Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అసలు ట్రంపుదే వలస కుటుంబం… పూర్తిగా చదవండి ఓసారి…

March 14, 2025 by M S R

.

Jaganadha Rao ….. చరిత్ర చదువుతున్నప్పుడు కొన్నిసార్లు అసహ్యం కలుగుతుంది, మరికొన్నిసార్లు కన్నీళ్ళు వస్తాయి, కొన్నిసార్లు ఆశ్చర్యం కలుగుతుంది. అన్నీ క్రోడీకరిస్తే, ఏ ఒక్కరినీ తక్కువగా చూడడం లేదా ఎక్కువగా చూడడం ఉండదు.

అందరికీ తెలిసిన ఒక ఎదిగిన వాడి కథ, చరిత్ర చూస్తే,.. ఆ కథకు చివరగా పాఠకుల ఇష్టం, ఎవరు ఏమి చెప్తారో…?

Ads

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ప్రపంచం మొత్తంలోని 200 దేశాల్లో ఎక్కువమంది ప్రజలకి తెలిసిన పేరు. కానీ డోనాల్డ్ ట్రంప్ తాత అమెరికాలో పుట్టలేదు, అలా అని లీగల్ గా అక్కడ అడుగు పెట్టలేదు, మెరిట్ ఆధారంగా కూడా అమెరికా రాలేదు.

డోనాల్డ్ ట్రంప్ తాత పేరు ఫ్రెడెరిక్ ట్రంప్. మన దేశంలో కూడా ఎంతో ఎదిగిన చాలా వ్యక్తుల డార్క్ సైడ్స్ ఉంటై, కానీ అవన్నీ మనం మాట్లాడుకోలేం.

ఫ్రెడెరిక్ ట్రంప్ ప్రస్తుత జర్మనీలోని బెవేరియా రాష్ట్రంలో పుట్టాడు. అతని తండ్రి 40 వ యేట చనిపోయాడు, అతని తల్లి కేథరిన్‌కు తనతో పాటు ఆరుగురు పిల్లలు ఉన్నారు. ఫ్రెడెరిక్ ట్రంప్ 16 వ వయసులో ఓడ ఎక్కి 1885 లో అమెరికాలోని న్యూ యార్క్ చేరుకున్నాడు, బతుకుతెరువు కోసం. అమెరికాలో అడుగు పెట్టినప్పుడు, “నీ చదువు, సంధ్య, వృత్తి ఏంటి?” అని అడిగినప్పుడు అతను రిజిస్టర్ లో NONE అంటే “ఏమీ లేదు” అని రాశాడు.

16 ఏళ్ల వయసులో న్యూయార్క్ లో అడుగు పెట్టిన మరుసటి రోజే ఒక జర్మన్ వ్యక్తి అతనికి పరిచయం అయ్యాడు, అతను బార్బర్ కోసం చూస్తున్నాడు. ఈ పిలగాడు జర్మనీలో ఉండగానే అదే పని చేసేవాడు… 6 సంవత్సరాలు బార్బర్‌గా న్యూయార్క్ లో పని చేసిన తరువాత, 1891 లో పశ్చిమ అమెరికా వైపు వాషింగ్టన్ రాష్ట్రాన్ని కొత్తగా చేర్చారు అని తెలుసుకున్నాడు. 1891 లో వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటిల్ పట్టణానికి మకాం మార్చాడు. 22 ఏళ్ల వయసులో, తన 6 సంవత్సరాల బార్బర్ ఉద్యోగం ద్వారా సంపాదించిన దానితో సియాటెల్ లో ఒక లాడ్జ్ కొన్నాడు.

విందు, మందు, వ్యభిచారం, గాంబ్లింగ్ లాంటి కార్యకలాపాలు ఉండటం ఆ లాడ్జ్ యొక్క ప్రత్యేకత. న్యూయార్క్ లో తనకు కనిపించినవన్నీ సియాటెల్ లో కూడా ఆ లాడ్జ్ లో నడిపించేవాడు.

3 సంవత్సరాల తర్వాత, వాషింగ్టన్ రాష్ట్రంలోని మోంటె క్రిస్టో ప్రాంతంలో బంగారం గనులు ఉన్నాయని అందరూ అంటుంటే, సియాటెల్ లోని తన లాడ్జ్ అమ్మేసి, 1893 లో మోంటె క్రిస్టోలో 200 డాలర్లతో 40 ఎకరాల భూమి కొన్నాడు. కొన్ని రోజుల తర్వాత, ఆ భూమిలో బంగారం లేదు అని తెలుసుకున్నాడు.

