·
డ్యాన్స్ చేయకపోతే.. పోలీసు ఉద్యోగం ఊడుతుంది
… ‘ఏయ్ సిపాయీ! దీపక్! ఇప్పుడొక పాట పెడ్తారు. దానికి నువ్వు డ్యాన్స్ చేయాలి. లేకపోతే నీ ఉద్యోగం ఊడుతుంది. తప్పుగా అనుకోకు, ఇవాళ హోలీ. అర్థమైంది కదా?’ అని అంటున్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా? బిహార్ మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు, ప్రస్తుతం ఆర్జేడీ పార్టీ ఎమ్మెల్యే తేజ్‌ప్రతాప్ యాదవ్.
హోలీ సందర్భంగా ఆయన ప్రవర్తించిన తీరు ఇది. మొన్న ఈ వీడియో వైరల్‌గా మారడంతో వెంటనే ఆయన సంజాయిషీ ఇచ్చారు. ‘నేను కావాలని అలా అనలేదు. ఆ ఉద్యోగి నాకు బాగా తెలుసు. పండగ ఉత్సాహంలో అలా పిలిచాను. ఎవరూ దీన్ని తప్పుగా తీసుకోవద్దు’ అని తెలిపారు.
Ads
… 36 ఏళ్ల తేజ్‌ప్రతాప్ యాదవ్ 2018లో బిహార్ మాజీ ముఖ్యమంత్రి దరోగా ప్రసాద్ రాయ్ మనవరాలైన ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు. వింత మనస్తత్వం కలిగిన తేజ్‌ప్రతాప్ డ్రగ్స్ తీసుకుంటాడని, రాత్రిపూట ఆడవాళ్ల బట్టలు వేసుకుంటాడని కొద్దిరోజులకే ఐశ్వర్య ఆరోపించింది.
ఆ సమయంలో తనను తీవ్రంగా హింసించేవాడని పేర్కొంది. తనను తాను శివుని అవతారం, రాధాకృష్ణుల అవతారం అంటూ ఆ వేషాలు వేసుకుని, పూజలు చేయించుకుంటాడని కూడా ఆమె తెలిపింది. అందుకు సంబంధించి కొన్ని ఫొటోలు కూడా బయటకు వచ్చాయి.
ఆయన మానసిక స్థితి సరిగా లేదని ప్రచారం జరిగింది. ఇంటర్మీడియేట్ మాత్రమే చదువుకున్న తేజ్‌ప్రతాప్ యాదవ్ మీద చాలా కేసులు కూడా నమోదయ్యాయి.
… అయినా, నితీష్ కుమార్ ప్రభుత్వంలో ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా పనిచేశారు. ఈ వింతలన్నీ బిహార్‌లోనే జరుగుతూ ఉంటాయి…. – విశీ (వి.సాయివంశీ)
[[ తెల్లారిలేస్తే మస్తు ప్రజాస్వామిక నీతులు చెబుతుంది ఆర్జేడీ పార్టీ… దాణా మింగిన కేసులో లాలూ జైలు పాలైతే వెంటనే భార్య కుర్చీ ఎక్కుతుంది… ఇదుగో ఈ దొరవారి సంగతి చూశాం… రెండుసార్లు మంత్రి… తన సోదరుడు తేజస్వి యాదవ్… తనూ ఇప్పుడు ఎమ్మెల్యే.
పార్టీ వ్యవహారాలు తనే చూస్తున్నాడు… కొంతకాలం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి… తను స్కూల్ డ్రాపవుట్… టెన్త్ కూడా చదవలేదు… వీళ్లు బీహారీ పాలకులు చాన్నాళ్లు… ఈ కుటుంబం గురించి చదువుతుంటే అదేమిటో గానీ విక్రమార్కుడు సినిమాలో విలన్ ఫ్యామిలీ గుర్తొస్తుంటుంది… — Muchata ]]
Share this Article