.
అనసమ్మతో ఇదే తంటా… నా ఇష్టమొచ్చినట్టు బట్టలేసుకుంటా, బికినీలో ఫోటో షూట్ చేసుకుని పబ్లిక్ డొమెయిన్‌లో పెడతా, నా మొగనికే ఏ బాధ లేదు, మీకేం నొప్పి, నన్నేమన్నా అంటే ఒక్కొక్కడినీ కేసుల్లో బుక్ చేస్తా…
ఇలా విరుచుకుపడుతుంది కదా… చాలా ఉదాహరణలు చూశాం కదా… అసలు ఆమెను ఎప్పుడూ లైవ్‌లో ఉంచేవే ఈ వివాదాలు, ఈ బెదిరింపులు, ఈ ఝలక్కులు… సరే, ప్రచారం కోసం ఆమె బాధ ఆమెది… అదొక పంథా అనుకుందాం…
Ads
కొన్నాళ్లుగా ఏమీ లేనట్టు అనిపించింది,… అలా సైలెంటుగా ఉంటే అన్సమ్మ ఎందుకు అవుతుంది…? ఓ రీసెంట్ వీడియో మళ్లీ వైరల్ అయిపోతోంది… వయస్సు పెరిగినా సరే తనను ఎవరూ ఆంటీ అనొద్దు అట… గతంలో కూడా ఇలాగే అందరినీ తిట్టిపోసింది తెలుసు కదా…
తాజాగా ఎక్కడో ఏదో కార్యక్రమంలో పాల్గొంది… ఎవరో చిలిపివాడు ఆంటీ అని పిలిచాడు… ఈసారి తిట్లకు పూనుకోలేదు ఆమె… ఆ వ్యక్తిని వేలు పెట్టి చూపిస్తూ, దమ్ముంటే పైకి రా అని పిలిచింది… ఏం రాలేవా..? ఉ– పడుతుందా అనీ సైగలు చేసింది… వామ్మో, అనసమ్మ తీరే వేరు…
అన్నట్టు… అనసమ్మ అంటే, ఆంటీ అంటే అంత కోపం దేనికి..? అవేమైనా తిట్లా..? ప్రేమతో పిలిచేవే కదా… ఎస్, ఆడవాళ్లు వయస్సు దాచుకుంటారు, చెప్పుకోరు, సహజం… కానీ మగాళ్లను 30, 35 దాటగానే అంకుల్ అని పిలుస్తుంటారు అదే ఏజ్ ఆడవాళ్లు కూడా… ఏం, ఉడుక్కుంటున్నారా..? లేదు కదా… ఇరవై, పాతిక ఏళ్ల అమ్మాయికి పెళ్లయి పిల్లాడో పిల్లో పుడితే అందరూ ఆంటీ అంటుంటారు… అది బూతు కాదు, అవమానించడం అసలే కాదు…
ఒక వ్యక్తి ఎలా కనిపిస్తే అలా పిలుస్తారు, తప్పేముంది..? నువ్వే కదా రంగమ్మత్త అనీ, ఆమధ్య ఏదో వేశ్య వేషం కూడా వేశావు కదా… రంగమ్మత్త అంటే రంగమ్మాంటీ అనే కదా… పోనీ, పాపం, దమ్ముంటే పైకిరా అన్నావు కదా… వాడెవడో తిక్కతో నిజంగానే వస్తే ఏం చేసేదానివి..? ఏం చేయించేదానివి..? పైగా ఉ– పడుతుందా అన్నట్టు సైగలు…
లుక్కును బట్టి రేప్పొద్దున ఎవరైనా పిల్లాడు బామ్మా అని పిలుస్తాడేమో, మరి అప్పుడెలా..? బికినీ ఫోజులు సోషల్ మీడియాలో పెడుతున్నా సరే, అందరూ ఇంకా ఆంటీగా చూస్తున్నారు తప్ప అమ్మాయిగా చూడటం లేదనే భావనా..?
భలేదానివే అనసమ్మా… నువ్వేమైనా టీన్స్‌లో ఉన్నావా..? యవ్వనంలో ఉన్నావా..? ఏదో ఆంటీ అని ప్రేమగా పిలిచాడు… దానికే ఉ– పడేట్టు బెదిరించాలా..?! (జస్ట్, ఇదీ ఓ సరదా కథనమే డియర్ శ్రీమతి అనసూయా భరద్వాజ్ మేడమ్ గారూ…)
Share this Article