దీంతో, 1894 లో మోంటె క్రిస్టోలో ఒక లాడ్జ్ కట్టించి, విందు, మందు, పొందు వంటి కార్యాకలాపాలు కొనసాగించాడు. ఆ తర్వాత.., 2- 3 సంవత్సరాల తరువాత, పక్కన ఉన్న కెనడాలోని యుకాన్ ప్రాంతంలో బంగారు గనులు ఉన్నాయని తెలుసుకొని, వాషింగ్టన్ లో ఉన్న అన్ని ఆస్తులను అమ్మి కెనడాకు బయలుదేరాడు.

కెనడాలో అతని దశ పూర్తిగా మారింది. 1898 లో యుకాన్ ప్రాంతంలో మరో లాడ్జ్ కట్టించి, అక్కడ విందు, మందు, వ్యభిచారం వంటి కార్యకలాపాలను నిర్వహించాడు. మరియూ కెనడాలో బంగారం త్రవ్వకాల్లో బాగా కలిసి వచ్చింది. కెనడాలో బాగా సంపాదించిన తర్వాత, అక్కడ ప్రభుత్వాలు వ్యభిచారాన్ని నిషేధించడంతో 1901 లో జర్మనీలోకి తిరిగి వెళ్లిపోయాడు.

1901 లో తనకంటే 11 సంవత్సరాలు చిన్న, అందగత్తె అయిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఫ్రెడెరిక్ ట్రంప్… కానీ అతని తల్లి కేథరిన్ కోబర్ కు ఆ పెళ్లి నచ్చలేదు, అందుకే ఫ్రెడెరిక్ ట్రంప్ మళ్ళీ అమెరికాకు వచ్చి న్యూయార్క్ లో హోటల్ కీపర్ గా/మేనేజర్ గా జాయిన్ అయ్యాడు.

3 సంవత్సరాల తరువాత, ఒక కూతురు పుట్టిన తర్వాత, 1904 లో అతను పూర్తిగా జర్మనీకి తిరిగి వెళ్లిపోయాడు, తన కుటుంబంతో పాటు… అప్పుడు, మన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లాంటి డాక్యుమెంట్స్ కోసం జర్మనీలో అప్లై చేసినప్పుడు, ఫ్రెడెరిక్ ట్రంప్ ని అక్కడి ప్రభుత్వ అధికారులు పట్టుకున్నారు.

18 ఏళ్ల వయసులో, బెవేరియా రాజ్యంలో (ప్రస్తుత జర్మనీ రాష్ట్రం) ఖచ్చితంగా సైన్యంలో చేరాలని నిబంధన ఉండేది. ఫ్రెడెరిక్ ట్రంప్ సైన్యంలో చేరకుండా తప్పించుకోవటానికి అమెరికాకు వెళ్ళిపోయాడు. కానీ జర్మనీ తిరిగి వెళ్లినప్పుడు, ప్రభుత్వ అధికారులు అతనికి హెచ్చరిక ఇచ్చారు: “ఈ దేశంలో బతకటానికి నీవు అనర్హుడివి. 8 వారాల్లో దేశం విడిచి వెళ్లిపోవాలి, లేకపోతే జైల్లో పెడతాం…”

దీంతో, ఫ్రెడెరిక్ చేసేది లేక మళ్లీ తిరిగి అమెరికాకు వెళ్లిపోయాడు. న్యూయార్క్ చేరుకొని, అక్కడ 2 అంతస్థుల హోటల్ కొన్నాడు మరియు స్టాక్ మార్కెట్ లో కొంత పెట్టుబడులు పెట్టాడు. చివరికి, 49వ వయసులో స్పానిష్ ఫ్లూ వ్యాధి కారణంగా మరణించాడు…

ఫ్రెడెరిక్ ట్రంప్ కి ముగ్గురు పిల్లలు ఉన్నారు, అందులో ఒకరు డోనాల్డ్ ట్రంప్ తండ్రి ఫ్రెడెరిక్ క్రిస్ట్ ట్రంప్. ఫ్రెడెరిక్ క్రిస్ట్ ట్రంప్ కి ఆరుగురు పిల్లలు ఉన్నారు, అందులో మన కథ యొక్క హీరో, డోనాల్డ్ ట్రంప్ ఒకరు.

