.
“పోన్ మ్యాన్” మళయాళం (తెలుగు అనువాదం) jio hotstar లో స్ట్రీమింగ్.
ఒక డిఫరెంట్ స్టోరీ లైన్ ని సినిమా కథగా మార్చి ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఈ కేరళ వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. వీళ్లు ఆలోచించి తీసే విధానానికి ప్రేక్షకులు ఫిదా అవ్వాల్సిందే. అలాంటి సినిమాలను ఓటీటీలోకి తెలుగులో డబ్ చేస్తూ ఇక్కడ కూడా మంచి సక్సెస్ అందుకుంటున్నారు.
Ads
అలా ఈ సినిమా హోళి పండుగ రోజు నుంచి జియోహాట్‌స్టార్ ద్వారా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ ఏడాది జనవరిలో మలయాళంలో రిలీజైన ఈ “పోన్ మ్యాన్” లో బేసిల్ జోసెఫ్, లీజోమోల్ జోస్ (జైభీమ్ సినతల్లి) నటించారు.
ఈ సినిమాలో కామెడీని పెంచడంతో పాటు ప్రేక్షకులను ఎమోషనల్ సీన్స్ తో మెస్మరైజ్ చేశారు. ఈ సినిమా చూసాక ఈ ఏడాది వచ్చిన బెస్ట్ మలయాళం మూవీ ఇదే అనిపిస్తుంది. ఐతే మలయాళంలో జనవరి 30న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు ఊహించిన రెస్పాన్స్ రాలేదు.
జోతిష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో “బేసిల్ జోసెఫ్” నటన అద్భుతంగా ఉంది. ఇతనికి ఈ ఏడాది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఫిల్మ్ ఇదే అవుతుంది. నిజానికి కామెడీ జానర్లో వచ్చిన ఈ చిత్రం ఎమోషనల్ సీన్లతో అలరిస్తుంది.
“పోన్‌మ్యాన్” స్టోరీ ప్లాట్ ఏంటంటే..?
పెళ్లిలో ఆడపిల్ల కట్నకానుకగా నగలు పెట్టలేని మధ్య తరగతి కుటుంబాలకు ఆ నగలను ఇచ్చీ, తర్వాత బంధువుల ద్వారా కట్నకానుకల రూపంలో వచ్చిన డబ్బును బంగారం ధరతో లెక్కించి తీసుకునే అజేష్ అనే ఓ యువకుడి చుట్టూ తిరిగే కథ.
అలా ఆ యువకుడు ఈ కుటుంబానికి 25 తులాల బంగారం ఇస్తాడు. ఆ ఇంటి అమ్మాయి పెళ్లి అయిన వెంటనే చదివింపుల డబ్బును తనకివ్వాలని కండీషన్ పెడతాడు. అనుకున్నట్టుగా ఆ పెళ్లికి ఆశించిన స్థాయిలో చదివింపులు రావు. 25 తులాల బంగారానికిగాను 13 తులాల బంగారానికి విలువ చేసేంత డబ్బులు మాత్రమే వస్తాయి.
మిగిలిన 12 తులాల బంగారం తనకు తిరిగి ఇవ్వాలని అతడు డిమాండ్ చేస్తాడు. కానీ.. ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకున్న యువకుడు, వాళ్ల కుటుంబం ఈ కట్నం కోసమే ఆమెను పెళ్లి చేసుకున్నారనీ తెలుస్తుంది. ఇక బంగారం రికవరీ అంత సులువు కాదు.
మరి ఆ బంగారాన్ని అతడు తిరిగి రాబట్టుకున్నాడా? ఈ సంఘటనతో అతని జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది? ఆ అమ్మాయి కాపురం ఏమౌతుంది? అనేది ఈ సినిమాలో చూడండి. ఓ రియల్ స్టోరీ ఆధారంగా రాసుకున్న కథ…
ఇప్పటికే “బేసిల్ జోసెఫ్” నటించిన తెలుగు డబ్బింగ్ సినిమాలు ఎన్నో వచ్చాయి. లాస్ట్ ఇయర్ “మంజుమ్మల్ బాయ్స్””సూక్ష్మ దర్శిని”లతో మంచి హిట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అతనికి ఇప్పుడు 2025లో ఫస్ట్ ది బెస్ట్ ఈ సినిమా. మంచి కుటుంబ కథా చిత్రం వీలుంటే చూసేయండి…
పొన్ మ్యాన్ అంటే..? పొన్ను అంటే బంగారం, మ్యాన్ అంటే మనిషి… బంగారంతో డీల్ చేసే మనిషి అని… బాగుంది టైటిల్…!
Share this Article