Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వేరొకరయితే… జయప్రద, శ్రీదేవి శంకరగిరి మాన్యాలు పట్టించేవాళ్లు..!!

March 18, 2025 by M S R

.
Subramanyam Dogiparthi ……. రామానాయుడు- రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన 1+ 2 సూపర్ డూపర్ హిట్ సినిమా సెప్టెంబరు 10, 1982న విడుదల అయిన ఈ దేవత … సాధారణంగానే మహిళలు దగ్గరుండి శోభన్ బాబు సినిమాలను ఆడిస్తారు . అందులోనూ ఈ సినిమా 1+ 2 సినిమా . ఇద్దరు అక్కాచెల్లెళ్ళు ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకుంటారు . వారిద్దరి కోసం హీరో గారూ త్యాగాలు చేస్తూనే ఉంటారు . ఇంక సిల్వర్ జూబిలీ ఆడించకుండా ఎలా ఉంటారు మహిళా ప్రేక్షకులు.. !?

ఈ సినిమా ఘన విజయానికి మరో ప్రధాన కారణం చక్రవర్తి సంగీతం , ఆత్రేయ వేటూరి పాటలు , రాఘవేంద్రరావు బిందెలు , సలీం నృత్య దర్శకత్వం . ఈ సినిమా ఐకానిక్ సాంగ్ వేటూరి వ్రాసిన ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్లా పడ్డాదమ్మా . ఓ అయిదారొందల బిందెలు పెట్టి ఉంటారేమో !

పూలు , పండ్లు , చీరెలు , బిందెలు కావేవీ రాఘవేంద్రరావు పాటలకు అనర్హం ! పాటల చిత్రీకరణలో ఆయనకు ఆయనే సాటి . ఈ పాటలో అతిలోకసుందరిని అద్భుతంగా చూపారు .

Ads

చీరె కట్టింది సింగారం చెంప పూసింది మందారం , కుడి కన్ను కొట్టగానే కుర్రాడ్ని ఎడం కన్ను కొట్టగానే ఎర్రోడ్ని , చల్లగాలి చెప్పేది ఏమని చల్లగా నూరేళ్ళు ఉండమని , ఎండావానా నీళ్ళాడాయి కొండకోనల్లో కొమ్మారెమ్మా పెళ్ళాడాయి కోనసీమల్లో చాలా శ్రావ్యంగా ఉంటాయి . బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , శైలజలు పాటల్ని పాడారు . సత్యానంద్ సంభాషణలు కూడా బాగుంటాయి .

ఈ సినిమాలో ఒక హీరో , ఇద్దరు షీరోలు ఉన్నారు . హీరో శోభన్ బాబు అయితే , ఇద్దరు షీరోలు శ్రీదేవి , జయప్రదలు . విలన్ మోహన్ బాబు . నలుగురూ చాలా బాగా నటించారు . ముఖ్యంగా జయప్రద , శ్రీదేవిలను అభినందించాలి . వీరిద్దరిలో ఎవరు దేవత ? ఇద్దరూ త్యాగాలు చేసిన వారే !

ఈ సినిమా షూటింగ్ టైంకు శ్రీదేవి , జయప్రదలకు ఇగో క్లాషెస్ వచ్చి పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి అట . ఒకరి మొహాన్ని మరొకరు చూడని పరిస్థితి అట . వీరిద్దరు ఒకరికి ఒకరు తారసపడకుండా ఇద్దరి జాయింట్ సీన్లను షూట్ చేసామని ఓ ఇంటర్వ్యూలో రాఘవేంద్రరావే చెప్పారు . బహుశా ఆలీతో సరదాగా ప్రోగ్రాంలో అనుకుంటా . Subject to correction . రామానాయుడు , రాఘవేంద్రరావులనే అన్ని ముప్పుతిప్పలు పెట్టారంటే మరొకర్ని అయితే శంకరగిరి మాన్యాల్ని పట్టించేవారే .