డోనాల్డ్ ట్రంప్ పెద్దన్న పైలెట్‌గా ఉండి చనిపోయినప్పుడు ఆస్థి పంపకాలు జరగలేదు. అప్పటికే తన తండ్రి నుంచి  మిలియన్ల కొద్దీ డాలర్లు తీసుకొని వ్యాపారం మొదలు పెట్టాడు డోనాల్డ్ ట్రంప్. డోనాల్డ్ ట్రంప్ అన్న పిల్లలు కూడా కేసు వేశారు, ఆస్థి పంపకాలు సరిగ్గా జరగలేదు అని. ఏమి జరిగిందో తెలియదు, కానీ డోనాల్డ్ ట్రంప్ తండ్రి సంతాన లో డోనాల్డ్ ట్రంప్ ఒక్కడే అత్యంత ధనవంతుడు అయ్యాడు…

డోనాల్డ్ ట్రంప్ అన్న కూతురు ట్రంప్ గురించి ఒక పుస్తకం కూడా రాసింది “టూ మచ్ ఈజ్ నెవర్ ఎనఫ్, హౌ మై ఫ్యామిలీ క్రియేటెడ్ ది వరల్డ్ మోస్ట్ డేంజరస్ మ్యాన్” అని…. ఇది డోనాల్డ్ ట్రంప్ ప్రస్థానం/ పుట్టు పూర్వోత్తరం…

ఈ ట్రంప్‌ని పక్కన పెట్టితే, అతని తాత‌ను జర్మనీ నుంచి బహిష్కరించకపోతే, ప్రస్తుతం జరుగుతున్న ట్రేడ్ వార్ వచ్చి ఉండేదే కాదు, అమెరికా అధ్యక్షుడు గా డోనాల్డ్ ట్రంప్ అయ్యేవాడు కాదు. జర్మనీలో ఏదో ఒక పని చేసుకుంటూ హాయిగా బతికేవాడు.

పొద్దున లేస్తే, ఇమ్మిగ్రేషన్ మీద మాట్లాడే ట్రంప్ కి తన తాత అమెరికాకు వచ్చేటప్పుడు ఏ పని లేకుండా, ఏ స్కిల్ లేకుండా, పొట్ట చేత పట్టుకొని వచ్చాడని తెలుసా?

డోనాల్డ్ ట్రంప్ తాత కెనడాలో బాగా సంపాదించాడు. ఆ సంపాదనకు వారసుడిగా, ఇప్పుడు స్నేహపూర్వక దేశం కెనడా మీద టారిఫ్‌లు, కోరి వైరం తెచ్చుకోవడం ఏంటో అర్థం కావడం లేదు. బతుకునిచ్చిన కెనడా మీద ప్రతాపం యేందో అర్ధం కాదు.

ఎదగాలి అంటే, ఫ్రెడెరిక్ ట్రంప్ కథను పూర్తిగా చదవాలి. జర్మనీలో పుట్టి, సైన్యంలో పనిచేయటం ఇష్టం లేక, ఏ పని లేక, చదువు లేక, పొట్ట చేత్తో పట్టుకొని అమెరికా వెళ్ళి, అక్కడ బార్బర్ గా పని చేసుకుంటూ, ఆ తర్వాత లాడ్జ్ నిర్వహణ, తదుపరి కెనడాలో బంగారు గనుల త్రవ్వకం, మరియూ లాడ్జ్ నిర్వహణ ప్రారంభించాడు.

బాగా డబ్బులు సంపాదించిన తర్వాత మాతృ దేశమే బెటర్ అని వెళ్తే, ఇమ్మిగ్రేషన్ రూల్స్ పాటించలేదని గెంటేస్తే, బతుకు తెరువు కోసం మళ్ళీ అమెరికాలోని న్యూ యార్క్ చేరి, హోటల్స్ కొనడం మొదలుపెట్టాడు. జర్మన్ అమెరికన్ అయిన ఫ్రెడెరిక్ ట్రంప్, తన పేరు మీద ఎక్కువ భూములు కొనటం రిస్క్ గా భావించి, తన పిల్లలకి భూములు కొన్నాడు… ఇలా ఎదిగిన వాళ్ళ చరిత్రలు ఉంటై అంటాడు ఒక రోమన్ తత్వవేత్త….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions