.
గతంలో దినపత్రికల సండే సప్లిమెంట్స్‌లో ఆర్టికల్స్, భాష, ప్రజెంటేషన్ గట్రా నాణ్యంగా ఉండేవి… సాక్షి వచ్చాక ఫ్యామిలీ పేజీ కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది… కానీ ఇప్పుడు..?
ఆ సండే మ్యాగజైన్స్, ఫ్యామిలీ పేజెస్ తమ విలువను కోల్పోయాయి… రీడబులిటీ వేగంగా పతనమైపోయింది… నిన్న అనుకోకుండా సాక్షి సండే మ్యాగజైన్ చూడబడ్డాను… సునీతా విలియమ్స్ గురించిన స్టోరీ… హెడింగ్, లీడ్ చూడగానే ఆశ్చర్యంతోపాటు ఒకింత అసహ్యమూ కలిగింది…
Ads
ఎస్, 9 నెలలుగా అంతరిక్ష కేంద్రంలో చిక్కుబడిపోయిన సునీతను నాసా తీసుకురాలేకపోతోంది… ఆమెను తీసుకెళ్లిన బోయింగ్ స్టార్ లైనర్ చెడిపోయింది… 8 రోజులు అనుకున్న ప్రయాణం 9 నెలలు దాటినా ముగియలేదు… చివరకు ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ దగ్గర ఉన్న క్రూ-10 వ్యోమనౌక ద్వారా ఇద్దరు అస్ట్రోనాట్లను తిరిగి తీసుకురానున్నారు… నాసా ఘోరమైన ఫెయిల్యూర్…
సరే, సాక్షి సండే మ్యాగజైన్ ఆర్టికల్‌కు హెడింగ్, లీడ్ ఇలా ఉన్నాయి, చూడండి…
సునీత దిగొస్తే కల్పన మళ్లీ పుట్టినట్టే..! ఇదేం పోలిక..? దిక్కుమాలిన రాత… కల్పనా చావ్లా వ్యోమనౌక ప్రమాదంలో 22 ఏళ్ల క్రితం మరణించింది… సునీత తిరిగి వస్తే కల్పన మళ్లీ పుట్టినట్టు ఏమిటి..? పైగా సునీతకు స్పేస్ జర్నీ ఇది తొలిసారి కాదు… ఆ లీడ్ చూడండి… విశ్వాంతరాళంలోకి వెన్నెల కన్నులతో భూగోళమంతా ఎదురు చూస్తున్నదట,.. సరే, ఏదో కవి హృదయం ఏదో రాసింది అనుకుందాం…
దిగి నుంచి దిగిరావడం ఏమిటి..? అది దివి ఎలా అవుతుంది..? దివి అంటూ ఏమిటి మహాశయా..? అంతరిక్షమా, ఆకాశమా..? పాలపుంత పౌరులు అని మరోచోట రాశారు… పాలపుంత విస్తృతి ఎంతో తెలుసా అసలు వీళ్లకు..? పోనీ, ఈ కవి హృదయాన్ని బట్టి… కల్పన బర్త్ డే, సునీత తిరిగి రాక ఒకేసారి కాబట్టి అలా రాశారు అనుకుందాం…
కానీ కల్పన చావ్లా పుట్టింది మార్చి 17… కానీ సునీత విలియమ్స్ వచ్చేది 19 లేదా 20… ప్చ్, ఆ హెడింగ్ చూడగానే, ఆ లీడ్ చదవగానే ఇక ఆ స్టోరీ చదవబుద్ది కాలేదు… నిన్ననే సాక్షి తన మెయిన్ పేజీలో సునీత వచ్చేస్తుంది అని ఓ స్పాట్ వార్త ప్రచురించింది… అది వోకే, కానీ ఇదేరోజు సండే మ్యాగజైన్‌లో ఆమె మీద ఫీచర్, అదీ కల్పనతో పోలుస్తూ రాయడం అసమంజసం అనిపించింది… ఫాఫం, హేమిటో సాక్షిని అలా రోజురోజుకూ మారుస్తున్నారు..!!
Share this Article