ఇతర ప్రధాన పాత్రల్లో రావు గోపాలరావు , నాగేష్ , సారధి , పుష్పలత , నిర్మలమ్మ , మమత , రమాప్రభ , డబ్బింగ్ జానకి ప్రభృతులు నటించారు . ఔట్ డోర్ షూటింగుల్ని పెద్దపట్నం , దోసకాయలపల్లి , కారంచేడులలో చేసారు . టైటిల్సులో ధన్యవాదాలు చెప్పారు .

ఈ సినిమాలో రాఘవేంద్రరావు శ్రీదేవి ఎడల పక్షపాతం చూపారు . ఆమెకేమో వందల వందల బిందెల్ని పెట్టి , జయప్రదకేమో పాండవ వనవాసం చీరెల్ని పెట్టారు .

మహిళలు మెచ్చిన సినిమా . మహిళలు సూపర్ హిట్ చేసిన సినిమా . 1965 లో వచ్చిన సావిత్రి , యన్టీఆర్ దేవత సినిమా కూడా సూపర్ హిట్టే . కధలు వేరనుకోండి . ఈ 1982 నాటి దేవత అక్కినేని , కృష్ణకుమారి , బి సరోజాదేవి పెళ్ళికానుక సినిమాకు కాస్త దగ్గరగా ఉంటుంది.

A neat , sentimental , emotional , musically excellent movie . యూట్యూబులో ఉంది . అతిలోకసుందరి , జయప్రద , శోభన్ బాబుల అభిమానులు ఇంతకుముందు చూసి ఉండకపోతే తప్పక అర్జెంటుగా చూసేయవచ్చు . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_కబుర్లు #తెలుగుసినిమాలు

.

.



“యెల్లువొచ్చి గోదారమ్మ” పాట చిత్రీకరణతో పాటు లిరిక్సూ ప్రత్యేకం! అర్థ భేదాలతో వచ్చే పదాల (యమకం అనే శబ్దాలంకారం)ను సాహిత్యంలో విరివిగా ఉపయోగించారు కవి. అవి..

ఈ కళ్లకున్న ఆ కళ్లలోనా..

అందాల విందమ్మ నువ్వు/ వద్దంటే విందమ్మ నవ్వు

కౌగిళ్లలో నన్ను కూడు/ ఆకళ్ల కుంటాది కూడు

కళ్లలో ఉన్నాయి ముళ్ళు/ నే కోరినా మూడు ముళ్ళు

…బొట్టెట్టి పోతుంటే/ కట్టేయనా తాళి బొట్టు

నా మాటకీ ఏరు తోడు/నీ తోడు లో ఊపిరాడు….. (Durgaa prasad)



 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రానున్న 48 గంటలు అత్యంత కీలకం – మధ్యప్రాచ్యం మండిపోతోంది
  • టాక్సిస్ పారడాక్స్..! ఓ అశ్లీల వ్యతిరేకి దాన్నే ఆశ్రయించడం..!!
  • యాదాద్రి, భద్రాద్రి… తెలంగాణ నెత్తిన రెండు తెల్ల ఏనుగులు…
  • సుహాసిని సరే… యాంగ్రీ రాజశేఖర్ శాకాహార సినిమాలూ చేయగలడు…
  • మర్యాద రేవంతన్న..! గౌరవనీయ కేసీయార్..! ప్రొటోకాల్ పాలిటిక్స్..!!
  • ది రాజా సాబ్..! ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్స్‌కూ మారుతి బలమైన దెబ్బ..!!
  • స్టార్ హీరో ఇమేజ్, డాన్సులు, ఫైట్లు, ఎలివేషన్లు ఉండగానే సరిపోదు..!!
  • కాంగ్రెస్‌తోపాటు బీజేపీ కూడా..! తెలంగాణకు కేసీయార్ జలద్రోహం- నిజాలు..!!
  • ‘ట్రంపరితనం’… ప్రపంచానికే వినాశకరం… ఏదో ముంచుకొస్తోంది…
  • వ్యాపిస్తున్న దుర్గంధం… తిట్ల పర్వంలో జాతీయ నేతలనూ వదలడం లేదు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions