.
2024, మార్చి… డీఎంకే మంత్రి అంబరాసన్… ‘‘నేను మంత్రిని కాబట్టి సున్నితంగా మాట్లాడుతున్నా, మంత్రిని కాకపోయి ఉంటే ప్రధాని మోదీని ముక్కలుగా చేసేవాడిని…’’
2025, మార్చి… డీఎంకే మంత్రి దురై మురుగన్… ‘‘ఉత్తరాది మహిళలు 10 పెళ్లిళ్ల దాకా చేసుకుంటారు… 17, 18 మంది పిల్లల్ని కంటారు, వేరే పనే లేదు వాళ్లకు… అది వాళ్ల సంస్కృతి…’’
Ads
2025, ఫిబ్రవరి… ఎంపీ దయానిధి మారన్… పార్లమెంటులో… ‘‘లోకసభ వ్యవహారాన్ని సంస్కృతంలోకి అనువదించడం అంటే అది ఆర్ఎస్ఎస్ భావజాలపు పని… జనం కట్టే పన్నుల్ని వృథా చేయడమే…’’
2023, సెప్టెంబరు… మంత్రి ఉదయనిధి స్టాలిన్… ‘‘సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి… అది కూడా డెంగీ, మలేరియా వంటి వ్యాధే… నేను కరుణానిధి మనవడిని, నా వ్యాఖ్యలకు కట్టుబడే ఉంటా…’’
2024… ఫిబ్రవరి… ముఖ్యమంత్రి స్టాలిన్… ‘‘అర్జెంటుగా పిల్లల్ని కనడం స్టార్ట్ చేయండి, లేకపోతే మన ఎంపీ సీట్లు తగ్గిపోతాయి… నష్టపోతాం… దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గించేస్తారు…’’
2024, జనవరి… డీఎంకే జర్నలిస్టు ఉమ ఇలక్కియా… ‘‘రాముడు పెద్ద స్త్రీలోలుడు… హంతకుడు… తాగుబోతు… 1000 మంది స్త్రీలతో సంబంధాలుండేవి… ఉత్త పిరికిగొడ్డు… అందుకే సరయూ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు…’’
2022, మే… డీఎంకే విద్యా మంత్రి… ‘‘హిందీ మాట్లాడేవాళ్లు కోయంబత్తూరులో పానీపురి అమ్ముతుంటారు…’’
2022, జూలై… మాజీ కేంద్ర మంత్రి ఎ.రాజా… ‘‘మాకు గనుక స్వయం ప్రతిపత్తి ఇవ్వకపోతే పెరియార్ మార్గంలో వెళ్లాల్సి వస్తుంది, మోదీకి ఓ హెచ్చరిక…’’
2022, ఆగస్టు… డీఎంకే కూటమి పార్టీ వీసీకే డిప్యూటీ జనరల్ సెక్రెటరీ అన్ని అరసు… ‘‘ఇక సనాతన ధర్మ వ్యతిరేక పోరాటంతో, ప్రత్యేక తమిళదేశం కోసం పోరాడదాం…’’
.
ఇవన్నీ కొన్ని ఉదాహరణలు… అంటే దేశంలోని ఇతర పార్టీలు, అంటే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎట్సెట్రా నాయకులు ఇలాంటి వ్యాఖ్యలకు సంబంధించి శుద్ధపూసలని కాదు… ఎవరి ధోరణి వాళ్లదే… కానీ డీఎంకే నాయకుల తీరు మరీ ఎక్కువ మూర్ఖపు అతివాదం… ప్రతి ఇష్యూను సనాతన ధర్మానికీ, ఆర్ఎస్ఎస్‌కూ, హిందూ మతానికీ ముడిపెట్టి… హిందూ దేవుళ్లను కూడా తిట్టేస్తూ… విడిపోతాం, విడిపోతాం అనే ధోరణిలోకి వెళ్లిపోతుంటారు…
రూపాయి గుర్తు (అదీ ఒక డీఎంకే మాజీ ఎమ్మెల్యే కొడుకు రూపొందించిందే…) బదులు అర్జెంటుగా తమిళ భాషలో రూ సింబల్ పెట్టేశారు… ఇది హిందీ రుద్దుడుకు నిరసన అట… (ఇన్నాళ్లూ లేనిది ఇప్పుడే హఠాత్తుగా ఎందుకు గుర్తొచ్చింది, ఈనాడే వ్యతిరేకించాలి కదా అంటున్నది ఆర్థిక మంత్రి నిర్మల…)
సరే, ఎంపీ సీట్ల డీలిమిటేషన్, హిందీ రుద్దుడు విధానాలను ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిందే… బీజేపీ ఏం చెప్పుకున్నా సరే, ఆ సమర్థనలో పస లేదు, నార్త్ ఇండియా పొలిటికల్ పోకడలు ఎప్పుడూ సౌత్ ఇండియాకు నష్టదాయకాలే… ఐతే ప్రతి ప్రతిఘటన పోరాటానికి ఓ పద్ధతి ఉంటుంది… ఆ లక్ష్మణ రేఖను ఎప్పుడూ పట్టించుకోకపోవడమే డీఎంకే స్టయిల్…
రాజీవ్ గాంధీని బలిగొన్న ఎల్‌టీటీఈకి ఇదే డీఎంకే బలమైన మద్దతుదారు… ఇప్పుడు అదే డీఎంకేతో కాంగ్రెస్ పొత్తు… పొత్తు అనేంత పెద్ద పదం కూడా అవసరం లేదు, డీఎంకే ఎన్ని సీట్లు విసిరితే అన్ని సీట్లతో ఖుష్ కావల్సిందే… డీఎంకే కూటమిలో, డీఎంకే ఎన్ని సీట్లు విసిరితే అంతే తృప్తి పడి తోకలూపే పలు పార్టీల గతీ అంతే…
బీజేపీ తప్పుల్లేవా..? ఎందుకు లేవు… నిన్ననే కదా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ డీఎంకే ఎంపీలు అనాగరికులు అని కూశాడు… తమిళనాడులో ఎన్నికల వాతావరణం వచ్చేస్తోంది… డీఎంకే మళ్లీ హిందీ సెంటిమెంట్ రాజేస్తోంది… హిందీని నిర్బంధంగా రుద్దడం బీజేపీ క్షుద్రాలోచనే… తోడుగా ఈ ఎంపీ సీట్ల డీలిమిటేషన్ అస్త్రాన్ని కూడా బీజేపీయే ఇచ్చింది… అందుకే అఖిల పక్షభేటీలు, నిరసనలు, హిందీ వ్యతిరేక ఉద్యమాలతో డీఎంకే బీజేపీయే స్వయంగా ఇచ్చిన అస్త్రాలకు పదును పెడుతోంది…!!
Share this Article