఆడది ఇద్దరు మొగుళ్ళతో ఎందుకు ఊరేగకూడదు ? ఈ ప్రశ్ననే ఈ సినిమాలో రెండు పాత్రలు ప్రశ్నిస్తాయి . ఉండేది కాసేపే అయినా ఈ రెండు పాత్రల్లో నటించిన సువర్ణను , ఝాన్సీని ప్రేక్షకుడు మరవలేడు .

Ads

సప్తపది సినిమాలో విశ్వనాధ్ ఒక రకమైన ముగింపు ఇస్తే , రాధాకల్యాణం సినిమాలో బాపు/భాగ్యరాజ్ మరో రకమైన ముగింపు ఇచ్చారు . ఆ రెండు సినిమాలు పెళ్లి , తాళిబొట్టు చుట్టూనే తిరుగుతాయి . ఈ ఇది పెళ్ళంటారా సినిమా కూడా పెళ్లి , తాళిబొట్టు చుట్టూనే తిరుగుతుంది . సంచలనాత్మక కధతో వచ్చిన మంచి సినిమా . కానీ బొబ్బిలి పులి ప్రభంజనంలో తట్టుకోలేక పోయింది .

న్యాయం కావాలి సినిమాలో నిరసనగా పెళ్లి అక్కరలేదు పొమ్మని చెపుతుంది హీరోయిన్ రాధిక . ఈ సినిమాలో సేడిస్ట్ మొగుడు మొహాన తాళిబొట్టు విసిరేసి వెళ్ళిపోయి , విడాకులు తీసుకోకుండా మరో వ్యక్తిని వివాహం చేసుకుంటుంది హీరోయిన్ .

సేడిస్ట్ మొగుడుగా వికెడ్ సాఫ్ట్ విలన్ పాత్రలో గొల్లపూడి మారుతీరావు బాగా నటించారు . ప్రేక్షకులకు లేచి తన్ని వద్దామని అనిపిస్తుంది . అంత క్రూరంగా నటించారు . కధానాయకి రాధిక చాలా బాగా నటించింది . చిరంజీవి చాలా హుషారుగా , ఆదర్శవంతుడైన భర్తగా , భర్తంటే ఎలా ఉండాలో అలాగా బాగా నటించారు . ఇతర ప్రధాన పాత్రల్లో ప్రభాకరరెడ్డి , వుయ్యూరు రామకృష్ణ , మల్లికార్జునరావు , పి జె శర్మ ప్రభృతులు నటించారు .

సాధారణంగా మన సినిమాలు 1+2 . ఈ సినిమా 2+1 . అంటే ఒక హీరోకి ఇద్దరు హీరోయిన్లను చూపే మన సినిమాలలో ఈ సినిమా ఒక హీరోయిన్ ఇద్దరు భర్తలు . పెళ్ళి ఎలా ఆవిర్భవించిందో చెప్పటంతో టైటిల్స్ ప్రారంభం అవుతాయి .ముగింపు కూడా వాయిస్ ఓవర్ తోనే ముగిస్తుంది .

ఈ సినిమాకు గుండె కాయ కోర్ట్ సీన్ . ఎందుకనో పేలవంగా ఉందని అనిపిస్తుంది . న్యాయం కావాలి సినిమా లాగా సూపర్ హిట్ కాకపోవటానికి ఇది కూడా కారణం కావచ్చు . క్రాంతికుమార్ నిర్మాత . విజయభాస్కర్ దర్శకుడు . సత్యానంద్ డైలాగులు సినిమా అంతా పదునుగా ఉన్నా కోర్ట్ సీన్లో పస లేకుండాపోయాయి .

చక్రవర్తి సంగీతం శ్రావ్యంగా ఉంటుంది . పాటలు బయట హిట్ కాకపోయినా థియేటర్లో శ్రావ్యంగా ఉంటాయి . ముఖ్యంగా నా ఊపిరికే పరిమళమా నా పూజకు తులసీదళమా , వసంతం శరత్తు హేమంతం పాటలు చాలా శ్రావ్యంగా , అందంగా ఉంటాయి . పాటల్ని అన్నీ వేటూరే వ్రాసారు .

హరినారాయణా హరినారాయణా అనుకోరాదా మనసా అనే పాట అనంత శ్రీరాంకు గుర్తు లేకపోవటం వలన బతికిపోయింది కానీ లేకపోతే హైందవ శంఖారావం మీటింగులో కడిగి పారేసేవాడు .

1982 జూలై 16న వచ్చిన ఈ సినిమా చూడబుల్ సినిమాయే . చక్కని , శుభ్రమైన సంచలనాత్మక సందేశాత్మక ఈ సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూసి ఉండకపోతే తప్పక ట్రై చేయవచ్చు . చిరంజీవి అభిమానులు అయితే తప్పక చూడాల్సిందే .

శుభలేఖ , మంత్రి గారి వియ్యంకుడు వంటి సినిమాలలో ఎంత చక్కగా నటించారో ఈ సినిమాలో కూడా అలాగే నటించారు చిరంజీవి . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_కబుర్లు #తెలుగుసినిమాలు ….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!
  • Dekh Thamaashaa Dekh… ఓ కోర్టు కేసు విచారణపై ఫన్నీ ప్రజెంటేషన్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions