Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ లోపాలు నానికి తెలియవు సరే.., దర్శకుడు చూసుకుని ఉండాల్సింది..!

March 18, 2025 by M S R

.
( Narukurti Sridhar ) …..ఇది కోర్ట్ రూమ్ డ్రామా అనొచ్చు కానీ , ‘ పింక్ ‘ లాంటి పదునైనది కాదు , మరాఠీ చిత్రం ‘ కోర్ట్ ‘ అంత రియలిస్టిక్ కూడా కాదు . తెరమీద సహజమైన పాత్రలు కనబడగానే “హమ్మయ్య చాన్నాళ్ళకు “ అని ఊపిరి పీల్చుకునే లోగానే, తెలుగు సినిమా తనకి బాగా అలవాటైన నాటకీయత వైపుకి పరుగు పెడుతుంది. దయా దాక్షిణ్యాలు మచ్చుకైనా లేని కర్కశుడైన విలన్ లేకుండా మనోళ్ళు సినిమా తీయలేరా!

కుటుంబ పరువు కోసం దేనికైనా తెగించే మంగపతి ( 17 ఏళ్ల కథానాయకురాలికి బాబాయ్) , తండ్రి లేని తన తోడల్లుని కూతురు ఒక వాచ్ మాన్ కొడుకుని ప్రేమించడం తట్టుకోలేక POCSO ( Protection of Children from Sexual Offences Act) కేసు పెట్టిస్తాడు .

మైనారిటీ తీరని అమ్మాయితో ఆమె అనుమతితోనే సంభోగం జరిపినా అది నేరం . చిన్న పిల్లలని అబ్యూజ్ చేసే పెద్దవాళ్లకి deterrent గా ఉండాల్సిన చట్టం పదిహేడేళ్ల అమ్మాయి , పంతొమ్మిదేళ్ల అబ్బాయిల మధ్య ప్రేమని కూడా అదే దృష్టితో చూడొచ్చా ! నిజానికి ఇది చాలా చర్చించాల్సిన సున్నితమైన విషయమే . అయితే కోర్ట్ రూమ్ సన్నివేశాల్ని ఇంకొంత సహజంగా రాసుకుని ఉండాల్సింది .

Ads

బాధితురాలిని కనీసం చూడకుండా , ముద్దాయితో మాట్లాడకుండా కేవలం 78 రోజుల్లో ఫైనల్ జడ్జ్మెంట్ ( పద్నాలుగేళ్ల జైలు ) ఇచ్చేసే జడ్జి , విలన్ క్యారెక్టర్ POCSO కేసు పెట్టమని చెప్పగానే అతనికి భయపడి ఇష్టం లేకున్నా, కనీసం బాధితురాలి స్టేట్మెంట్ లేకుండా కేసు పెట్టే పోలీసులు , ఇంట్లో అందరూ వద్దంటున్నా తన మాట నెగ్గడం కోసం ఎంతకైనా తెగించే విలన్ (మంగపతి పాత్ర వేసిన శివాజీ ) అబ్బాయి, అమ్మాయి రూమ్ లోకి వెళ్లి వచ్చిన వీడియో చూడగానే ఏదో జరిగిపోయినట్లు ఊహించుకుని ఆవేశపడే లాయర్, సినిమా లోని నాటకీయత కోసం ప్రవర్తించే పాత్రలుగా కనిపిస్తాయి . కొన్ని కోర్ట్ సన్నివేశాలు హాస్యాస్పదంగా ఉంటాయి .

అయితే సంభాషణలు , చిన్న చిన్న పాత్రలపై తీసుకున్న శ్రద్ధ , ఎంత నాటకీయంగా ఉన్నా చూడగలిగేలా బోరు కొట్టకుండా తీసిన సన్నివేశాలు , రిఫ్రెషింగ్ గా ఉన్న ముఖ్య పాత్రధారులు ( టీనేజర్స్) , మన ఇంటి చుట్టూ తిరిగే చిన్న చిన్న పాత్రలు చిత్రాన్ని ఆసక్తిగా చూడగలిగేలా చేస్తాయి .

చాలా లోపాలే ఉన్నాయి . అయితే వాటిని పట్టించుకోకుండా ప్రేక్షకులని ఆకట్టుకునే కథనం కూడా ఉంది . టీనేజ్ అమ్మాయి , ఆమె తల్లి , కథానాయకుడు , డిఫెన్స్ లాయర్ ( ప్రియదర్శి ) ల మధ్య కొన్ని హృద్యమైన సన్నివేశాలు మూవీపై ఇష్టాన్ని కలిగిస్తాయి .
ఇక వస్తువు విషయానికి వస్తే ….?

chatGPT ని అత్యధికంగా దుర్వినియోగానికి గురైన చట్టాలేవి అని అడిగి చూడండి .

SC/ST atrocities act , 498 (a) ( గృహ హింస ) , POCSO , UAPA ( The Unlawful Activities (Prevention) Act) మొదటి నాలుగు స్థానాల్లో వస్తాయి . బలహీనుల కోసం పెట్టబడిన చట్టాలు బలవంతులు తమ లాభం కోసం వాడుకోవడం మన అనాగరికతకి , కనీస నిజాయితీ గానీ, తోటి మనిషిపట్ల సహానుభూతి గానీ లేని లంచగొండి సమాజాన్ని పట్టిస్తుంది .

UAPA, మేధావులు , విజిల్ blowers పై ఉపయోగించడం ద్వారా దుర్వినియోగం అవుతుందని వాదించే వారు , మిగతా చట్టాల దుర్వినియోగంపై చర్చని కూడా ఆహ్వానించకపోవడం ఆశ్చర్యకరం .

ఏదేమైనా బాధితులని నిజాయితీగా గుర్తించి చట్టాలని విచక్షణతో అమలుపరచక పోతే ఇటువంటి చట్టాల వల్ల బలహీనులకు కూడా ఒరిగేదేమీ ఉండదు . చట్టాలను తప్పు పట్టడం కూడా అర్థ రహితం . కన్ఫెషన్ అలవాటులేని సమాజంలో కేవలం చట్టాలు చేయగలిగేది కూడా ఏమీ లేదేమో !

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నేపాల్ జనాగ్రహం వెనుక ఇది మరో కోణం… మనకూ డేంజరే…
  • అమృతాంటీ… మరీ అనసూయాంటీ ఆవహించిందా ఏమిటి..?!
  • డాక్టర్ సాబ్… 20 ఏళ్ల క్రితం నా ప్రాణాలు కాపాడారు గుర్తుందా..?
  • నవలా రాక్షసుడు + సినిమా రాక్షసుడు + నట రాక్షసుడు…!!
  • ఐఫోన్-17 సీరీస్… ఈ కొత్త మోడళ్ల అదిరిపోయే కీలక ఫీచర్స్ ఇవే…
  • ‘‘నీ పేరే పెట్టుకున్నాం, మా డ్రగ్ రాకెట్‌ను ఆశీర్వదించు మాతా…’’
  • లిటిల్ హార్ట్స్ సక్సెస్ సినిమా ఇండస్ట్రీకి చెబుతున్న పాఠమేమిటంటే..!
  • ఏమో, రమ్యకృష్ణే కావాలని ఆ బాహుబలి నిర్మాతే కోరుకున్నాడేమో…!
  • కాదు… ఆమె మరో షర్మిల కాదు… రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం ఉంటుంది…
  • మొన్న శ్రీలంక, నిన్న బంగ్లాదేశ్, నేడు నేపాల్… జనాగ్రహం బద్దలు..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions